Our judiciary has always interpreted the Constitution positively and strengthened it: PM Modi
Be it safeguarding the rights of people or any instance of national interest needed to be prioritised, judiciary has always performed its duty: PM

గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు.  హైకోర్టు స్థాపించి, అరవై సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఒక స్మారక తపాలా బిళ్ళ ను కూడా ఆయన విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో –  కేంద్ర చట్టము, న్యాయ శాఖ మంత్రి; సుప్రీం కోర్టు, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు; గుజరాత్ ముఖ్యమంత్రితో పాటు, న్యాయ వ్యవస్థకు చెందిన పలువురు వ్యక్తులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా, ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 60 సంవత్సరాల కాలంలో భారత న్యాయ వ్యవస్థనూ, భారత ప్రజాస్వామ్యాన్నీ, బలోపేతం చేయడానికి, హైకోర్టు న్యాయవాదులు, ధర్మాసనం చేసిన కృషిని ప్రశంసించారు.  రాజ్యాంగంలోని ప్రాణశక్తిగా,   న్యాయవ్యవస్థ తన బాధ్యతను నెరవేర్చిందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.  న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ రాజ్యాంగాన్ని సృజనాత్మకంగా,  సానుకూలంగా వివరించడం ద్వారా బలోపేతం చేసింది. ఇది పౌరుల హక్కులు మరియు స్వేచ్చా రంగాలలో తన పాత్రను తీర్చడం ద్వారా న్యాయ నియమావళికి సేవలు అందించింది.

"చట్టం యొక్క నియమం" మన నాగరికత, సామాజిక వ్యవస్థలకు ఆధారమని, ప్రధానమంత్రి, పేర్కొన్నారు.    ఇది సుపరిపాలనకు కూడా ఆధారంగా ఉంది.   ఇది మన స్వాతంత్య్ర సంగ్రామంలో నైతిక ధైర్యాన్ని నింపింది.  భారత రాజ్యాంగ రూపకర్తలు, దీనిని, అత్యుత్తమమైనదిగా ఉంచారు.  మరియు రాజ్యాంగం యొక్క ముందుమాట ఈ ప్రతిజ్ఞ యొక్క అభివ్యక్తి.  ఈ ప్రతిజ్ఞ భావానికి ప్రతిరూపమే రాజ్యాంగ పీఠిక.  ఈ ముఖ్యమైన సూత్రానికి న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ అవసరమైన శక్తి తో పాటు, దిశా నిర్దేశనం చేసింది.  న్యాయం యొక్క ప్రాథమిక లక్ష్యాలను చేరుకోవడంలో న్యాయవాదుల సంఘం పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తికి సైతం,  సకాలంలో న్యాయం దక్కే హామీని అందించే విధంగా, ప్రపంచ స్థాయి న్యాయ వ్యవస్థను స్థాపించడం అనేది, కార్యనిర్వాహక వ్యవస్థ మరియు న్యాయవ్యవస్థల సమిష్టి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. 

కోవిడ్-19 మహమ్మారి కష్ట సమయంలో న్యాయవ్యవస్థ ప్రదర్శించిన అంకితభావాన్ని ప్రధానమంత్రి  ప్రశంసించారు.  గుజరాత్ హైకోర్టు – వీడియో కాన్ఫరెన్సు, ఎస్.ఎమ్.ఎస్ కాల్-అవుట్, కేసుల ఈ-ఫైలింగు తో పాటు ‘నా కేసు పరిస్థితిని ఈ-మెయిల్ ద్వారా తెలియజేయండి" వంటి వినూత్న చర్యలు / సేవల ద్వారా విచారణ ప్రారంభంలోనే అనుకూల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. న్యాయస్థానం యూ-ట్యూబ్ ద్వారా తన పెండింగు కేసు వివరాలను ప్రదర్శిస్తూ, కేసు తీర్పులు, ఆదేశాలను వెబ్-‌సైట్ ‌లో పొందుపరచడం ప్రారంభించింది.  న్యాయస్థానం కార్యకలాపాలను ప్రత్యక్షంగా ప్రసారం చేసిన మొదటి న్యాయస్థానంగా గుజరాత్ హైకోర్టు నిలిచింది.  న్యాయ మంత్రిత్వ శాఖ యొక్క ఈ-కోర్టుల సమగ్ర మిషన్ మోడ్ ప్రాజెక్టు ద్వారా సమకూర్చిన డిజిటల్ మౌలిక సదుపాయాలను, న్యాయస్థానాలు చాలా వేగంగా స్వీకరించడం పట్ల, ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతవరకు, 18 వేలకు పైగా న్యాయస్థానాలను కంప్యూటరీకరించినట్లు శ్రీ నరేంద్రమోదీ తెలియజేశారు.  సుప్రీంకోర్టు టెలి-కాన్ఫరెన్సు, వీడియో కాన్ఫరెన్సులకు, చట్టబద్ధతకల్పించిన అనంతరం,  కోర్టులో ఈ-కార్యకలాపాలు ఊపందుకున్నాయి.  "ప్రపంచంలోని అన్ని సుప్రీం కోర్టులలో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా విచారణ జరిపిన కేసుల సంఖ్య కంటే, భారత సుప్రీంకోర్టు అత్యధిక సంఖ్యలో కేసులను విచారించడం చాలా గర్వంగా ఉంది", అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

కేసుల ఈ-ఫైలింగ్, ప్రత్యేక గుర్తింపు కోడ్ మరియు కేసులకు క్యూఆర్ కోడ్ కేటాయించడం ద్వారా, సులభతర న్యాయం కొత్త రూపు దాల్చింది. ఇది జాతీయ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఏర్పాటుకు దారితీసింది.  న్యాయవాదులు, కక్షిదారులు, తమ కేసుల గురించి తెలుసుకోవడానికి ఈ గ్రిడ్ ఉపయోగపడుతుంది.  విదేశీ పెట్టుబడిదారులు తమ న్యాయపరమైన హక్కుల భద్రతపై మరింత నమ్మకంతో ఉండడంతో, ఈ న్యాయ సౌలభ్యం, జీవన సౌలభ్యంతో పాటు, వ్యాపార సౌలభ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ పని తీరును, ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది.  సుప్రీంకోర్టుకు చెందిన ఈ-కమిటీ మరియు  ఎన్.ఐ.సి.  సురక్షితమైన క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలను సృష్టిస్తున్నాయి.  మన వ్యవస్థ భవిష్యత్తును సిద్ధం చేయడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించుకునే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.  ఇది న్యాయవ్యవస్థ సామర్ద్యాన్నీ, వేగాన్ని పెంచుతుంది.

న్యాయ వ్యవస్థ ఆధునికీకరణ ప్రయత్నాలలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పెద్ద పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  అభియాన్ కింద, భారతదేశం,  తన సొంత వీడియో కాన్ఫరెన్సు వేదికను ప్రోత్సహిస్తోంది.  హైకోర్టులు, జిల్లా కోర్టులలో ఉన్న ఈ-సేవా కేంద్రాలు, డిజిటల్ అవరోధాలను తగ్గించడంలో సహాయపడుతున్నాయి.

ఈ-లోక్ అదాలత్ గురించి, ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ,  30-40 సంవత్సరాల క్రితం జునాగడ్ లో మొదటి ఈ-లోక్ అదాలత్ ప్రారంభమయ్యింది.  ఈ రోజు, 24 రాష్ట్రాల్లో లక్షలాది కేసుల విచారణ జరుగుతున్నందున,  ఈ-లోక్ అదాలత్ లు సకాలంలో, అనుకూలమైన న్యాయం పొందడానికి కేంద్ర బిందువుగా మారాయి. ఈ వేగం, నమ్మకం, సౌలభ్యం నేటి న్యాయ వ్యవస్థ యొక్క డిమాండ్ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi