'Minimum Government, Maximum Governance' and 'Sabka Saath, Sabka Vikas' form the basis of New India: PM Modi
Our Government is keen to fulfil the aspirations of the people: PM Modi
A combination of technology and human sensitivities is ensuring greater 'ease of living': PM Modi

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో దైనిక్ జాగ‌ర‌ణ్ ప‌త్రిక 75వ వార్షికోత్స‌వాల సంద‌ర్భంగా జాగ‌ర‌ణ్ ఫోర‌మ్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.
తాజ్ ప్యాలెస్ హోట‌ల్‌లో  ఈకార్య‌క్ర‌మానికి హాజ‌రైన  వారి నుద్దేశించి ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపిన వారిలో  ప్ర‌తి రోజూ ప‌త్రిక‌ను పాఠ‌కుల‌కు పంపిణీచేస్తున్నహాక‌ర్లు కూడా ఉన్నారు.  వార్తాప‌త్రిక‌ ఎన్నో గృహాల‌కు రోజూ 

చేర‌డంలో హాక‌ర్లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తార‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.దేశ పున‌ర్ నిర్మాణంలో, ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం తీసుకురావ‌డంలో దైనిక్ జాగ‌రణ్ ప‌త్రిక కీల‌క పాత్ర పోషించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. త‌న వ్య‌క్తిగ‌త అనుభ‌వంలోంచి చెప్పుకున్న‌ట్ట‌యితే , దేశంలో , స‌మాజంలో  మార్పు ఉద్య‌మాన్ని దైనిక్ జాగ‌ర‌ణ్  బ‌లోపేతం చేసింద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బేటి బ‌చావో, బేటి ప‌ఢావో, స్వ‌చ్ఛ‌భార‌త్ అభియాన్‌ కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.  డిజిట‌ల్ విప్ల‌వం కార‌ణంగా దేశాన్ని బ‌లోపేతం చేయ‌డంలో మీడియా కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ద‌ని ప్ర‌ధాని అన్నారు.
క‌నీస ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న , స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్  అనేవి న‌వ‌భార‌తానికి ప్రాతిప‌దిక‌లని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఇవాళ‌, దేశ అభివృద్ధి ప్ర‌క్రియ‌లో తాము భాగ‌స్వాముల‌మ‌ని యువ‌త భావిస్తున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి ఇన్ని ద‌శాబ్దాల అనంత‌రం కూడా దేశం ఇంకా ఎందుకు వెనుక‌బ‌డి ఉన్న‌ద‌ని ఆయ‌న ,దేశ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎందుకు ప‌రిష్కారం కాకుండా  ఉండిపోయాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 70 సంవ‌త్స‌రాలుగా చేర‌ని 
ప్రాంతాల‌కు ఇప్పుడు విద్యుత్తు చేరుతున్న‌ద‌ని , రైల్వే అనుసంధాన‌త లేని రాష్ట్రాలను రైల్వే ప‌టంలోకి తీసుకురావ‌డం జ‌రుగుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.
ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా ప‌లు పోలిక‌ల‌ను ప్ర‌స్తావించారు. స్వాతంత్ర్యానంత‌రం 67 సంవ‌త్స‌రాల పాల‌న‌ను ( స్వాతంత్ర్యానంత‌రం నుంచి 2014 వ‌ర‌కు) త‌న నాలుగేళ్ల‌  పాల‌న‌ను ( 2014-2018) పోల్చి చూపారు.
త‌న నాలుగేళ్ల పాల‌న‌లో గ్రామీణ ప్రాంతాల‌లోని ఇళ్ల‌లో టాయిలెట్లు 38 శాతం నుంచి 95 శాతానికి పెరిగాయ‌ని ,
గ్రామీణ ర‌హ‌దారుల అనుసంధాన‌త 55 శాతం నుంచి 90 శాతానికి చేరింద‌ని చెప్పారు.
ఎల్‌.పి.జి క‌నెక్ష‌న్‌లు 55 శాతం  నుంచి 90 శాతం గృహాల‌కు చేరింద‌న్నారు. విద్యుత్ స‌దుపాయం 95 శాతం గ్రామీణ కుటుంబాల‌కు క‌ల్పించ‌డం జ‌రిగిందని , నాలుగేళ్ల క్రితం ఇది 70 శాతం మాత్ర‌మే ఉంద‌ని తెలిపారు. 
నాలుగు సంవ‌త్స‌రాల క్రితం 50 శాతం మందికి మాత్ర‌మే  బ్యాంకు ఖాతాలు ఉండ‌గా ,ప్ర‌స్తుతం ప్ర‌తిఒక్క‌రికీ బ్యాంకింగ్ సేవ‌లు అందుబాటులో ఉన్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

2014లో కేవ‌లం నాలుగు కోట్ల మంది మాత్ర‌మే ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసే వారని, కానీ ఆ త‌ర్వాత నాలుగు సంవ‌త్స‌రాల‌లో చూస్తే దానికి అద‌నంగా మ‌రో మూడు కోట్ల మంది ప‌న్ను నెట్ వ‌ర్క్‌లోకి వ‌చ్చి చేరార‌ని చెప్పారు.
ఇత‌ర అన్ని విష‌యాలూ ఒకేలా ఉన్న‌ప్పుడు ఈ మార్పు ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శ్నించారు.పేద‌లు , అణ‌గారిన వ‌ర్గాల వారికి మౌలిక స‌దుపాయాలు క‌ల్పించిన‌పుడు వారికై వారే పేద‌రికాన్నిఅధిగ‌మిస్తార‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. గ‌డ‌చిన 

నాలుగు సంవ‌త్స‌రాల‌లో మార్పు చోటు చేసుకుంటున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.గ‌ణాంకాలు దీనిని రుజువుచేస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.
ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డంలో ప్ర‌భుత్వం ఎంతో ఆస‌క్తితో ఉన్న‌ట్టు ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.భార‌త దేశం ఉప‌యోగిస్తున్న సాంకేతిక ప‌రిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు ఒక న‌మూనాగా ఉంటున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.సాంకేతిక 
ప‌రిజ్ఞానం,మాన‌వ సున్నిత ప్ర‌తిస్పంద‌న‌ల‌ను సుల‌భ‌త‌ర జీవ‌నానికి మ‌రింత‌గా పూజీ ప‌డ‌తాయ‌ని తెలిపారు. జ‌ల‌మార్గాలు, విమాన‌యాన ప్ర‌యాణ రంగంలో అభివృద్ధి గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ఎల్‌.పి.జి సిలిండ‌ర్‌ల రీఫిల్‌కు త‌క్కువ వ్య‌వ‌ధి 

ప‌ట్ట‌డం, ఆదాయ‌ప‌న్ను రిఫండ్ త‌క్కు వ వ్య‌వ‌ధిలో పొంద‌డం, పాస్‌పోర్టు త‌క్కువ స‌మ‌యంలో పొంద‌గ‌ల‌గ‌డం వంటి వాటి గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్‌యోజ‌న‌, ఉజ్వ‌ల , సౌభాగ్య త‌దిత‌ర ప‌థ‌కాల‌కు సంబంధించి ప్ర‌భుత్వ‌మే ల‌బ్ధిదారుల వ‌ద్ద‌కు వెళుతున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఆయుష్మాన్ భార‌త్‌నుకూడా  ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.
 ఈ ప‌థ‌కాల ల‌బ్దిదారులు కూలీలు, కార్మికులు, రైతులు త‌దిత‌ర వ‌ర్గాల వార‌ని ఆయ‌న చెప్పారు. పేద‌ల‌కు సాధికార‌త క‌ల్పించే ఈ ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకువెళ‌తామ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. భార‌త‌దేశం సాధిస్తున్న పురోగ‌తిని ప్ర‌పంచం 
గుర్తిస్తున్న‌ద‌ని ఆయ‌న తెలిపారు.
ఆర్థిక నేర‌స్థులు ఇత‌ర‌దేశాల‌లో ఎక్క‌డా త‌ల‌దాచుకోకుండా చూడాల‌ని అంత‌ర్జాతీయ స‌మాజం ముందు భార‌త‌దేశం కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేసిన‌ట్టు కూడా ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.

Click here to read full text of speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi