QuoteIn one way the correct meaning of PSE is - Profit and Social benefit generating Enterprise: PM Modi at CPSE Conclave
QuoteFor public and private sector, the formula of success remains same - the 3 Is, which mean Incentives, Imagination and Institution Building: PM
QuoteI believe that Idealism and Ideology are not enough for economic decision making, they need to be replaced with pragmatism and practicality, says the PM
QuotePSEs can contribute towards the formation of New India through 5 Ps - Performance + Process + Persona + Procurement and Prepare: PM
QuoteTo date, we have been treating PSEs as navratana companies. But now, its time to think beyond it. Can we think about making New India jewel, asks PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో జ‌రిగిన సిపిఎస్ఇ స‌మావేశంలో పాలుపంచుకొన్నారు.

ఈ సంద‌ర్భంగా కార్పొరేట్ ప‌రిపాల‌న, మాన‌వ వ‌న‌రుల నిర్వ‌హ‌ణ‌, ఫైనాన్షియ‌ల్ రీ-ఇంజినీరింగ్‌, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు మ‌రియు సాంకేతిక విజ్ఞానం తో పాటు ‘న్యూ ఇండియా’ కోసం ఉద్దేశించిన విజ‌న్ 2022 త‌దిత‌ర అంశాల‌పై కొన్ని ప్ర‌త్యేక స‌మ‌ర్ప‌ణ‌ ల‌ను ప్ర‌ధాన మంత్రి స‌మ‌క్షం లో ప్ర‌ద‌ర్శించారు.

|

స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఈ స‌మావేశం ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లకు సంబంధించినంత వ‌ర‌కు ఒక నూత‌న ఆరంభం అని అభివ‌ర్ణించారు.

త‌న ఎదుట ప్ర‌ద‌ర్శించిన స‌మ‌ర్ప‌ణ‌ ల‌ను ఆయ‌న మెచ్చుకొంటూ, ప్ర‌భుత్వ‌ రంగ సంస్థ‌ ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హ‌ణ ప‌ర‌మైన స్వేచ్ఛ‌ను ఇచ్చింద‌ని, దీని ద్వారా ఆ సంస్థ‌లు వాటి ప‌నితీరును మెరుగు ప‌ర‌చుకోవాల‌న్న‌దే ప్ర‌భుత్వం ఉద్దేశ‌మ‌ని తెలిపారు. స్వాతంత్య్రం వ‌చ్చినప్పటి నుండి దేశ నిర్మాణం లోను, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లోను పిఎస్‌యు లు గణనీయమైన తోడ్పాటును అందించాయ‌ని ఆయ‌న అన్నారు.

|

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు లాభార్జ‌న‌తో పాటు సామాజిక ప్ర‌యోజ‌నం కూడా ముఖ్య‌మ‌ని ఆయ‌న చెప్పారు. పిఎస్ఇ ఉద్యోగుల తోడ్పాటు ను ప్ర‌ధాన మంత్రి అభినందిస్తూ, విద్యుత్తు స‌దుపాయానికి నోచుకోని ప‌ల్లెలకు క‌రెంటును అందించ‌డం, ఇంకా పేద‌ల‌కు ఎల్‌పిజి క‌నెక్ష‌న్ లు ఇవ్వ‌డం వంటి ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యాలు పిఎస్ఇ శ్రామికుల క‌ఠోర శ్ర‌మ లేనిదే నెర‌వేరేవి కావు అన్నారు.

గ‌తంలో సాధించిన విజ‌యాల‌ను చూసుకొంటూ విశ్ర‌మిస్తే స‌రిపోదు, ఎప్ప‌టిక‌ప్పుడు ఎదుర‌య్యే స‌వాళ్ళ‌కు అనుగుణంగా వాటిని తట్టుకొని నిల‌బడడం కూడా ముఖ్య‌మైన విష‌య‌మే అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. క‌ష్టించి ప‌ని చేయ‌డాన్ని, నూత‌న ఆవిష్క‌ర‌ణలకై కృషి చేయడాన్ని 21వ శ‌తాబ్దానికి దారిని చూప‌గ‌ల సిద్ధాంతాలుగా ఎంచాలని ఆయ‌న పేర్కొన్నారు. ప్రోత్సాహ‌కాలు, ఊహ‌లు మ‌రియు సంస్థా నిర్మాణం.. ఈ మూడూ విజ‌యానికి కీల‌క‌ం అని ఆయ‌న చెప్పారు.

సాంకేతిక విజ్ఞానం లో మ‌రియు ప్ర‌క్రియ‌ ల‌లో మార్పులను ప్రవేశపెడుతూ ‘న్యూ ఇండియా’ ఆవిష్కారం లో స‌హాయం అందించవలసిందిగా పిఎస్ఇ ల‌కు ప్ర‌ధాన మంత్రి ఉద్భోదించారు. దీని కోసం పిఎస్ఇ లు పెర్‌ఫార్మెన్స్‌, ప్రోసెస్‌, ప‌ర్‌ సోన్, ప్రక్యూర్‌మంట్ మరియు ప్రిపేర్ అనే 5-పి ల సూత్రాన్ని అనుస‌రించ‌వ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

|

ఈ అంశాన్ని ఆయ‌న మ‌రింత విడమరచి చెప్తూ, కార్య‌క‌లాపాల‌ పరమైన మరియు ఆర్థిక పరమైన ప‌నితీరు ను మెరుగుప‌ర‌చుకోవాలని; ప్ర‌క్రియ‌ల‌లో పార‌ద‌ర్శ‌క‌త్వానికి, జ‌వాబుదారుత‌నానికి చోటు ఇవ్వ‌ాలని; సేక‌ర‌ణ‌ ల‌ను GeM ఫ్లాట్ ఫార్మ్ నుండి, ఇంకా ఎమ్ఎస్ఎమ్ ఇ ల నుండి జ‌రుపుతుండాలని; ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ మ‌రియు రోబోటిక్స్ త‌దిత‌ర సాంకేతిక విజ్ఞాన సంబంధ‌ వినూత్న ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకొని అందుకోసం స‌న్న‌ద్ధం కావాలని వివ‌రించారు.

• ‘న్యూ ఇండియా’ ఆవిష్కారానికి సంబంధించి ఆయ‌న పిఎస్ఇ లకు అయిదు స‌వాళ్ళ‌ ను నిర్దేశించారు:

• 2022 క‌ల్లా భార‌తీయ పిఎస్‌యు లు వాటి భౌగోళికంగా వ్యూహాత్మ‌క‌మైన వ్యాప్తి ని గ‌రిష్ట స్థాయి కి ఏ విధంగా పెంచుకొంటాయి ?

• 2022 క‌ల్లా భార‌తీయ పిఎస్‌యు లు దేశం యొక్క దిగుమ‌తుల బిల్లు ను క‌నిష్ట స్థాయి కి ఏ ర‌కంగా తీసుకు పోతాయి ?

• 2022 క‌ల్లా భార‌తీయ పిఎస్‌యు లు నూత‌న ఆవిష్క‌ర‌ణ మ‌రియు ప‌రిశోధ‌న‌ ల‌ను ఏ విధంగా ఏకీక‌రించుకొంటాయి ?

• 2022 క‌ల్లా భార‌తీయ పిఎస్‌యు లు వాటి యొక్క సిఎస్ఆర్ నిధిని వీలైనంత మేర‌కు వినియోగించ‌డం కోసం ఏ విధ‌మైన మార్గ‌సూచి ని అనుస‌రిస్తాయి ?

• 2022 క‌ల్లా భార‌తీయ పిఎస్‌యు లు దేశానికి అందించే నూత‌న‌ అభివృద్ధి న‌మూనా ఎలా ఉండ‌బోతోంది ?

ప్ర‌పంచంలో అతి పెద్ద 500 కంపెనీల‌లో నాలుగింట ఒక వంతు కంపెనీలు ఏదో ఒక దేశానికి చెందిన ప్ర‌భుత్వ‌ రంగ క్షేత్రం ప‌రిధిలోకి వ‌స్తాయని ప్రధాన మంత్రి అన్నారు. భార‌త‌దేశానికి చెందిన పిఎస్‌యు లు ఇత‌ర దేశాల పిఎస్‌యు ల‌తో లంకె పెట్టుకొని విదేశాల‌లో పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఒక స‌మ‌గ్ర‌మైన వ్యూహాన్ని అభివృద్ధి పరచవచ్చని ఆయ‌న సూచించారు. అదే మాదిరిగా, భార‌త‌దేశం యొక్క దిగుమ‌తుల బిల్లు ను త‌గ్గించ‌డంలో పిఎస్‌యు లు ఒక కీల‌క‌మైన పాత్ర‌ ను కూడా పోషించ‌గ‌లవని ఆయ‌న అన్నారు. సిపిఎస్ఇ లు సిఎస్ఐఆర్ మ‌రియు ఐసిఎఆర్ త‌దిత‌ర సంస్థ‌ల‌లో నెల‌కొన్న స‌దుపాయాల‌కు తోడు ఆధునిక‌మైన ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి (ఆర్ అండ్ డి) సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ను క‌లిగి వున్నాయన్న విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ప్ర‌స్తుతం నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ను మ‌రియు ప‌రిశోధ‌న‌ను ఏకీకృతం చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంలో సిపిఎస్ఇ లు మ‌రియు ప్ర‌భుత్వ విభాగాల మ‌ధ్య స‌మాచారం పంపకం మ‌రింత ఎక్కువ స్థాయిలో జరగాల‌ంటూ పిలుపునిచ్చారు.

సిపిఎస్ఇ లు వాటి సిఎస్ఆర్ వ్య‌యం విషయంలో ప్ర‌తి ఏటా ఒక నిర్దిష్ట‌మైన ఇతివృత్తం పైనే చాలా వరకు శ్రద్ధ వహించాల‌ంటూ ప్ర‌ధాన మంత్రి స‌ల‌హా ఇచ్చారు. ఈ సంద‌ర్భంలో సిఎస్ఆర్ వ్య‌యాన్ని పాఠ‌శాల‌ల్లో మ‌రుగుదొడ్ల నిర్మాణానికి వినియోగించడం ద్వారా సాధించిన విజ‌యాన్ని ఆయ‌న గుర్తుకు తెచ్చారు. మ‌హ‌త్వాకాంక్ష‌లు క‌లిగిన జిల్లా ల‌ను అభివృద్ధి పరచడం మ‌రొక మంచి ఇతివృత్తం కాగలదని ఆయ‌న అన్నారు. సిపిఎస్ఇ లు సిఎస్ఆర్ లో భాగంగా నైపుణ్యాల అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కూడా చేప‌ట్ట‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు.

కాగితానికి తావు ఉండని ప‌ని విధానం, న‌గ‌దు అక్క‌ర‌ లేనటువంటి విధంగా లావాదేవీలు జరపడి మ‌రియు వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ వంటి అనేక రంగాల‌లో సిపిఎస్ఇ లు ఆద‌ర్శ‌ప్రాయ న‌మూనాల వ‌లె ప‌ని చేయ‌వ‌చ్చని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

‘న్యూ ఇండియా’ సంక‌ల్పాన్ని సాకారం చేయ‌డంలో సిపిఎస్ఇ లు ఒక ప్ర‌ముఖ పాత్ర‌ ను పోషించ‌గ‌ల‌వ‌న్న ఆశాభావాన్ని ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేశారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Sri Lanka's World Cup-winning stars laud PM Modi after meeting in Colombo: 'Most powerful leader in South Asia'

Media Coverage

Sri Lanka's World Cup-winning stars laud PM Modi after meeting in Colombo: 'Most powerful leader in South Asia'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 ఏప్రిల్ 2025
April 06, 2025

Citizens Appreciate PM Modi’s Solidarity in Action: India-Sri Lanka Bonds