On one side there is Vikas and Vishwas while on the other side there is Vanshwad: PM Modi in Gujarat
Congress has never liked Gujarat, has always preferred to see it lag behind: PM Modi in Kutch
Gujarat is my Atma, Bharat is my Parmatma. This land of Gujarat has cared for me, Gujarat has given me strength: PM Modi
Congress lacks Neeti, Niyat, a Neta and a Naata with the people: PM Modi in Gujarat

 

చేసిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కచ్, జస్డాన్, అమ్రేలీ, కమ్రేజ్లలో నాలుగు బహిరంగ సభలలో  ప్రసంగిస్తూ, గుజరాత్ ను మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ దుర్పరిపాలన మొత్తం గుజరాత్ యొక్క అభివృద్ధిపై తీవ్రంగా ప్రభావితం చూపిందని ఆరోపించారు.

"ప్రస్తుతం ఒకవైపు వంశవాదం మరో వైపు వికాస్ మరియు విశ్వాస్ ఉన్నాయి. గుజరాత్ ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీని క్షమించదు మరియు ఇది దీర్ఘకాలంగా జరుగుతుంది. కాంగ్రెస్ గుజరాత్ ను ఎన్నడూ ఇష్టపడలేదు, ఇది వెనుకబడి ఉండడాన్ని చూడడానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిచ్చింది." అని శ్రీ మోదీ అన్నారు.

"కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు, అది ఏమైనా చేయాలని కూడా కోరుకోలేదు మరియు ఇతరులను కూడా ఏమీ చేయనీయలేదు” అని కూడా ప్రధాని విమర్శించారు.

ప్రజలకు నర్మదా జలాలను అందకుండా చేసిన కాంగ్రెస్ ను విమర్శిస్తూ, "30 సంవత్సరాల క్రితమే నర్మదా జలాలు కచ్కు వచ్చిఉంటే ఎలా ఉండేది? ఇది ఇక్కడ ప్రజల జీవితాల్లో ఎంతో పెద్ద మార్పు ఉండేది." అని అన్నారు.

జస్దాన్లో జరిగిన బహిరంగ సభలో, మేము నర్మదా జలాలను సౌరాష్ట్రకు తీసుకువచ్చినప్పుడు, మనల్ని అపహాస్యం చేసిన ప్రజలున్నారు.వారి ప్రతికూల రాజకీయాలు సంవత్సరాలుగా మారలేదు. అభివృద్ధి మరియు మంచి పాలన రాజకీయాలపైనే మా విశ్వాసం." అని ప్రధాని అన్నారు.

కామ్రేజ్లో కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి భయపదుతుందని, అభివృద్ధి, మంచి పాలనలో బిజెపికి సాటిరాలేక పోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

అబద్ధాల వ్యాప్తికి, నిరాశావాద వాతావరణాన్ని సృష్టిస్తున్న కాంగ్రెస్ పై ప్రధానమంత్రి విమర్శలుగుప్పించారు. “గుజరాత్ నా ఆత్మ, భారత్ నా పరమాత్మ. గుజరాత్ నేల నాపై ఎంతో శ్రద్ధచూపింది; గుజరాత్ నాకు బలం ఇచ్చింది ... వారు గుజరాత్కు వచ్చి గుజరాత్ బిడ్డ గురించి అబద్ధాలు వ్యాపింపజేస్తున్నారు. ఇంతకు ముందు వారు సర్దార్ పటేల్తో కూడా ఇదే చేసారు. గుజరాత్ దీనిని ఎన్నటికీ అంగీకరించదు. వ్యాప్తిచేస్తున్న అబద్ధాలను గుజరాత్ లో ఎవరూ అంగీకరించరు." అని అన్నారు.

మరింత మాట్లాడుతూ, కాంగ్రెస్ ఒక కుటుంబం గురించి మాత్రమే మాట్లాడుతుంది మరియు వారికి ప్రజల మరియు దేశ సంక్షేమం గురించి కాదు. "కామ్రాజ్, ఆచార్య కృపలానీ, సుభాష్ బాబు, ఉఎన్దేహర్ (గుజరాత్కు చెందినవారు) గురించి ఏ కాంగ్రెస్ నాయకుడైనా మాట్లాడతారా? లేదు ఎందుకంటే అది కేవలం ఒక కుటుంబానికి సంబంధించినది మాత్రమే... ఒక పాకిస్తానీ కోర్టు ఒక పాకిస్తానీ ఉగ్రవాదిని విడుదల చేస్తే, కాంగ్రెస్ పార్టీ పండగచేసుకుంది. అలా ఎందుకు చేస్తున్నారా అని నేను ఆశ్చర్యపోయాను. అదేసమయంలో వ్యూహాత్మక దాడుల గురించి మన సైన్యాన్ని ఆ పార్టీ నమ్మలేదు మరియు చైనీస్ రాయబారిని నమ్మడానికి ఇష్టపడింది.” అని అన్నారు.

కాంగ్రెస్ ప్రజలపట్ల నీతి, నియమం, నేత, నాటాలు కోల్పోయిందని శ్రీ మోదీ అన్నారు.

కాంగ్రెస్ ఎల్లప్పుడూ గుజరాత్ ను కించపరిచింది ఆయన అభిప్రాయపడ్డారు. సర్దార్ పటేల్, మోరార్జి దేశాయ్లను కాంగ్రెస్ ఎలా చూసింది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ప్రధాని అన్నారు.

"రాత్రికిరాత్రే, ఇందిరా గాంధీ మొరార్జీ భాయి ను క్యాబినెట్ నుండి తొలగించారు. ఆమె పేదలకు బ్యాంకు తలుపులు తెరవలేదు. మేము సేవ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, మేము చేసిన మొదటి పని ఆర్థిక చేరికపై దృష్టి పెట్టి జన్ ధన్ యోజన  ప్రారంభించడం...మోరార్జీ భాయ్ దేశాయ్ ఒక విజయవంతమైన ఆర్థిక మంత్రి మరియు గాంధీ జి లో నమ్మినవాడు. కాంగ్రెస్ అతనిని వేధించింది మరియు అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు అతనిని కలవరపెట్టింది "అని శ్రీ మోదీ అన్నారు.

నేను పేద కుటుంబం నుండి వచ్చిన కారణంగా కాంగ్రెస్ నన్ను ఇష్టపడదు. ఒక పార్టీ అలా ఎలా ఆలోచించగాలుగుతుందో అర్ధం కాదు? అవును, ఒక పేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ప్రధాని కాగలిగాడు. ఈ వాస్తవానికి వారి ధిక్కారం దాచడానికి వారు విఫలమయ్యారు. అవును, నేను టీ అమ్మాను కాని దేశాన్ని అమ్మలేదు. " అని కూడా ప్రధాని అన్నారు.

అభివృద్ధి మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారమని ప్రధాని పేర్కొన్నారు.బిజేపి గుజరాత్ ను ఎలాంటి వివక్ష లేకుండానే పాలించిందని ఆయన చెప్పారు. “"2001 భూకంపం తరువాత కచ్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూడవలసి ఉంది. వ్యవసాయ రంగం వృద్ధి చెందుతోంది. దేశంలోని ప్రజలు రణ్ఉత్సవ్ ఆస్వాదించడానికి ఇక్కడ వస్తున్నారు. కచ్ యొక్క నౌకాశ్రయాలు విపరీతమైన రద్దీని నిర్వహిస్తున్నాయి. అవి భారతదేశానికి ద్వారాలైయ్యాయి. కచ్ పోర్టుల కారణంగా వాణిజ్య రంగం  ఊపందుకుంది 'అని ఆయన చెప్పారు.

26/11 న ముంబైలో ఉగ్రదాడులను ఎదుర్కోలేక పోయినందుకు శ్రీ మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "భారతదేశం 26/11 మరియు ఉరి లో దాడును ఎదుర్కొంది. రెండు దాడుల నేపథ్యంలో భారతదేశం ఎలా స్పందిస్తుందో మీరు చూసారు . ఇది వారి ప్రభుత్వం మరియు మాప్రభుత్వం మధ్య వ్యత్యాసం వివరిస్తుంది. " అని ప్రధాని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అవకాశమున్న ప్రతీచోటా, అవినీతికి పాల్పడిందాని శ్రీ మోదీ ఆరోపించారు. నోట్ల రద్దు అంశంపై మాట్లాడుతూ, పేదలకు అందాల్సినవి అందించడానికి చేపట్టిన చర్య అది అని ప్రధానమంత్రి అన్నారు. "మేము దేశాన్ని దోచుకోవడానికి అనుమతించము. మేము అధికారం కోసం ఇక్కడ లేము, మేము 125 కోట్ల మంది భారతీయులకోసం ఇక్కడ ఉన్నాము. మేము మహిమ యొక్క నూతన స్థాయికి భారతదేశాన్ని తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాము, "అని ఆయన తెలిపారు.



Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi visits the Indian Arrival Monument
November 21, 2024

Prime Minister visited the Indian Arrival monument at Monument Gardens in Georgetown today. He was accompanied by PM of Guyana Brig (Retd) Mark Phillips. An ensemble of Tassa Drums welcomed Prime Minister as he paid floral tribute at the Arrival Monument. Paying homage at the monument, Prime Minister recalled the struggle and sacrifices of Indian diaspora and their pivotal contribution to preserving and promoting Indian culture and tradition in Guyana. He planted a Bel Patra sapling at the monument.

The monument is a replica of the first ship which arrived in Guyana in 1838 bringing indentured migrants from India. It was gifted by India to the people of Guyana in 1991.