QuotePolice, forensic science and judiciary are integral parts of criminal justice delivery system: Prime Minister
QuoteGreater technological intervention in forensic science can help tackle challenges of cyber security: PM Modi
QuoteIn order to deal with rapidly changing crime scenario we have to develop newer techniques to make it clear that criminals will not be spared: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు గుజ‌రాత్ ఫోరెన్సిక్‌ సైన్సెస్ యూనివ‌ర్సిటీ స్నాత‌కోత్సవానికి హాజ‌ర‌య్యారు.

ఈ విశ్వ‌విద్యాల‌యం మ‌రియు ఇక్క‌డి విద్యార్థులు మార్గ‌ద‌ర్శ‌ులు అని ఆయ‌న అభివ‌ర్ణించారు. సాంప్ర‌దాయేత‌ర‌ విద్యా విభాగం అని ప‌లువురు భావించేది అయినప్పటికీ, నేటి కాలంలో ఎంతో ముఖ్యమైనటువంటిది అయిన న్యాయాలయ సంబంధి విజ్ఞ‌ాన శాస్త్ర విభాగాన్ని ఎంపిక చేసుకోవ‌డం లో ప‌ట్టు విడవనందుకుగాను విద్యార్థుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. తనపై తనకు నమ్మకం ఉండడంతో పాటు దృఢ సంకల్పం ఉండడం వంటి గుణాలు రానున్న కాలాల్లో విద్యార్థుల‌కు స‌హాయకారి కాగలవని ఆయ‌న అన్నారు.

|

న్యాయాలయ సంబంధిత విజ్ఞాన శాస్త్ర వ్య‌వ‌స్థ అనేది దృఢమైందిగా ఉన్న‌ప్పుడు, అది ద‌క్ష‌త క‌లిగిన పోలీసు బ‌ల‌గం మ‌రియు స‌మ‌ర్ధ‌మైన న్యాయ వ్య‌వ‌స్థ ల వలెనే పౌరుల భ‌ద్ర‌త పట్ల శ్రద్ధ వహించడంలో తోడ్పడగలుగుతుందని, నేరాల‌ను అరిక‌ట్ట‌డం లో దోహ‌ద‌ప‌డగలుగుతుందని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

ఒక వ్య‌క్తి తాను గనక నేరానికి ఒడిగట్టినట్లయితే ప‌ట్టుబ‌డవ‌చ్చ‌న్న భ‌యం ఆ వ్యక్తి లో ఉండ‌డం ముఖ్య‌మైన విషయం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మ‌రి ఇక్కడే న్యాయాలయ సంబంధిత విజ్ఞాన శాస్త్రం పాత్ర కీల‌కంగా మారుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

|

నేర ప‌రిశోధ‌న రంగం లో, న్యాయాన్ని ప్రసాదించే రంగాల‌లో అంత‌ర్జాతీయ మాన‌వ వ‌న‌రుల రాశి ని తయారు చేసినందుకు గాను జిఎఫ్ఎస్‌యు కు ఆయ‌న అభినందనలు తెలిపారు. గుజ‌రాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివ‌ర్సిటీ తాను అందిస్తున్న‌టువంటి విద్య‌ ద్వారా, శిక్ష‌ణ‌ ద్వారా ప్ర‌పంచ భ‌ద్ర‌త‌ లో ఒక నిర్ణ‌యాత్మ‌క‌మైన పాత్ర‌ ను పోషిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

|

సైబ‌ర్ క్రైమ్ రువ్వుతున్న‌ స‌వాలు ను గురించి, ఫోరెన్సిక్స్ ను, అలాగే, సైబ‌ర్ ఫోరెన్సిక్ ల్యాబ్ లను బ‌లోపేతం చేయ‌డానికి ఉన్న‌టువంటి ప్రాముఖ్యాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్రధాన మంత్రి సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. బీమా ప‌రిశ్ర‌మ లోనూ ఫోరెన్సిక్ సైన్స్ కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

|

దోషులను చ‌ట్టానికి ప‌ట్టి ఇవ్వ‌డం లో న్యాయ వ్య‌వ‌స్థ‌ కు స‌హ‌క‌రించడం కోసం డిఎన్ఎ ప్రొఫైలింగ్ ను వినియోగించుకోవల‌సిందిగా ఫోరెన్సిక్ నిపుణుల‌కు ఆయ‌న విజ్ఞప్తి చేశారు. మ‌హిళ‌ల పై పాల్పడ్డ నేరాలు స‌హా ఘోరమైన నేరాల‌ను రానున్న కాలాల్లో మ‌నం అరికట్టగ‌లుగుతామ‌న్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌పంచం అంత‌టా పోక‌డ‌ ల‌ను మార్చివేయడంలో కేంద్ర స్థానం లో నిల‌వండంటూ విద్యార్థినీ విద్యార్థుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.

వారు మ‌న ప్ర‌పంచాన్ని ఒక ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం గా మార్చే ప్రగతిశీల పరివర్తనల‌కు కొన్నింటికైనా చోద‌కంగా నిల‌వాలని ఆయ‌న ఉద్బోధించారు. ప‌ట్టాలు పొందిన విద్యార్థినీ విద్యార్థులకు ఉజ్వ‌ల‌, చైత‌న్య‌కారక భ‌విష్య‌త్తు లభించాల‌న్న ఆకాంక్ష ను ఆయ‌న వ్యక్తం చేశారు.

 

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Rs 1332 cr project: Govt approves doubling of Tirupati-Pakala-Katpadi single railway line section

Media Coverage

Rs 1332 cr project: Govt approves doubling of Tirupati-Pakala-Katpadi single railway line section
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 ఏప్రిల్ 2025
April 10, 2025

Citizens Appreciate PM Modi’s Vision: Transforming Rails, Roads, and Skies