The setback in Chandrayaan landing has only made India’s resolve to land on the moon even stronger: PM Modi
Despite setbacks in landing, we must remember that Chandryaan had quite successful journey until now: Prime Minister Modi
We must not be disappointed that Chandrayaan was not able to land on the moon, instead, we need to learn from our mistakes and keep going till we are successful: PM Modi

ఐఎస్ఆర్ఒ (‘ఇస్రో’) ప్ర‌ధాన కేంద్రం లోని నియంత్ర‌ణ కేంద్రం తో చంద్ర‌యాన్ 2 మిశ‌న్ త‌న సందేశాన్ని కోల్పోయిన‌ప్ప‌టి నుండి,  బెంగ‌ళూరు లో ఇస్రో శాస్త్రవేత్త‌ల తో పాటు బెంగళూరు లో చంద్ర‌యాన్ 2 అవ‌రోహ‌ణ ను వీక్షించిన ప్రధాన మంత్రి  “మ‌న శాస్త్రవేత్త ల‌ను చూసి భార‌త‌దేశం గ‌ర్విస్తోంది.  వారు వారి యొక్క శ్రేష్ట‌ ప్ర‌ద‌ర్శ‌న ను కనబరచి భార‌త‌దేశం ఎల్ల‌వేళ‌లా గ‌ర్వ‌ప‌డేట‌ట్టు చేశారు.  ఇవి ధైర్యం గా ఉండ‌వ‌ల‌సిన క్ష‌ణాలు,  మ‌రి మ‌నం ధైర్యం గా ఉందాం” అన్నారు.

శాస్త్రవేత్త‌ ల నైతిక స్థైర్యాన్ని ప్ర‌ధాన మంత్రి ఉత్తేజ‌ితం చేస్తూ, “యావత్తు దేశం మీ వెన్నంటి నిల‌చింది,  నేను కూడా మీతోనే ఉన్నాను.  (మీరు) చేసినటువంటి కృషి ఎంతో విలువైంది; అదే విధం గా ఈ యాత్ర కూడాను ఎంతో విలువైంది” అన్నారు.

“మీరు భ‌ర‌త మాత విజ‌యం కోసం కృషి చేసిన‌టువంటి వ్య‌క్తులు.  భ‌ర‌త మాత కోసం మీరు సంఘ‌ర్షిస్తున్నారు.  ఆమె గర్వించేలా చేసే ధైర్యం, పట్టుదల మీ లో ఉన్నాయి.”

“నిన్న‌టి రాత్రి మీలో వ్యక్తమైన భావోద్వేగాన్ని, ఇంకా విషణ్ణత ను నేను అర్థం చేసుకోగ‌ల‌ను.  వాహ‌క నౌక నుండి సంబంధం తెగిపోయిన‌ప్పుడు నేను మీ మధ్యే ఉన్నాను.  స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్న‌లు అనేకం ఉన్నాయి.  అయితే, మీరు జవాబులను  క‌నుగొనగలరన్న నమ్మకం నాలో ఉంది.  దీని వెనుక క‌ఠోర‌ శ్ర‌మ ఉన్న‌ద‌న్న సంగతి ని నేను ఎరుగుదును.”

“మ‌నం మన ప్ర‌యాణం లో ఒక చిన్న ప‌రాజ‌యాన్ని ఎదుర్కొని ఉంటే ఉండ‌వ‌చ్చును.  కానీ, ఇది మ‌న లక్ష్యాలను సాధించాలన్న మన అభినివేశం పైన, ఉత్సుకత పైన నీళ్ళు చ‌ల్ల‌కూడదు.’’

మ‌న సంక‌ల్పం ఇప్పుడు బ‌ల‌వ‌త్త‌రం అయింది.”
 
‘‘మ‌న శాస్త్రవేత్త‌ల కు మ‌ద్ధ‌తు గా గ‌డ‌చిన రోజు రాత్రి యావ‌త్తు దేశ ప్ర‌జ‌లు మేల్కొని ఉండిపోయారు.  మ‌నం చంద్ర గ్ర‌హం యొక్క ఉప‌రిత‌లాని కి అత్యంత స‌మీపాని కి వెళ్ళాము.  మ‌రి ఈ కృషి అత్యంత శ్లాఘ‌నీయ‌మైనటువంటిది. ” 

“మ‌న అంత‌రిక్ష కార్య‌క్ర‌మం మ‌రియు శాస్త్రవేత్త‌ల క‌ఠోర శ్ర‌మ‌, ఇంకా దృఢ సంకల్పం మ‌న పౌరుల‌ కు ఒక్క‌రి కే కాకుండా ఇత‌ర దేశాల కు కూడా ఒక ఉత్త‌మమైనటువంటి జీవ‌నాని కి పూచీ ప‌డడం పట్ల మ‌నం గ‌ర్వం గా ఉన్నాము.  వారి లో నూతన ఆవిష్కరణ ల పట్ల ఉన్నటువంటి ఉత్సాహం తాలూకు ఫ‌లితం గా ఎంతో మంది ప్ర‌జ‌లు చ‌క్క‌ని ఆరోగ్య సంర‌క్ష‌ణ ను మ‌రియు విద్య ను, ఇంకా నాణ్య‌మైన జీవ‌నాన్ని అందుకొన్నారు.”

“సంతోషించే మ‌రిన్ని అతిశ‌య ఘ‌డియ‌లు మ‌న ముందుకు వ‌స్తాయ‌న్న సంగ‌తి భార‌త‌దేశాని కి తెలుసు.”

“రోద‌సి కార్యక్రమం విష‌యాని కి వ‌స్తే అత్యుత్త‌మ‌మైంది ఇంకా మిగిలే ఉంది.”

‘‘అన్వేషించ‌వ‌ల‌సినటువంటి నూత‌న సీమ‌లు మ‌రియు వెళ్లవలసినటువంటి కొత్త ప్ర‌దేశాలు ఉండనే ఉన్నాయి.  మ‌నం సంద‌ర్భాని కి త‌గిన‌ట్లుగా ఎదుగుతూ స‌ఫ‌ల‌త లో స‌రిక్రొత్త శిఖ‌రాల ను అందుకొంటాము.’’

‘‘నేను మ‌న శాస్త్రవేత్త‌ల కు ఏమి చెప్పాల‌ని కోరుకుంటున్నానంటే, భార‌త‌దేశం మీ వెంట ఉంది అని.  మీ స్వ‌భావాని కి త‌గిన‌ట్లు గానే మీరు ఇదివ‌ర‌కు ఎన్న‌డూ, ఎవ్వ‌రూ వెళ్ళ‌న‌టువంటి చోటు కు వెళ్ళే ప్ర‌య‌త్నాన్ని చేశారు.’’

‘‘మీరు వెళ్ళ‌గ‌లిగినంత చేరువ‌ కు వెళ్ళారు.  ఈ ప్ర‌య‌త్నం ఎంతో విలువైంద‌ని, మ‌రి అలాగే ఈ యాత్ర కూడా ఎంతో విలువైంద‌ని నేను గ‌ర్వం గా చెప్ప‌గ‌ల‌ను.’’

‘‘మ‌న బృందం క‌ష్ట‌ప‌డి పని చేసింది.  చాలా దూరం ప్ర‌యాణించింది.  మ‌రి ఆ బోధ‌న‌ లు మ‌న‌తో ఎల్ల‌ప్ప‌టికీ ఉండిపోతాయి.’’

‘‘నేడు మ‌నం నేర్చుకొన్న‌ది మరింత శ‌క్తివంత‌మైన‌టువంటి మ‌రియు ఉత్త‌మ‌మైన‌టువంటి రేప‌టి రోజును మ‌న‌కు ప్ర‌సాదిస్తుంది.’’

‘‘మ‌న అంత‌రిక్ష శాస్త్రవేత్త‌ల కుటుంబాల కు నేను ధ‌న్య‌వాదాలు ప‌లుకుతున్నాను.  వారి యొక్క నిశ్శ‌బ్ధ‌మైన‌టువంటి మరియు విలువైన‌టువంటి మ‌ద్ధ‌తు మ‌న కృషి లో ఒక ప్ర‌ధానమైన శ‌క్తి గా ఉంటుంది. ’’

‘‘సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా, ప‌ట్టుద‌ల, ఇంకా హుషారు.. ఇవి భార‌త‌దేశ మ‌ర్యాద కు కేంద్ర బిందువు గా ఉన్నాయి.  మ‌న భ‌వ్య‌మైన‌టువంటి చ‌రిత్ర లో మ‌నం మ‌న‌ల్ని తొక్కివేసే క్ష‌ణాల ను ఎన్నింటినో ఎదుర్కొంటే ఎదుర్కొని ఉండ‌వ‌చ్చు.  అయితే, మ‌నం ఎన్న‌టి కీ చేతులు ఎత్తేయలేదు.  ఈ కార‌ణం గానే మ‌న నాగ‌ర‌క‌త స‌మున్న‌తం గా నిల‌బ‌డుతోంది. ’’
 
‘‘మ‌నం చారిత్ర‌క కార్య సాధ‌న‌ల ను చేజిక్కించుకున్నాము. ఇస్రో వైఫ‌ల్యా ల‌కు కుంగిపోదన్న సంగతి ని నేను ఎరుగుదును. ’’  

‘‘ఒక నూత‌నమైన‌టువంటి తొలి సంధ్య  మ‌రియు ఒక ఉత్త‌మ‌మైన రేప‌టి రోజు అనేవి వ‌స్తాయి. ఫ‌లితాల ను గురించి ఆందోళ‌న చెంద‌కుండా మ‌నం ముందుకు పోదాము.  మ‌రి ఇదే మ‌న‌కు చ‌రిత్ర గా ఉంటూ వ‌స్తోంది. ’’ 
 
మీ యందు నాకు నమ్మ‌కం ఉంది.  మీ యొక్క స్వ‌ప్నాలు నా స్వ‌ప్నాల క‌న్నా ఉన్న‌త‌మైన‌టువంటివి.  మ‌రి మీ యొక్క ఆశ‌ ల ప‌ట్ల నేను పూర్తి న‌మ్మ‌కం తో ఉన్నాను.  

మీ వ‌ద్ద నుండి స్ఫూర్తి ని పొంద‌డం కోసం నేను మీతో భేటీ అవుతున్నాను.  మీరు ఒక స్ఫూర్తి స‌ముద్రం గా ఉన్నారు.  అంతేకాదు, ప్రేర‌ణ‌ కు ఒక స‌జీవ‌మైన సాక్ష్యం కూడాను.
 
మీ అంద‌రికీ నా యొక్క శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.  మీ భావి ప్ర‌య‌త్నాలు విజ‌య‌వంతం అగుగాక‌.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi