QuoteIndia is one of the world's leading digital economies and we're developing digital infrastructure at rapid pace: PM
QuoteDigital audit & digital governance can strengthen institutional memory for several organisations: PM Modi
QuoteI'm sure that CAG will play a strong role in the formation of New and Clean India: PM

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఇక్క‌డ జరిగిన అకౌంటెంట్స్ జ‌న‌ర‌ల్ మ‌రియు డిప్యూటీ అకౌంటెంట్స్ జ‌న‌ర‌ల్ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి దేశం లో ప‌ని చేసేందుకు ఒక కాల‌బ‌ద్ధ‌మైన‌టువంటి మ‌రియు ఫ‌లితాల పై ఆధార‌ప‌డిన‌టువంటి వ్య‌వ‌స్థ వికసిస్తున్నదని మరి దీని లో కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సిఎజి ) కు ఒక పెద్ద పాత్ర ఉంటుందన్నారు. సిఎజి విధుల లో బోలెడంత క‌ఠోర శ్ర‌మ మిళిత‌ం అయివుంటుంద‌ని, మ‌రీ ముఖ్యం గా సిఎజి యొక్క క్షేత్ర కార్యాల‌యాలు ఎంతో కృషి చేస్తాయ‌ని, త‌ద్వారా నే ఇది సాధ్య‌పడుతోంద‌ని ఆయ‌న చెప్పారు.

|

అటువంటి స‌మ‌ర్ప‌ణ భావం క‌లిగిన ఆడిట‌ర్ల కారణం గానే సిఎజి యొక్క బలం మ‌రియు విశ్వ‌స‌నీయ‌త లు ఒక ఆకృతి ని దాల్చాయ‌ని ఆయ‌న తెలిపారు. చాలా కాలం క్రింద‌ట ఏర్ప‌డిన ఒక సంస్థ లో ఒక మార్పు ను తీసుకు రావ‌డం అంటే దానంతట అదే ఒక గొప్ప స‌వాలు అని ఆయ‌న నొక్కి వ‌క్కాణించారు.

|

ప్ర‌స్తుత కాలం లో సంస్క‌ర‌ణ‌ల ను గురించి మాట్లాడ‌టం ఒక స్వైరభావం గా మారిపోయింది; అయితే, సంస్క‌ర‌ణ ను తీసుకు రావ‌డం కోసం యావ‌త్తు అధికారిగణం మరియు సిబ్బంది పరిపూర్ణమైన చిత్తశుద్ధి తోను, సంపూర్ణమైన స‌మ‌ర్ప‌ణ భావం తోను స‌న్న‌ద్ధులు అయిన‌ప్పుడు మాత్ర‌మే వాస్త‌వం గా సంస్క‌ర‌ణ చోటు చేసుకొంటుంద‌ని, మ‌రి ఇది దేశం లో ప్రతి ఒక్క ప్ర‌భుత్వాని కి, అలాగే దేశం లో ప్ర‌తి ఒక్క సంస్థ కు వ‌ర్తించేట‌టువంటి విష‌య‌మ‌ని, ఇందులో సిఎజి కూడా చేరుతుంది అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

|

సిఎజి తాలూకు ఆడిట్ ప్ర‌క్రియ లో కూడాను మార్పులు వ‌చ్చాయి అని ప్రధాన మంత్రి అన్నారు. సిఎజి చేసే ప్ర‌తి ఒక్క ప‌ని తాలూకు ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం పాల‌న పైన ఉంటుంది అని ఆయ‌న చెప్పారు. సిఎజి ఆడిట్ ప్ర‌క్రియ సైతం అధిక కాలాన్ని వెచ్చించ‌ కూడ‌ద‌ంటూ ఆయ‌న హిత‌వు ప‌లికారు. సిఎజి ప్ల‌స్ దిశ గా సిఎజి కూడా పురోగ‌మించ‌వ‌ల‌సి ఉన్నద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

Click here to read full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Vijaydurg Fort, Chhatrapati Shivaji Maharaj’s naval brilliance, earns UNESCO World Heritage status

Media Coverage

Vijaydurg Fort, Chhatrapati Shivaji Maharaj’s naval brilliance, earns UNESCO World Heritage status
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 జూలై 2025
July 23, 2025

Citizens Appreciate PM Modi’s Efforts Taken Towards Aatmanirbhar Bharat Fuelling Jobs, Exports, and Security