Published By : Admin | December 10, 2016 | 21:34 IST
Share
PM Narendra Modi inaugurates India’s largest cheese factory in Gujarat
Along with ‘Shwet Kranti’ there is also a ‘Sweet Kranti’ as people are now being trained about honey products: PM
Government has been successful in weakening the hands of terrorists and those in fake currency rackets: PM
NDA Government is working tirelessly for welfare of the poor: PM Modi
India wants progress and for that evils of corruption and black money must end: PM
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని దీసా లో బనాస్ కాంఠా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం (బనస్ డెయిరీ) నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.
బనాస్ డెయిరీ స్వర్ణోత్సవ సంవత్సర వేడుకల ప్రారంభ సూచకంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి పాలంపూర్ లో జున్ను యంత్రాగారం మరియు పాల విరుగుడు తేటను ఎండబెట్టే యంత్ర సమూహం ప్రారంభ సూచకంగా ఒక ఫలకాన్ని రిమోట్ కంట్రోల్ పరికరం ద్వారా ఆవిష్కరించారు.
భారీ సందోహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఉత్తర గుజరాత్ యొక్క వ్యవసాయదారులు వారి శక్తి సామర్థ్యాలు ఎటువంటివో ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
బిందు సేద్యం ఈ ప్రాంత వ్యవసాయదారులకు ఎంతటి విస్తృత ప్రయోజనాలను అందించిదీ ప్రధాన మంత్రి గుర్తుచేశారు. “ఇక్కడి రైతులు పాడి వైపునకు, పశు సంవర్ధకం వైపునకు మళ్లారు. ఇది వారికి లాభాలను పంచిపెట్టింది” అని ఆయన అన్నారు. ‘శ్వేత క్రాంతి’ తో పాటు ‘స్వీట్ క్రాంతి’ కూడా చోటు చేసుకొంది. ఎలాగంటే, ఇప్పుడు ప్రజలకు తేనె ఉత్పత్తులను తయారు చేయడాన్ని గురించి కూడా శిక్షణ ఇస్తున్నారు అని శ్రీ మోదీ చెప్పారు.
నోట్ల చట్టబద్ధత రద్దు గురించి మాట్లాడుతూ, ప్రభుత్వం ఉగ్రవాదుల బాహవులను మరియు నకిలీ కరెన్సీ కూటవ్యవహారాలలో నిమగ్నమైన వారి బాహువులను బలహీనపరచడంలో కృతకృత‌్యురాలయిందన్నారు.
పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అలుపెరగకుండా పనిచేస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఇ-బ్యాంకింగ్ మరియు ఇ-వ్యాలెట్ లను ఉపయోగించవలసిందంటూ ఆయన ప్రజలను ప్రోత్సహించారు. భారతదేశం పురోగమించాలని కోరుకొంటోందని, అందుకోసం అవినీతి మరియు నల్లధనం వంటి దుష్టశక్తులు అంతమై తీరాలని ఆయన అన్నారు.
We belong to a nation where we do not think- what my interest. We are not a selfish nation. We think about future generations: PM pic.twitter.com/OuLxqqEV1q
Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.
Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.