ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఐఐటి ఖ‌డ‌గ్ ‌పుర్ 66వ స్నాత‌కోత్స‌వాన్ని ఉద్దేశించి మంగ‌ళ‌వారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భం లో కేంద్ర విద్య శాఖ మంత్రి శ్రీ ర‌మేశ్ పోఖ్ రియాల్ ‘నిశంక్‌’ తో పాటు కేంద్ర విద్య శాఖ స‌హాయ మంత్రి శ్రీ సంజ‌య్ ధోత్రే కూడా పాల్గొన్నారు.

ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ దినం ఐఐటి ఉపాధ్యాయుల కు, విద్యార్థుల త‌ల్లితండ్రుల‌ కు మాత్ర‌మే ముఖ్య‌మైన దినం కాద‌ని, ఈ రోజు ‘న్యూ ఇండియా’ కు కూడా ముఖ్య‌మైన రోజు అని, దీనికి కార‌ణం ఇక్క‌డి విద్యార్థులు యావ‌త్తు దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డ‌మే అన్నారు. ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు వారి జీవ‌నం లో ఒక కొత్త యాత్ర ను మొద‌లుపెట్టే త‌రుణం లో, దేశం లో కోట్ల కొద్దీ ప్ర‌జ‌ల జీవితాల ను మార్చివేసేట‌టువంటి స్టార్ట్‌-అప్స్ ను ఏర్పాటు చేసే దిశ‌ లోను, కొత్త కొత్త వ‌స్తువుల ను ఆవిష్క‌రించే దిశ లోను కృషి చేయాలి అంటూ వారికి ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. వారు ఈ రోజు న సాధించిన ప‌ట్టా ల‌క్షల కొద్దీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ కు ప్ర‌తీక‌గా ఉంద‌ని, వారి ఆకాంక్ష‌ల ను విద్యార్థులు నెరవేర్చవలసివుందని ఆయ‌న అన్నారు.

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల ను అంచ‌నా వేస్తూ, రేప‌టికి కావ‌ల‌సిన నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల ను క‌నుగొనేందుకు కృషి చేయ‌డమే తక్షణావసరమని ప్ర‌ధాన మంత్రి అన్నారు. విష‌యాల ను మ‌రింత క్షుణ్ణం గా చూసే సత్తా ఒక ఇంజినీరు కు ఉంటుంది, కొత్త అంశాల‌ ను కొనుగొన‌డానికి, భవిష్యత్తు లో నూతన ఆవిష్కారాలకుే ఇలాంటి అవ‌గాహ‌నయే ఆధారం అవుతుందని ఆయ‌న అన్నారు. ల‌క్ష‌ల మంది జీవితాల‌ ను కాపాడేటటువంటి, ల‌క్ష‌ల మంది జీవితాల‌ ను మెరుగుపరచేటటువంటి, దేశ వ‌న‌రుల‌ ను ఆదా చేసేటటువంటి ప‌రిష్కార మార్గాల ను కనుగొనాలని విద్యార్థుల‌ ను ఆయ‌న కోరారు.

విద్యార్థులు వారికి వ‌చ్చే సందేహాల ను అధిగ‌మించ‌డం కోసం భ‌విష్య‌త్తు లో ఎదురవగ‌ల అవ‌రోధాల ను అధిగ‌మించ‌డం కోసం ‘సెల్ఫ్ త్రీ’ మంత్రాన్ని అనుస‌రించాల‌ని విద్యార్థుల కు శ్రీ న‌రేంద్ర మోదీ సూచించారు. సెల్ఫ్ త్రీ అంటే.. సెల్ఫ్ అవేర్ నెస్ ( స్వీయ జాగృతి), సెల్ఫ్ కాన్ఫిడెన్స్ (ఆత్మ విశ్వాసం), సెల్ఫ్ లెస్ నెస్ (స్వార్థం అనేది లేక‌పోవ‌డం).. అని ఆయ‌న వివ‌రించారు. విద్యార్థులు వారి శక్తి యుక్తుల ను గుర్తించి ముందుకు సాగాల‌ని, పూర్తి విశ్వాసం తో ముంద‌డుగు వేయాల‌ని, నిస్వార్ధం గా పురోగ‌మించాల‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు.

 

విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం రంగం లో తొంద‌ర‌పాటుత‌నానికి చోటు లేదు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మీరు కసరత్తు చేస్తున్న‌ నూత‌న ఆవిష్క‌ర‌ణ లో సంపూర్ణ సాఫ‌ల్యాన్ని మీరు అందుకోలేక‌పోవ‌చ్చ‌ు అని కూడా ఆయ‌న అన్నారు. అయితే, మీ ఓట‌మి ని కూడా ఒక విజ‌యం గానే ప‌రిగ‌ణించ‌డం జ‌రుగుతుంది. ఎందుకంటే, దాని నుంచి కూడా మీరు ఎంతో కొంత నేర్చుకొంటారు అని ఆయ‌న అన్నారు. ‘న్యూ ఇండియా’ తాలూకు మారుతున్న డిమాండుల ను, ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చ‌డం కోసం 21వ శ‌తాబ్ది లో ఐఐటి లను ఇండియ‌న్ ఇన్స్ టిట్యూట్స్ ఆఫ్ టెక్నాల‌జీ స్థాయి నుంచి ఇన్స్ టిట్యూట్స్ ఆఫ్ ఇన్‌డిజిన‌స్‌ టెక్నాల‌జీస్ స్థాయి కి తీసుకు వెళ్ళవ‌ల‌సిన అవ‌స‌రం ఉందని అన్నారు.

ప్ర‌పంచం జ‌ల‌వాయు ప‌రివ‌ర్త‌న తాలూకు స‌వాళ్ళ‌ తో స‌త‌మ‌తం అవుతూ ఉన్న కాలం లో, భార‌త‌దేశం అంత‌ర్జాతీయ సౌర కూట‌మి (ఐఎస్ఎ) అనే ఆలోచ‌న తో ముందుకు సాగి దానికి ఒక రూపాన్నంటూ ఇచ్చింది అని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ప్ర‌స్తుతం భార‌త‌దేశం ఒక్కొక్క యూనిట్ ఖ‌ర్చు చాలా త‌క్కువ‌ గా ఉన్న‌టువంటి దేశాల లో ఒక దేశం గా ఉంది అని ఆయ‌న అన్నారు. అయితే, ఇంటింటికీ సౌర శ‌క్తి ని అందించ‌డం లో ఇప్పటికీ ఇంకా అనేక స‌వాళ్ళు ఉన్నాయని ఆయ‌న అన్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి వాటిల్లే న‌ష్టాన్ని బాగా త‌గ్గించేట‌టువంటి, మ‌న్నిక క‌లిగిన‌టువంటి, వినియోగ‌దారుకు అనుకూలంగా ఉండేట‌టువంటి సాంకేతిక విజ్ఞానం భార‌త‌దేశాని కి అవ‌స‌రం అని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశానికేసి ప్ర‌పంచం చూస్తూ ఉన్న అంశాల లో విప‌త్తు నిర్వ‌హ‌ణ ఒక అంశం గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. పెద్ద విప‌త్తులు ఎదురైన‌ప్పుడు ప్రాణ‌న‌ష్టం సంభ‌వించడమే కాక ఎక్కువ‌ గా దెబ్బ‌తినేది మౌలిక స‌దుపాయాలు అని ఆయ‌న అన్నారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి రెండు సంవ‌త్సరాల కింద‌ట భార‌త‌దేశం ఐక్య‌ రాజ్య స‌మితి లో కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేసేందుకు చొర‌వ తీసుకొంద‌ని ఆయ‌న చెప్పారు.

ఇండ‌స్ట్రీ 4.0 కై గ‌ణనీయ‌మైన నూత‌న ఆవిష్క‌ర‌ణ ఎంతైనా అవ‌స‌రం అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. పారిశ్రామిక స్థాయి లో ఎఐ కి సంబంధించిన ఎకడెమిక్ రిస‌ర్చ్ రూపు రేఖ‌ల ను మార్పు చేసేందుకు ఐఐటి ఖ‌డ‌గ్ పుర్ న‌డుం క‌ట్ట‌డాన్ని ఆయ‌న ప్రశంసించారు. ఐఐటి ఖ‌డ‌గ్ పుర్ అందించిన సాఫ్ట్‌వేర్ సలూశన్స్ క‌రోనా కు వ్య‌తిరేకం గా పోరాటం సాగించ‌డం లో సైతం ప్ర‌యోజ‌న‌కారి గా నిల‌చాయ‌ని ఆయ‌న అన్నారు. ఆరోగ్య రంగ సంబంధిత సాంకేతిక విజ్ఞానం ప‌రం గా భ‌విష్య‌త్తు కాలానికి త‌గిన ప‌రిష్కార మార్గాల ను అన్వేషించడం లో వేగం గా పాటుప‌డ‌వ‌ల‌సిందిగా ఇన్స్ స్టిట్యూట్ కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. వ్య‌క్తిగ‌త ఆరోగ్య సంర‌క్ష‌ణ సామ‌గ్రి పరం గా ఒక భారీ వ్యాపార అవ‌కాశం ఉబికి వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు. ఆరోగ్యం, శ‌రీర దృఢ‌త్వానికి సంబంధించిన ప‌రిక‌రాల మార్కెట్ సైతం పెరుగుతోంది అని ఆయ‌న అన్నారు. త‌క్కువ ఖ‌ర్చు లో దొరికేట‌టువంటి, కచ్చిత‌త్వం తో ప‌నిచేసేట‌టువంటి వ్య‌క్తిగ‌త ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌రిక‌రాల‌ ను అందించే సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సివుంద‌ని ఆయ‌న అన్నారు.

విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ప‌రిశోధ‌న‌, నూత‌న ఆవిష్క‌ర‌ణ ల‌కు సంబంధించిన రంగం లో క‌రోనా అనంత‌ర కాలం లో ఓ ప్ర‌ముఖ గ్లోబ‌ల్ ప్లేయ‌ర్‌ గా భార‌త‌దేశం ఆవిర్భ‌వించింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆ ప్రేర‌ణ‌ తో, విజ్ఞాన శాస్త్రం, ప‌రిశోధ‌న ల‌కు ఉద్దేశించిన‌ బ‌డ్జెటు లో భారీ పెరుగుద‌ల చోటు చేసుకొంది అని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం, మ్యాప్ ఎండ్ జియోస్పేశ‌ల్ డేటా ను నియంత్ర‌ణ నుంచి ప్ర‌భుత్వం త‌ప్పించింది అని ఆయ‌న అన్నారు. ఈ చ‌ర్య టెక్ స్టార్ట్‌-అప్ ఇకోసిస్ట‌మ్ కు ఎక్క‌డ‌లేని బ‌లాన్ని అందించ‌గ‌ల‌ద‌ని, దానితో పాటు స్వ‌యంస‌మృద్ధియుత భార‌త‌దేశం ఆవిష్క‌ర‌ణ కు ఉద్దేశించిన ప్ర‌చార ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేయ‌గ‌లుగుతుంద‌ని, అంతేకాక దేశం లోని నూత‌న ఆవిష్క‌ర్త‌ల కు, అప్పుడే ఏర్పాటైన స్టార్ట్‌-అప్ ల‌కు కొత్త స్వేచ్ఛ ను కూడా అందించ‌గ‌లుగుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

కొత్త జాతీయ విద్య విధానాన్ని అమ‌లు చేయడం లో ఐఐటి ఖ‌డ‌గ్ పుర్ ప్ర‌య‌త్నాల‌ ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు. మ‌న భావి నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లకు బ‌లం చేకూరేటట్లుగా జ్ఞానాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని ఈ సంస్థ మధిస్తున్న తీరు కు గాను సంస్థ ను ఆయ‌న మెచ్చుకొన్నారు. స్వ‌తంత్ర‌ భార‌త‌దేశానికి 75వ సంవ‌త్స‌రం వ‌చ్చే స‌రికి, ఈ సంస్థ అందించిన‌టువంటి 75 ప్ర‌ధాన నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల ను ఏర్చి కూర్చ‌ాలంటూ ఆయ‌న విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, వాటిని దేశ విదేశాల కు చేర్చాల‌ని కూడా ఆయ‌న కోరారు. ఈ ప్రేరణ లు దేశాని కి ఒక నూతనోత్తేజాన్ని ఇస్తాయ‌ని, విశ్వాసాన్ని ఇనుమ‌డింప చేస్తాయ‌ని ఆయ‌న అన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi