ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించాలన్న లక్ష్యం సాధ్యమే అని పేర్కొన్నారు.
ఆయన అసోచామ్ వంద సంవత్సరాల సందర్భం గా న్యూ ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన ప్రారంభ కార్యక్రమం లో పాలు పంచుకొన్నారు.
కార్పొరేట్ జగత్తు కు చెందిన ప్రముఖులు, దౌత్యవేత్తలు మరియు ఇతరుల తో కూడిన సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ విలువ గల ఆర్థిక వ్యవస్థ గా రూపొందించాలన్న ఆలోచన ఆకస్మికమైంది ఏమీ కాదు అన్నారు.
గడచిన అయిదు సంవత్సరాల కాలం లో దేశం ఎంత బలం గా తనను తాను తీర్చిదిద్దుకొంది అంటే అది తన కోసం ఆ తరహా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒక్కటే కాకుండా ఆ దిశ గా ప్రయత్నాల ను కూడా చేసిందన్నారు.
“అయిదు సంవత్సరాల క్రితం ఆర్థిక వ్యవస్థ వినాశం దిశ గా పయనిస్తూ వచ్చింది. మా ప్రభుత్వం దీని ని ఆపివేయడం తో పాటు ఆర్థిక వ్యవస్థ లో ఒక క్రమశిక్షణ ను కూడా తీసుకు వచ్చింది.’’
‘‘మేము భారతదేశ ఆర్థిక వ్యవస్థ లో మౌలికమైనటువంటి మార్పుల ను కొని తెచ్చాము. ఇలా ఎందుకు చేశామంటే తద్వారా అది, ఏర్పరచిన నియమాల ఆధారం గా ఒక క్రమశిక్షణయుతమైన పద్ధతి లో నడవగలుగుతుంది. మేము పారిశ్రామిక రంగం దశాబ్దాల తరబడి కోరుకుంటున్నవాటి ని తీర్చాము. అలాగే మేము ఒక 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ కోసమని ఒక బలమైన పునాది ని నిర్మించాము’’ అని ఆయన అన్నారు.
‘‘మేము భారతదేశ ఆర్థిక వ్యవస్థ ను ఆధునికీకరణ మరియు క్రమానుసారత అనే రెండు బలమైన స్తంభాల ఆధారం గా నిలబెడుతున్నాము. క్రనమానుసార ఆర్థిక వ్యవస్థ పరిధి లోకి మరిన్ని రంగాల ను తీసుకు రావడం కోసం మేము కృషి చేస్తున్నాము. దీనితో పాటు, మేము మన ఆర్థిక వ్యవస్థ ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో జోడిస్తున్నాము. తద్వారా ఆధునికత ప్రక్రియ ను మనం వేగవంతం చేసుకోగలుగుతాము.’’
‘‘ప్రస్తుతం ఒక క్రొత్త కంపెనీ ని నమోదు చేయాలి అంటే అనేక వారాలు పట్టేందుకు బదులుగా కేవలం కొద్ది గంటలు చాలు. యాంత్రీకరణ సరిహద్దుల వెంబడి త్వరిత గతిన వ్యాపారానికి దోహదపడుతున్నది. మౌలిక సదుపాయాల సంధానం లో మెరుగుదల నౌకాశ్రయాల ను మరియు విమానాశ్రయాల ను చుట్టి వచ్చే కాలాన్ని తగ్గిస్తున్నది. మరి ఇవి అన్నీ కూడాను ఒక ఆధునికత ను సంతరించుకొంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థ తాలూకు ఉదాహరణలు గా నిలుస్తున్నాయి.’’
‘‘ఈ రోజు న మనకు పరిశ్రమ రంగం యొక్క కోర్కెల ను వినేటటువంటి ప్రభుత్వం ఉన్నది. పరిశ్రమ యొక్క అవసరాల ను ప్రభుత్వం అర్థం చేసుకొని, పరిశ్రమ యొక్క సూచనల పట్ల ప్రతిస్పందిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
నిలుకడతనం తో కూడిన కృషి కారణం గా దేశం ‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం’ తాలూకు ర్యాంకింగ్ లలో చెప్పుకోదగినటువంటి పురోగతి ని నమోదు చేయగలిగిందని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం అనేది నాలుగు పదాలు గా వినపడుతూ వున్నప్పటి కి తత్సంబంధిత ర్యాంకింగ్ లను మెరుగుపరచుకోవాలి అంటే ఆ ప్రక్రియ లో ఎంతో కృషి దాగి వుంది, విధానాల ను మార్చడం మరియు క్షేత్రస్థాయి లో నియమాల ను మార్చడం వంటివి ఈ ప్రక్రియ లో భాగం గా ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
దేశం లో పన్ను చెల్లింపుదారు కు మరియు అధికారుల కు మధ్య మానవ ప్రమేయాన్ని తగ్గించడం కోసం పన్నుల పరిపాలన లో వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసే దిశ గా కృషి సాగుతోందని ప్రధాన మంత్రి చెప్పారు.
‘‘పన్ను వ్యవస్థ లో జవాబుదారీ ని, సామర్ధ్యాన్ని మరియు పారదర్శకత్వాన్ని తీసుకురావడం కోసం మేము పన్ను ల సంబంధిత పరిపాలన లో వ్యక్తుల ప్రమేయాని కి తావు వుండనటువంటి దిశ గా కదులుతున్నాము’’ అని ఆయన అన్నారు.
కార్పొరేట్ రంగం యొక్క భారాన్ని తగ్గించడాని కి మరియు పారిశ్రామిక రంగం భయాని కి తావు లేనటువంటి రీతి లో పని చేసేందుకు అనేక చట్టాల ను ప్రభుత్వం నేరాల పరిధి నుండి తప్పించిందని ప్రధాన మంత్రి చెప్పారు.
‘‘చిన్న చిన్న అతిక్రమణల కు సైతం ఒక క్రిమినల్ నేరం వలే చర్యలు తీసుకొనే పలు నిబంధన లు కంపెనీ చట్టం లో ఉన్నాయన్న సంగతి ని మీరు ఎరుగుదురు. మా ప్రభుత్వం అటువంటి అనేక నిబంధనల ను ప్రస్తుతం నేర పరిధి నుండి తప్పించింది. మేము మరెన్నో నిబంధనల ను కూడా డీక్రిమినలైజ్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాము’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
దేశం లో ప్రస్తుతం కార్పొరేట్ పన్ను అనేది అత్యంత తక్కువ స్థాయి లో ఉందని, ఇది ఆర్థిక వృద్ధి కి ఊతమిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు.
‘‘ప్రస్తుతం కార్పొరేట్ టాక్స్ అతి తక్కువ స్థాయి లో ఉంది. దీని కి అర్థం పరిశ్రమ రంగం నుండి అత్యల్ప కార్పొరేట్ టాక్స్ ను స్వీకరిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మా ప్రభుత్వమే’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
శ్రామిక సంస్కరణల ను తీసుకువచ్చే దిశ గా సాగుతున్నటువంటి కృషి ని గురించి కూడా ఆయన వివరించారు.
బ్యాంకింగ్ రంగాన్ని మరింత లాభసాటి గా, మరింత పారదర్శకం గా తీర్చిదిద్దడం కోసం విస్తృతమైనటువంటి సంస్కరణల ను చేపట్టినట్లు కూడా ఆయన తెలిపారు.
‘‘ప్రభుత్వం తీసుకొన్న చర్యల కారణం గా ఈ రోజున 13 బ్యాంకు లు లాభ పథం లోకి అడుగు పెట్టాయి, వాటి లో 6 బ్యాంకులు పిసిఎ వలయం నుండి బయట పడ్డాయి. బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియ ను కూడా మేము వేగవంతం చేశాము. ప్రస్తుతం బ్యాంకులు వాటి దేశవ్యాప్త విస్తృతి ని మరింత గా పెంపొందింప చేసుకొంటున్నాయి. అవి ప్రపంచ శ్రేణి గుర్తింపు ను సాధించే దిశ గా సాగుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
ఈ సమగ్ర సర్వతోముఖ సకారాత్మకత అండ గా ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ విలువైన లక్ష్యానికేసి దూసుకుపోతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం 100 లక్షల కోట్ల రూపాయల ను మౌలిక సదుపాయాల రంగం లో, ఇంకొక 25 లక్షల కోట్ల రూపాయల ను గ్రామీణ రంగం లో పెట్టుబడి పెడుతుందని ప్రధాన మంత్రి అన్నారు.
आपने अपने सेन्टेनरी सेलीब्रेशन की जो थीम रखी है, वो देश के, देशवासियों के लक्ष्यों और सपनों के साथ जुड़ी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 20, 2019
बीते पाँच वर्षों में देश ने खुद को इतना मजबूत किया है कि इस तरह के लक्ष्य रखे भी जा सकते हैं और उन्हें प्राप्त भी किया जा सकता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 20, 2019
हमने अर्थव्यवस्था के ज्यादातर आयामों को Formal व्यवस्था में लाने का प्रयास किया है।इसके साथ ही हम अर्थव्यवस्था को आधुनिक टेक्नोलॉजी का इस्तेमाल करते हुए Modernize और Speed-Up करने की दिशा में भी आगे बढ़े हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 20, 2019
Ease of Doing Business कहने में चार शब्द लगते हैं लेकिन इसकी रैंकिंग में बदलाव तब होता है जब दिन-रात मेहनत की जाती है, जमीनी स्तर पर जाकर नीतियों में, नियमों में बदलाव होता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 20, 2019
टैक्स सिस्टम में Transparency, Efficiency और Accountability लाने के लिए हम Faceless Tax Administration की ओर बढ़ रहे हैं: PM @narendramodi pic.twitter.com/xmtthdx7AT
— PMO India (@PMOIndia) December 20, 2019
Labor Reforms की बातें भी बहुत वर्षों से देश में चलती रही हैं।कुछ लोग ये भी मानते थे कि इस क्षेत्र में कुछ न करना ही लेबर वर्ग के हित में है। यानि उन्हें अपने हाल पर छोड़ दो, जैसे चलता रहा है, वैसे ही आगे भी चलेगा।लेकिन हमारी सरकार ऐसा नहीं मानती: PM @narendramodi pic.twitter.com/8K6oJdDEOG
— PMO India (@PMOIndia) December 20, 2019
सरकार द्वारा उठाए गए कदमों की वजह से अब 13 बैंक मुनाफे में वापस आ चुके हैं। 6 बैंक PCA से भी बाहर निकल चुके हैं।हमने बैंकों का एकीकरण भी तेज किया है।बैंक अब अपना देशव्यापी नेटवर्क बढ़ा रहे हैं और अपनी ग्लोबल पहुंच कायम करने की ओर अग्रसर हैं: PM @narendramodi pic.twitter.com/PTqtQqxCx9
— PMO India (@PMOIndia) December 20, 2019
मैं आज Assocham के इस मंच से, देश की बैंकिंग से जुड़े लोगों को, कॉरपोरेट जगत के लोगों को ये विश्वास दिलाना चाहता हूं कि अब जो पुरानी कमजोरियां थीं, उस पर काफी हद तक काबू पा लिया गया है।इसलिए खुलकर फैसले लें, खुलकर निवेश करें, खुलकर खर्च करें: PM @narendramodi pic.twitter.com/548muR79M1
— PMO India (@PMOIndia) December 20, 2019
इसी Positivity के आधार पर हम 5 ट्रिलियन डॉलर की इकोनॉमी की तरफ बढ़ने वाले हैं।आने वाले वर्षों में इंफ्रास्ट्रक्चर पर 100 लाख करोड़ रुपए का निवेश, इसे ताकत देगा।देश की ग्रामीण अर्थव्यवस्था पर 25 लाख करोड़ रुपए का निवेश इस लक्ष्य को प्राप्त करने में मदद करेगा: PM @narendramodi pic.twitter.com/tp7LlMKeR8
— PMO India (@PMOIndia) December 20, 2019