హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మశాల లో నిర్వహించిన జన్ అభర్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.
వేదిక వద్దకు రావడానికి ముందు ప్రధాన మంత్రి ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి, అసమాన ధైర్యసాహసాలకు, ఆధ్యాత్మికతకు పేరెన్నికగల ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ అని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ కి హిమాచల్ ప్రదేశ్ తో ప్రత్యేక బంధం ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత ఏడాది కాలంలో గ్రామీణ ప్రాంతాల లోని ప్రజలకు వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువ అయిందని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తరం మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతున్నదని చెప్పారు. జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యుత్, సౌరవిద్యుత్,పెట్రోలియం రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్నాయని ప్రధాన మంత్రి చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా గల శక్తిని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మన దేశాన్ని సందర్శించేందుకు వస్తున్న విదేశీ పర్యాటకులు 2013 లో 70 లక్షల మంది ఉండగా, 2017 నాటికి వీరి సంఖ్య కోటి మందికి చేరిందని ప్రధాన మంత్రి చెప్పారు. అలాగే, 2013లో అనుమతి పొందిన హోటళ్ల సంఖ్య 1200 ఉండగా, అవి ప్రస్తుతం 1800 కు పెరిగాయని ప్రధాన మంత్రి తెలిపారు.
మన మాజీ సైనికులు నలభై సంవత్సరాలపాటు ‘ఒక ర్యాంకు, ఒకే పెన్షన్’ కోసం కోరుతూ వచ్చారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందుకు సంబంధించిన అంశాలు, వనరుల గురించి అర్ధం చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత మన మాజీ సైనికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఒ.ఆర్.ఒ.పి ని అమలు చేయడం జరిగిందని తెలిపారు.
అలాగే, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు కట్టుబడి స్వచ్ఛతకు కృషి చేస్తుండడం పట్ల ప్రధాన మంత్రి వారికి అభినందనలు తెలిపారు. స్వచ్ఛతను వారు ఒక సంస్కారంగా అంగీకరించారని ఆయన అన్నారు. ఇది రాష్ట్రం లో పర్యాటకరంగం ప్రగతికి దోహదపడుతుందని ప్రధాన మంత్రి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అవినీతికి ఏ రకంగా అడ్డుకట్టవేసినదీ ప్రధాన మంత్రి వివరించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అవినీతికి కళ్లెం వేశామని దీని ద్వారా సుమారు 90,000 కోట్ల రూపాయలు ఆదా అయినట్టు ఆయన తెలిపారు.
हिमाचल देवी और देवताओं की भूमि देवभूमि है, यहां का हर गाँव देवी-देवताओं का अपना गाँव है। हिमाचल देवभूमि होने के साथ-साथ वीरों की भूमि भी है, यहां शांति की कोख से वीरता पैदा होती है जो अपने आप में अक्षुण्ण होती है: PM @narendramodi https://t.co/T8xK0o7QK4
— narendramodi_in (@narendramodi_in) December 27, 2018
हिमाचल और अटल जी के बीच एक अटूट नाता रहा है। उनके लिए तो हिमाचल उनका दूसरा घर हुआ करता था: PM @narendramodi https://t.co/T8xK0o7QK4
— narendramodi_in (@narendramodi_in) December 27, 2018
ऐसा कहा जाता है पहाड़ का पानी और पहाड़ की जवानी कभी पहाड़ के काम नहीं आती है लेकिन आज यहां कि सरकार ने ऐसा काम किया है कि पहाड़ का पानी भी पहाड़ के काम आ रहा है और पहाड़ की जवानी भी पहाड़ के काम आ रही है: PM @narendramodi https://t.co/T8xK0o7QK4
— narendramodi_in (@narendramodi_in) December 27, 2018
हिमाचल की @jairamthakurbjp सरकार ने पिछले एक साल में जन-जन तक पहुंचने का काम किया है और सरकार को हिमाचल के गाँव-गाँव तक पहुंचाया है: PM @narendramodi https://t.co/T8xK0o7QK4
— narendramodi_in (@narendramodi_in) December 27, 2018
हम next generation infrastructure पर बल दे रहे हैं। आज हाई–वे हो, रेलवे हो, बिजली हो, सोलर सिस्टम हो, petroleum व्यवस्था हो... भारत सरकार के कई प्रोजेक्ट हिमाचल प्रदेश में चल रहे हैं: PM @narendramodi https://t.co/T8xK0o7QK4
— narendramodi_in (@narendramodi_in) December 27, 2018
2013 में जहां पूरे भारत में विदेशी पर्यटकों के आने की संख्या 70 लाख थी, वहीं 2017 में यह संख्या बढ़कर 1 करोड़ के पार पहुंच गई: PM @narendramodi https://t.co/T8xK0o7QK4
— narendramodi_in (@narendramodi_in) December 27, 2018
2013 में भारत में approved होटलों की संख्या करीब 1200 थी जो 4 साल में बढ़कर करीब 1800 हो गई है: PM @narendramodi https://t.co/T8xK0o7QK4
— narendramodi_in (@narendramodi_in) December 27, 2018
For forty years, our ex-servicemen longed for 'One Rank, One Pension'. Previous government allocated a mere Rs. 500 crore for it. But when we came to power, we implemented OROP and ensured welfare of our ex-servicemen: PM @narendramodi https://t.co/T8xK0o7QK4
— narendramodi_in (@narendramodi_in) December 27, 2018
I commend the people of Himachal Pradesh for furthering cleanliness. They have accepted 'Swachhata' as a 'Sanskaar'. This also augurs well for the tourism sector in the state: PM @narendramodi https://t.co/T8xK0o7QK4
— narendramodi_in (@narendramodi_in) December 27, 2018
Through Direct Benefit Transfer, we have put a check on corruption and saved nearly Rs. 90,000 crore: PM @narendramodi https://t.co/T8xK0o7QK4
— narendramodi_in (@narendramodi_in) December 27, 2018