Technology has become an integral part of everyone’s lives: PM Modi
Through technology, we are ensuring last mile delivery of government services: PM Modi
Through Atal Tinkering Labs in schools, we are promoting innovation and developing a technological temperament among the younger generations: PM
Science is universal, technology has to be local: PM Narendra Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఇండియా-ఇట‌లీ టెక్నాల‌జీ స‌మిట్ లో ఈ రోజు ప్ర‌సంగించారు. ఇట‌లీ ప్ర‌ధాని శ్రీ జుసైప్పె కోంతె కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు.

ఇండియా- ఇట‌లీ ఇండ‌స్ట్రియ‌ల్ రిస‌ర్చ్ అండ్ డివెల‌ప్‌మెంట్ కోఆప‌రేశ‌న్ ప్రోగ్రామ్ త‌దుప‌రి ద‌శ ప్రారంభం అవుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మం మ‌న ప‌రిశ్ర‌మ మ‌రియు ప‌రిశోధ‌న సంస్థ‌ లు నూత‌న ఉత్ప‌త్తులను అభివృద్ధి చేసేందుకు తోడ్ప‌డగలద‌ని ఆయ‌న అన్నారు.

సాంకేతిక విజ్ఞానానికి గ‌ల ప్రాముఖ్యాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి చెబుతూ, సామాజిక న్యాయాన్ని, సాధికారిత ను, చేరిక ను మ‌రియు పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని సాధించే ఒక మాధ్య‌మం గా సాంకేతిక విజ్ఞానాన్ని భార‌త‌దేశం మ‌ల‌చుకొంద‌న్నారు. సేవ‌లు వ‌రుస‌ లోని ఆఖ‌రి వ్య‌క్తి కి కూడా అందేట‌ట్లు చూసేందుకు సాంకేతిక‌త‌ ను ప్ర‌భుత్వం ఉప‌యోగించుకొంటోంద‌ని కూడా ఆయ‌న తెలిపారు.

పౌరుల లో సాంకేతిక విజ్ఞానం తో పాటు, విజ్ఞాన శాస్త్ర సంబంధ‌ చైతన్యాన్ని పెంపొందించ‌డానికి ప్ర‌భుత్వం ప్రాముఖ్యాన్ని ఇస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ సంద‌ర్భం లో శ్రీ మోదీ దేశం అంత‌టా అట‌ల్ ఇన‌వేశ‌న్ మిష‌న్, ఉమంగ్ యాప్ ల‌తో పాటు మూడు ల‌క్ష‌ల కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు విస్త‌రించిన‌ సంగతిని ప్ర‌స్తావించారు. ఈ సాంకేతిక విజ్ఞాన ప‌ర‌మైన ప‌రిష్కార మార్గాలు ప్ర‌భుత్వాన్ని పౌరుల ముంగిట‌ కు వెళ్ళేట‌ట్లు చేశాయ‌ని ఆయ‌న చెప్పారు.

భార‌తీయ అంత‌రిక్ష కార్య‌క్ర‌మాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖంగా పేర్కొంటూ, ఇది నాణ్య‌త తో కూడిన నూత‌న ఆవిష్కారానికి ఒక ఉదాహ‌ర‌ణ అని వివ‌రించారు. ఇట‌లీ స‌హా అనేక దేశాల‌ కు అంత‌రిక్ష ఉప‌గ్ర‌హాల ను పంపించ‌గ‌లిగే స్థితి కి భార‌త‌దేశం ప్ర‌స్తుతం చేరుకొంద‌ని, త‌క్కువ ఖ‌ర్చు లో నూత‌న ఆవిష్కారాల‌ తో కూడిన ప‌రిష్కార మార్గాల‌ ను సృజించేందుకు భార‌త‌దేశానికి ఉన్న సామ‌ర్ధ్యాన్ని ఈ పరిణామం చాటి చెబుతోంద‌న్నారు.

లైఫ్ స్టైల్ ఏక్స‌ెసరిస్ డిజైన్ (ఎల్ఎడి) రంగం లో భార‌త‌దేశానికి, ఇట‌లీ కి మ‌ధ్య స‌హ‌కారం పెంపొంద‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. తోలు రంగం పైన మ‌రియు ట్రాన్స్‌పోర్టేశ‌న్ అండ్ ఆటోమొబైల్ డిజైన్ (టిఎడి) పైన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

 

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi