ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టాక్ హోమ్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. స్వీడన్ లో తనకు సాదర స్వాగతం పలికినందుకు స్వీడన్ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా స్వీడన్ రాజు కు మరియు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వీడన్ రాజు మరియు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ కూడా హాజరయ్యారు.
భారతదేశం ప్రస్తుతం ఒక గొప్ప పరివర్తనకు లోనవుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ ప్రాతిపదికన ఎన్నుకోవడం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలలో ప్రగతిశీలమైన మరియు సమ్మిళితమైన భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు కృషి చేసినట్లు ఆయన చెప్పారు. 2022 కల్లా ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించేందుకు సకల ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన వివరించారు.
భారతదేశాన్ని మరోమారు ప్రపంచంలో మేధోపరమైన నేత గా నిలచేటట్లుగా అంతర్జాతీయ యోగ దినం తదితర కార్యక్రమాల ద్వారా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. ప్రపంచం భారతదేశానికేసి విశ్వాసంతో చూస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మానవీయ సహాయక చర్యలు, అంతర్జాతీయ సౌర కూటమి లతో పాటు ఎమ్‌టిసిఆర్, వాసెనార్ సర్దుబాటు, ఇంకా ఆస్ట్రేలియా బృందం ల వంటి కీలకమైన సంస్థలలో సభ్యత్వాన్ని గురించి ప్రస్తావించారు. అంతరిక్ష కార్యక్రమంతో సహా భారతదేశం యొక్క సాంకేతిక విజ్ఞాన పరమైన సామర్ధ్యాన్ని ప్రపంచం ఒప్పుకొంటున్నట్లు ఆయన చెప్పారు.
డిజిటల్ మౌలిక సదుపాయాల కారణంగా పౌరులకు మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్న బంధం యొక్క స్వరూపం మారుతోందని ప్రధాన మంత్రి అన్నారు. సాంకేతిక విజ్ఞానం జవాబుదారుతనాన్ని మరియు పారదర్శకత్వాన్ని తీసుకు వస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం అందుబాటులోకి రావడం అనేది ఇక ఎంత మాత్రం ఒక విశేషాధికారం కాదని, అది ఒక అభ్యాసంగా మారిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన, ఫైళ్ళ ను వేగంగా పరిష్కరించడం, వ్యాపార నిర్వహణలో సరళత్వం, జిఎస్‌టి, ప్రయోజనాల ప్రత్యక్ష బదిలీ తో పాటు ఉజ్జ్వల యోజన ద్వారా వంట గ్యాసు లభ్యత లను గురించి చెప్పుకొచ్చారు.
ముద్ర (MUDRA ) పథకం ద్వారా నవ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ముద్ర పథకం లో ఇంతవరకు ప్రయోజనం పొందిన వారిలో 74 శాతం మంది మహిళలే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అటల్ ఇనవేశన్ మిషన్ ను, స్కిల్ ఇండియా ను మరియు స్టార్ట్-ఆప్ ఇండియా ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
నూతన ఆవిష్కారాలకు ఉత్తేజాన్ని ఇచ్చేందుకు భారతదేశంఅంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మించుకొంటోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వీడన్ తో కుదుర్చుకున్న భాగస్వామ్యాన్ని గురించి, మరి అలాగే ఇజ్రాయల్ ఏర్పరచుకొన్న ఇదే తరహా సర్దుబాటును గురించి వివరించారు. జీవించడాన్ని సరళతరంగా మలచడం పై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని గురించి ప్రస్తావించి, ఈ పథకాన్ని ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన ఆరోగ్య సంరక్షణ హామీ పథకంగా అభివర్ణించారు.
ఈ చర్యలు మారుతున్న భారతదేశానికి సంకేతాలు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ లక్ష్య సాధన దిశగా స్వీడన్, తదితర నార్డిక్ దేశాలతో భాగస్వామ్యాలను నెలకొల్పుకోవడానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని ఆయన అన్నారు.
సభికులు భారతదేశంతో వారి యొక్క సంబంధాలను కేవలం మానసికపరమైన స్థాయిలోనే పరిమితం చేసుకోకూడదని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రవర్ధమాన మవుతున్న ‘న్యూ ఇండియా’ వారికి వ్యాపారం చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు మరియు నూతన ఆవిష్కరణలు చేసేందుకు అనేక అవకాశాలను ఇవ్వజూపుతోందని ఆయన అన్నారు.
स्वीडन में मेरे और मेरे डेलीगेशन के स्वागत-सत्कार के लिए यहां की जनता और सरकार का, विशेष रूप से His Majesty King of Sweden और स्वीडन के प्रधानमंत्री श्रीमान लवैन का, मैं हृदय से आभार व्यक्त करना चाहता हूं: PM @narendramodi https://t.co/9xe9GYBqoU
— PMO India (@PMOIndia) April 17, 2018
I thank @SwedishPM Mr. Stefan Löfven. His role in furthering India-Sweden ties is commendable. pic.twitter.com/wrB1s4h827
— PMO India (@PMOIndia) April 17, 2018
A tribute to the Indian diaspora in Sweden. https://t.co/9xe9GYBqoU pic.twitter.com/hwyRqUGU3X
— PMO India (@PMOIndia) April 17, 2018
भाषा अलग हो सकती है, स्थितियां-परिस्थितियां अलग हो सकती हैं, लेकिन एक बात है जो हम सभी को एक सूत्र में पिरोती है। और वो बात है भारतीय होने का गर्व: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 17, 2018
Working towards a New India. https://t.co/9xe9GYBqoU pic.twitter.com/eOZNGIFp2n
— PMO India (@PMOIndia) April 17, 2018
अफ्रीका हो या Pacific Ocean के छोटे देश, या फिर आसियान या यूरोप या एशिया, सभी आज भारत को एक विश्वसनीय साथी, एक भरोसेमंद मित्र के रूप में देख रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 17, 2018
पिछले 4 वर्षों में हमारे द्वारा एक के बाद एक ऐसे कदम उठाए गए हैं, जिनसे भारत में दुनिया की आशा और विश्वास बढे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 17, 2018
Using technology for transparency and accountability. https://t.co/9xe9GYBqoU pic.twitter.com/7QQtmCVmLH
— PMO India (@PMOIndia) April 17, 2018
A new culture of governance in India. pic.twitter.com/Uza1r0GKa2
— PMO India (@PMOIndia) April 17, 2018
How the JAM trinity is benefitting the poor of India. pic.twitter.com/vEAtUn9GWz
— PMO India (@PMOIndia) April 17, 2018
It is our commitment to alleviate poverty. https://t.co/9xe9GYBqoU pic.twitter.com/3YYCHdrQgw
— PMO India (@PMOIndia) April 17, 2018
A focus on 'Ease of Living.' pic.twitter.com/fXFckrKXEz
— PMO India (@PMOIndia) April 17, 2018
To trade, innovate and invest, come to India. We are waiting for you: PM @narendramodi to the Indian diaspora in Sweden
— PMO India (@PMOIndia) April 17, 2018