ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో జరిగిన క్రెడాయ్ యూత్ కాన్- 2019ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఇళ్లు లేని ప్రతి కుటుంబాని కి 2022వ సంవత్సరం కల్లా పక్కా గృహాన్నిఅందించడానికిగాను నిర్మాణ పనులు శరవేగం గా కొనసాగుతున్నాయని ఆయన తన ప్రసంగం లో తెలిపారు. ఒకటిన్నర కోట్ల ఇళ్ల ను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా ఇప్పటికే నిర్మించడం జరిగిందని, వీటి లో 15 లక్షల ఇళ్ల ను పట్టణ ప్రాంత పేదల కోసం నిర్మించడం జరిగిందని ప్రధాన మంత్రి వెల్లడించారు. పేదల కు పక్కా గృహాల ను అందించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లో పారదర్శకత తో అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి తో విధానాల్నిరూపకల్పన చేస్తే అవినీతిని రూపుమాపి, ఆశించిన ఫలితాల ను సాధించడం సాధ్యమవుతుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
వినియోగదారులకు, స్థిరాస్తి సంస్థల కు మధ్య నమ్మకాన్ని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఆర్ ఇ ఆర్ ఎ) బలోపేతం చేసిందని ప్రధాన మంత్రి అన్నారు. 28 రాష్ట్రాలలో ఆర్ ఇ ఆర్ ఎ కార్యకలాపాల ను కొనసాగిస్తోందని, 35 వేల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు లు , 27 వేల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పేర్లు దీని లో నమోదు అయ్యాయని తెలిపారు. లక్షలాది ఫ్లాట్ లను నిర్మించడం జరుగుతోందని ప్రధాన మంత్రి చెప్పారు.
గడచిన నాలుగు సంవత్సరాలలో ఈజ్ ఆఫ్ డూయిండ్ బిజినెస్ స్థానాల లో గొప్ప పురోగతి చోటుచేసుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, భారతదేశం లో ఈజ్ ఆఫ్ డూయిండ్ బిజినెస్ పరం గా ప్రభుత్వం నిబద్దత తో పని చేస్తోందన్నారు. ఈ సందర్భం గా ఆయన అన్ని ప్రభుత్వ అనుమతుల ను, నిర్మాణ అనుమతుల తో సహా ఇదివరకటి కన్నా వేగం గా జారీ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.
గృహ నిర్మాణ పరిశ్రమ కు, ఇళ్ల కొనుగోలుదారుల కు సహాయం చేయడానికిగాను కేంద్ర ప్రభుత్వం పన్నుల సంస్కరణ లను తీసుకువచ్చిందని తెలిపిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వాటి ని గురించి వివరించారు. పలు నిర్మాణ రంగ వస్తువుల కు సంబంధించి జిఎస్ టి పన్నుల రేట్ల ను తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాజా బడ్జెటు లో ప్రవేశపెట్టిన ఆదాయ పన్ను ప్రయోజనాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇటువంటి విధానాల కారణంగా గృహ నిర్మాణ రంగం, ఇళ్ల కొనుగోలు దారులు ప్రయోజనాన్ని పొందుతారని అన్నారు.
సామాన్య ప్రజల సొంత ఇంటి కల ను నిజం చేయడానికిగాను సిఆర్ఇడిఎఐ (‘క్రెడాయ్’) పోషిస్తున్న పాత్ర ను ప్రధాన మంత్రి అభినందించారు. ‘న్యూ ఇండియా’కై కృషి జరుగుతున్న సమయం లో యూత్ కాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ‘న్యూ ఇండియా’ రూపకల్పన లో దేశం లోని యువతీయువకులు ప్రధాన పాత్ర ను పోషిస్తారని ఆయన తన ప్రసంగం లో తెలిపారు.
అంతకు ముందు, ప్రధాన మంత్రి తాల్ కటోరా స్టేడియమ్ లో క్రెడాయ్ ఏర్పాటు చేసిన ప్రదర్శన ను సందర్శించారు.
देश का गरीब के घर का सपना पूरा हो, 2022 तक हर बेघर को अपना पक्का घर मिले, इस दिशा में तेज़ी से काम किया जा रहा है।
— PMO India (@PMOIndia) February 13, 2019
प्रधानमंत्री आवास योजना के तहत देश के गांव और शहरों में लगभग 1.5 करोड़ गरीबों के घर बनाए जा चुके हैं, जिसमें से लगभग 15 लाख घर शहरी गरीबों के बनाए जा चुके हैं: PM
जब किसी योजना से नाम का या स्वार्थ का भाव निकाल देते हैं तो नीति स्पष्ट हो जाती है
— PMO India (@PMOIndia) February 13, 2019
इसलिए करप्शन का, अपने-पराए का भाव भी निकाल दिया।
अब तकनीक का उपयोग कर लाभार्थियों का चयन होता है, किसी के कहने पर लिस्ट में नाम कटने या जोड़ने का काम जो होता था उसको बंद कर दिया है: PM
इसी तरह कंस्ट्रक्शन परमिट सहित तमाम दूसरी परमिशन अब पहले की तुलना में तेज़ी से मिल रही हैं।
— PMO India (@PMOIndia) February 13, 2019
जिसका परिणाम ये हुआ कि ईज़ ऑफ डूइंग बिजनेस रैंकिंग में देश ने बड़ी छलांग बीते साढ़े 4 वर्षों में लगाई: PM
पहले कंस्ट्रक्शन सेक्टर पर 15-18% का टैक्स लगता था। जो सामान है, जैसे पेन्ट, टाइलें, टॉयलेट का सामान, केबल, वायर ऐसी तमाम चीजों पर 30% से ज्यादा टैक्स लगा करता था।
— PMO India (@PMOIndia) February 13, 2019
GST के बाद मध्यम वर्ग के घरों के लिए टैक्स कम हुआ है। इसी तरह कंस्ट्रक्शन मटीरियल पर भी GST को कम किया गया है: PM
पेन्ट, वायर, इलेक्ट्रिकल फिटिंग से जुड़ा सामान, सेनिटरीवेयर, प्लायवुड, टाइल जैसे अनेक सामान पर GST 28 प्रतिशत से घटाकर 18 प्रतिशत लाया गया है।
— PMO India (@PMOIndia) February 13, 2019
वहीं ईंटों पर GST 12 प्रतिशत से घटाकर 5 प्रतिशत किया गया है: PM