QuoteIndia is working to become a $5 trillion economy: PM Modi in Houston #HowdyModi
QuoteBe it the 9/11 or 26/11 attacks, the brainchild is is always found at the same place: PM #HowdyModi
QuoteWith abrogation of Article 370, Jammu, Kashmir and Ladakh have got equal rights as rest of India: PM Modi #HowdyModi
QuoteData is the new gold: PM Modi #HowdyModi
QuoteAnswer to Howdy Modi is 'Everything is fine in India': PM #HowdyModi
QuoteWe are challenging ourselves; we are changing ourselves: PM Modi in Houston #HowdyModi
QuoteWe are aiming high; we are achieving higher: PM Modi #HowdyModi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెక్సాస్‌ లోని హ్యూస్ట‌న్ లో గ‌ల ఎన్ఆర్‌జి స్టేడియ‌మ్ లో జ‌రిగిన ‘హౌడీ మోదీ’ కార్య‌క్ర‌మం లో యాభై వేల మంది కి పైగా స‌భికుల ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.  ప్రధాన మంత్రి వెంట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్య‌క్షుడు శ్రీ డోనాల్డ్ జె ట్రంప్ ఉన్నారు.

|

భారీ సంఖ్య లో త‌ర‌లి వ‌చ్చిన స‌భికుల ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, హ్యూస్ట‌న్ లోని వేదిక సాక్షి గా కొత్త చ‌రిత్ర మ‌రియు కొత్త అనుబంధం ఆవిష్కారం అవుతున్నాయ‌న్నారు.  “శ్రీ డోనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమాని కి హాజ‌రు కావ‌డం, భార‌త‌దేశం యొక్క ప్ర‌గ‌తి ని గురించి సెనేట్ స‌భ్యులు మాట్లాడ‌డం 1.3 బిలియ‌న్ భార‌తీయుల కార్య‌సిద్ధి కి  గౌర‌వాన్ని ఇవ్వడం’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  స్టేడియ‌మ్ లో తొణికిసలాడుతున్న ఉత్సాహం యునైటెడ్ స్టేట్స్ కు మరియు భార‌త‌దేశాని కి మ‌ధ్య సహకారం పెంపొందుతోందని   నిరూపిస్తోంద‌న్నారు.

|

 

‘‘ఈ కార్య‌క్ర‌మాని కి ‘హౌడీ మోదీ’ అనే పేరు ను పెట్టారు.  అయితే ఒక్క మోదీ తో ఏమీ అవదు.  భార‌త‌దేశం లోని 130 కోట్ల మంది ప్ర‌జల ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చ‌డం కోసం కృషి చేస్తున్న‌ వ్యక్తి ని నేను.  అందుక‌ని మీరు.. మోదీ, ఎలా ఉన్నారు ? అని అడిగితే గ‌నుక, నేను ఇచ్చే జ‌వాబు అంటే భార‌త‌దేశం లో అంతా బాగుంది అని.  భార‌త‌దేశాని కి చెందిన బ‌హుళ భాష‌ల లో ‘‘అంతా బాగుంది’’ అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ భిన్న‌త్వం లోని ఏక‌త్వం మా యొక్క హుషారైన ప్ర‌జాస్వామ్యాని కి శక్తి గా ఉంది అన్నారు.

|

 

‘‘ఈ రోజు న, భార‌త‌దేశం ఒక ‘న్యూ ఇండియా’ను నిర్మించే దిశ గా క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తోంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఒక కొత్తదైన మ‌రియు ఉత్త‌మ‌మైన భార‌త‌దేశాన్ని నిర్మించ‌డం కోసం అనేక ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.  ‘‘భార‌త‌దేశం స‌వాళ్ళ ను వాయిదా వేయ‌డం లేదు.  వాటి ని మేము ముఖాముఖి గా డీ కొడుతున్నాము.  భార‌త‌దేశం క్ర‌మ వృద్ధి తో చోటు చేసుకొనేట‌టువంటి మార్పుల వెంట ప‌డ‌డం లేదు.  మేము శాశ్వ‌త ప‌రిష్కారాల కోసం కృషి చేస్తున్నాము.  అలాగే అసాధ్యాల‌ ను సాధ్యం చేస్తున్నాము’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

|

గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో ఎన్‌డి ఎ ప్ర‌భుత్వం యొక్క విజ‌యాల‌ ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖం గా ప్రస్తావించారు. ‘‘గ‌త అయిదు సంవ‌త్సరాల లో 130 కోట్ల మంది భార‌తీయులు ఎవ‌రూ ఊహించ‌నైనా లేనటువంటి కార్యాల ను నెర‌వేర్చారు.  మేము ఉన్న‌త లక్ష్యాల ను నిర్దేశించుకొంటున్నాము.  మేము ఉన్న‌త‌ ల‌క్ష్యాల ను సాధిస్తున్నాము’’ అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  కుటుంబాల కు గ్యాస్ క‌నెక్ష‌న్ లను ఇవ్వ‌డం, గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డం, ప‌ల్లె ప్రాంతాల‌ లో ర‌హ‌దారి సదుపాయాల ను క‌ల్పించ‌డం, బ్యాంకు ఖాతాల ను తెరిపించడం వంటి అంశాల లో త‌మ‌ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన ప‌రివ‌ర్త‌న పూర్వ‌క‌ చ‌ర్య‌ల ను గురించి ఆయ‌న తన ప్రసంగం లో ప్ర‌స్తావించారు.

|

‘ఈజ్ ఆఫ్ బిజినెస్‌’, ఇంకా ‘ఈజ్ ఆఫ్‌ లివింగ్’ ల దిశ‌ గా త‌మ ప్ర‌భుత్వం కట్టుబడివుంద‌ని ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటించారు.  ‘ఈజ్ ఆఫ్‌ లివింగ్’కు పూచీ ప‌డ‌డం కోసం  ప్ర‌భుత్వం చేప‌ట్టిన వివిధ కార్య‌క్ర‌మాల గురించి ఆయ‌న వివ‌రించారు.  వాటి లో కాలం చెల్లిన చ‌ట్టాల ర‌ద్దు, సేవ‌లు వేగం గా అందేట‌ట్లు చూడ‌డం, చౌకయిన డేటా ధ‌ర‌, అవినీతి కి వ్య‌తిరేకం గా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవడం, జిఎస్‌టి ని ప్రవేశ‌పెట్ట‌డం వంటివి భాగం గా ఉన్నాయి.  త‌న ప్ర‌భుత్వం హ‌యాం లో అభివృద్ధి ఫ‌లాలు భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కి అందుతాయ‌ని ఆయ‌న అన్నారు.
 
రాజ్యాంగం లోని 370వ అధిక‌ర‌ణం ర‌ద్దు ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ విధ‌మైన శక్తిమంతమైనటువంటి నిర్ణ‌యాత్మ‌కమైన చ‌ర్య ను చేప‌ట్టిన పార్ల‌మెంటు స‌భ్యుల కు సభికులు సీట్ల లో నుండి లేచి నిల‌బ‌డి క‌ర‌తాళ ధ్వ‌ని చేయవలసిందిగా ప్ర‌ధాన మంత్రి సూచించారు.  రాజ్యాంగ 370వ అధిక‌ర‌ణం జ‌మ్ము, క‌శ్మీర్‌ మరియు ల‌ద్దాఖ్ ప్ర‌జ‌ల ను అభివృద్ధి కి, పురోగ‌తి కి దూరం గా నిలిపి వేసింద‌ని ఆయ‌న చెప్పారు.  ‘‘ప్ర‌స్తుతం జ‌మ్ము, క‌శ్మీర్‌, ఇంకా ల‌ద్దాఖ్ ల ప్ర‌జ‌ల కు భార‌త‌దేశం లోని ప్ర‌తి ఒక్క‌రి మాదిరిగా అవే హ‌క్కులు లభించాయి’’ అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.
 
ఉగ్ర‌వాదాని కి వ్య‌తిరేకం గా అమీ తుమీ తేల్చే పోరు స‌ల‌ప‌వ‌ల‌సిన త‌రుణం ఆస‌న్నం అయింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఉగ్ర‌వాదం తో పోరాడ‌డానికి ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ సంకల్పించారు అంటూ ఆయ‌న ప్ర‌శంసించారు.
 
భార‌త‌దేశాన్ని సంద‌ర్శించవలసింది గా అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ కు మ‌రియు ఆయ‌న కుటుంబాని కి ప్ర‌ధాన మంత్రి ఆహ్వానం ప‌లికారు.  ‘‘యునైటెడ్ స్టేట్స్ మ‌రియు భార‌త‌దేశం యొక్క  హుషారైన భ‌విష్య‌త్తు ను మ‌న స్నేహం నూత‌న శిఖ‌రాల కు తీసుకు పోతుంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

శ్రీ డోనాల్డ్ జె ట్రంప్ ను ‘హౌడీ మోదీ’ కార్య‌క్రమాని కి ఆహ్వానించ‌డం ఒక గౌర‌వమే కాక ఒక విశేషాధికారం కూడా అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  యుఎస్ అధ్య‌క్షుడు ప్ర‌తి చోటా ఒక గాఢ‌మైన‌టువంటి మ‌రియు చిర‌కాలం ఉండేట‌టువంటి ప్ర‌భావాన్ని మిగిల్చార‌ని ఆయ‌న పేర్కొన్నారు.  యునైటెడ్ స్టేట్స్ అధ్య‌క్షుని యొక్క నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల ను ఆయ‌న కొనియాడారు.  తాము క‌లుసుకొన్న ప్ర‌తి సారి శ్రీ డోనాల్డ్ జె ట్రంప్ యొక్క స్నేహ‌శీల‌త‌ ను, ఆప్యాయత‌ ను మ‌రియు ఉత్సాహాన్ని తాను గ‌మ‌నించానని ప్ర‌ధాన మంత్రి అన్నారు. 

ఈ కార్య‌క్ర‌మం లో శ్రీ డోనాల్డ్ జె ట్రంప్ మాట్లాడుతూ, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భార‌త‌దేశం కోసం మ‌రియు దేశ పౌరుల కోసం ఒక అసాధార‌ణ‌మైన‌టువంటి క‌ర్త‌వ్యాన్ని నెర‌వేరుస్తున్నార‌ని చెప్పారు.  ప్ర‌ధాన మంత్రి ని ఆయ‌న సాధించిన‌ అపూర్వ‌మైనటువంటి ఎన్నిక‌ల విజయాని కి గాను శ్రీ ట్రంప్ అభినందించారు.  భార‌త‌దేశాని కి, యునైటెడ్ స్టేట్స్ కు మ‌ధ్య సంబంధం ఇది వ‌ర‌కు ఎన్న‌డూ లేనంత ఉత్త‌మమైన స్థాయి లో ఉందని శ్రీ ట్రంప్ పేర్కొన్నారు.
          
ప్ర‌ధాన మంత్రి అనుస‌రిస్తున్న వృద్ధి అనుకూల విధానాల ను శ్రీ ట్రంప్ మెచ్చుకొంటూ, ‘‘భార‌త‌దేశం దాదాపు గా మూడు వంద‌ల‌ మిలియ‌న్ ప్ర‌జ‌ల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యొక్క నాయ‌క‌త్వం లో పేద‌రికం నుండి బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చింది, ఇది అపురూప‌ం’’ అని శ్రీ ట్రంప్ అన్నారు.  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం లో ప్ర‌పంచం ఒక బ‌ల‌మైన మ‌రియు వ‌ర్ధిల్లే రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా ను చూస్తోంది అని  శ్రీ ట్రంప్  చెప్పారు.  భార‌తీయ స‌ముదాయం అందిస్తున్న‌ తోడ్పాటుకు అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.  ఈ స‌ముదాయాని కి మ‌రింత మేలు చేసే దిశ గా త‌న పాల‌న యంత్రాంగం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌ధాన మంత్రి ని హ్యూస్ట‌న్ కు ఆహ్వానిస్తూ సభ లో సంఖ్యాధిక్య ప‌క్షం యొక్క నేత శ్రీ స్టెని హోన‌ర్ ‘‘ఆధునిక భార‌త‌దేశం ద్వారా యునైటెడ్ స్టేట్స్ స్ఫూర్తి ని పొందింది’’ అని అన్నారు.  ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ దేశ స‌వాళ్ళ ను దృష్టి లో పెట్టుకొని దేశాని కి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు, భారతదేశం నిర్వివాద రూపం లో అంత‌రిక్షంలో ఒక నవీన మకాం చేజిక్కించుకోవడం తో పాటు లక్షలాది మంది ని పేదరికం నుండి వెలికితీసుకురావడం లోనూ అదే విధం గా పనిచేసింది ఆయ‌న అన్నారు.

అంత‌కు ముందు, హ్యూస్ట‌న్ మేయ‌ర్ శ్రీ సిల్వెస్ట‌ర్ ట‌ర్న‌ర్ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి గౌర‌వ సూచ‌కం గాను, సంఘీభావాని కి మరియు దీర్ఘ కాలం గా కొనసాగుతూ వస్తున్న భారతదేశం- హ్యూస్ట‌న్ సంబంధాల కు గుర్తు గాను ‘కీ టు హ్యూస్ట‌న్’ను బహుమతి గా ఇచ్చారు.  

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Government's FPO Scheme: 340 FPOs Reach Rs 10 Crore Turnover

Media Coverage

Government's FPO Scheme: 340 FPOs Reach Rs 10 Crore Turnover
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 జూలై 2025
July 21, 2025

Green, Connected and Proud PM Modi’s Multifaceted Revolution for a New India