భారతదేశం యొక్క వృద్ధి కథ సైన్స్ మరియు టెక్నాలజీ రంగంలో సాధించిన విజయాలపై ఆధారపడి ఉంటుంది: ప్రధాని
అడ్డంకులను తగ్గించి ‘సైన్స్ ఆఫ్ డూయింగ్ సైన్స్’ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాము: ప్రధాని
2024 నాటికి భారతదేశాన్ని ప్రపంచ స్థాయి, 100 బిలియన్ డాలర్ల బయో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము: ప్రధాని మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 107వ ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సి)ని బెంగ‌ళూరు లో గ‌ల యూనివ‌ర్సిటీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైన్సెస్ లో ఈ రోజు న ప్రారంభించారు.

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ప్రారంభోప‌న్యాసం చేస్తూ, ‘‘భార‌త‌దేశం యొక్క వృద్ధి గాథ విజ్ఞానశాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞాన రంగం లో ఆ దేశం యొక్క కార్య‌సాధ‌న‌ ల పై ఆధార‌ప‌డుతుంది. భారతదేశం యొక్క విజ్ఞానశాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞాన రంగం, ఇంకా నూతన ఆవిష్కరణ ల భూ దృశ్యాన్ని మౌలికంగా మార్చవలసిన అవ‌స‌రం ఉంది’’ అని ఆయ‌న చెప్పారు.

‘‘ఈ దేశం లో వేగంగా ఎదుగుతున్న యువ శాస్త్రవేత్త‌ల కు నా దృ ష్టి లో ఏవేవి ధ్యేయాలు కావాలి అంటే అవి – ‘‘నూత‌న ఆవిష్క‌రణ‌లు, పేటెంట్ లు, ఉత్ప‌త్తులు మరియు సమృద్ధం కావడం’’ అనేవే. ఈ నాలుగు అంశాలు భార‌త‌దేశాన్ని శీఘ్ర అభివృద్ధి దిశ గా న‌డిపిస్తాయి. ‘న్యూ ఇండియా’ మార్గం లో ప్ర‌జ‌ల ద్వారా ప్ర‌జ‌ల కోసం నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు సాగాలి’’ అని ఆయ‌న అన్నారు.

‘‘ ‘న్యూ ఇండియా’ కు సాంకేతిక విజ్ఞానం మ‌రి అలాగే, త‌ర్క‌బ‌ద్ధ‌మైన స్వభావం.. ఈ రెండూ కావాలి. వీటి ద్వారా మ‌నం మ‌న సామాజిక రంగాని కి మరియు ఆర్థిక రంగాని కి ఒక క్రొత్త దిశ ను ఇవ్వ‌గ‌లుగుతాము’’ అని ఆయ‌న అన్నారు. అవ‌కాశాల ను అంద‌రి చెంతకు తీసుకు రావడం లో విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక‌ విజ్ఞానం ఒక స‌మాన‌వ‌కాశాలు ఉండే మైదానాన్ని సిద్ధం చేస్తాయి. మరి ఇది కూడాను స‌మాజం లో ఏకం చేసేటటువంటి ఒక భూమిక ను పోషిస్తుంది ’’ అని ఆయ‌న చెప్పారు.

‘‘ప్ర‌స్తుతం ఇన్ ఫార్మేశన్ ఎండ్ క‌మ్యూనికేశ‌న్ టెక్నాల‌జీ లో చోటు చేసుకొంటున్న ప‌రిణామాలు త‌క్కువ ఖ‌ర్చు లో స్మార్ట్ ఫోన్ ల‌ను మ‌రియు చౌక అయినటువంటి డేటా ను ప్ర‌సాదించ‌గ‌లిగాయి. మ‌రి వీటి ని దేశం లోని ప్ర‌తి ఒక్క‌రీ కి అందుబాటు లోకి తీసుకు వ‌చ్చాయి. ఇదివ‌ర‌కు ఈ సౌక‌ర్యాలు ఏ కొద్ది మందికో ద‌క్కే ఒక విశేషాధికారం గా భావించే వారు. దీనితో సామాన్య మాన‌వుని లో ప్ర‌స్తుతం ఏమని నమ్ముతున్నాడు అంటే అది- తాను ప్రభుత్వం నుండి దూరంగా విసరివేయబడలేదు- అని. ఇప్పుడు ఆయన ప్ర‌భుత్వం తో నేరు గా జోడింప‌బ‌డవచ్చును; ఆయన త‌న వాణి ని వినిపించ‌నూ వ‌చ్చు’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన‌టువంటి మ‌రియు మెరుగైన‌టువంటి నూత‌న ఆవిష్క‌ర‌ణ ల‌కు అనేక అవ‌కాశాలు ఉన్న గ్రామీణాభివృద్ధి రంగం లో కృషి చేయవలసిందంటూ యువ శాస్త్రజ్ఞుల‌ కు ప్ర‌ధాన మంత్రి ఉద్భోదించారు.
‘‘విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం: గ్రామీణ అభివృద్ధి’’ అనేది 107వ ఐఎస్‌సి యొక్క ఇతివృత్తం గా ఉన్న‌ అంశాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. ‘‘కేవ‌లం సైన్స్ ఎండ్ టెక్నాల‌జీ వ‌ల్లే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు అవ‌స‌ర‌మైన వ‌ర్గాల చెంత‌కు చేరాయి’’ అని ఆయ‌న అన్నారు.

‘‘సైన్స్ సంబంధిత ప్ర‌చుర‌ణ‌లు మ‌రియు ఇంజినీరింగ్ సంబంధిత ప్ర‌చుర‌ణ‌ల విష‌యాని కి వ‌స్తే, తోటి దేశాలు ఎన్ని ప్ర‌చుర‌ణ‌ల‌ ను వెలువ‌రించాయి అనే అంశాన్ని స‌మీక్షించేట‌ప్పుడు ప్ర‌పంచ స్థాయి లో భార‌త‌దేశం ప్ర‌స్తుతం మూడో స్థానం లో నిల‌చింది’’ అని ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించారు. ‘‘పియర్ రివ్యూడ్ సైన్స్ ఎండ్ ఇంజినీరింగ్ ప‌బ్లికేశన్స్ యొక్క సంఖ్య ప‌రం గా చూసిన‌ప్పుడు ప్ర‌పంచం లో మూడో స్థానాని కి భారతదేశం ఎగ‌బాకిన‌ట్టు నాతో చెప్పారు. ఇది కూడాను ప్ర‌పంచ స‌గ‌టు అయినటువంటి 4 శాతం తో పోల్చిన‌ప్పుడు సుమారు గా 10 శాతం వంతు న వృద్ధి చెందుతోంది’’ అని ఆయ‌న అన్నారు.

ఇన‌వేశ‌న్ ఇండెక్స్ లో సైతం భార‌త‌దేశం ర్యాంకింగు మెరుగై 52వ స్థానాని కి చేరుకొంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు గ‌డ‌చిన 5 సంవ‌త్స‌రాల కాలం లో అంత‌క్రితం 50 సంవ‌త్స‌రాల కాలం క‌న్నా ఎక్కువ సంఖ్య లో ఇన్ క్యుబేట‌ర్స్ ను సృష్టించినట్లు ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

సుప‌రిపాల‌న ల‌క్ష్య సాధ‌న లో సాంకేతిక విజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘‘నిన్న‌టి రోజు న మా ప్ర‌భుత్వం పిఎం కిసాన్ కార్య‌క్ర‌మం లో 6 కోట్ల మంది ల‌బ్ధిదారుల‌ కు వాయిదా మొత్తాన్ని విడుద‌ల చేయ‌గ‌లిగింది. ఈ ప‌ని ఆధార్ సైదోడు గా క‌లిగిన సాంకేతిక‌ విజ్ఞానం వ‌ల్ల మాత్ర‌మే సాధ్యం అయింది’’ అని ఆయ‌న అన్నారు. అదే మాదిరి గా పేద‌ల కు విద్యుత్తు ను స‌ర‌ఫ‌రా చేయ‌డం లో, టాయిలెట్ ల‌ను నిర్మించ‌డం లో సాంకేతిక‌ విజ్ఞానం అండ‌ గా నిల‌బ‌డిందని ఆయ‌న చెప్పారు. జియో టాగింగ్ మ‌రియు డేటా సైన్స్ అనే సాంకేతిక‌త‌ ల కార‌ణం గా ప‌ట్ట‌ణ ప్రాంతాల లో మ‌రియు గ్రామీణ ప్రాంతాల లో అనేక ప‌థ‌కాల ను అనుకున్న కాలానికే పూర్తి చేయ‌వ‌చ్చని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘ ‘ఈజ్ డూయింగ్ సైన్స్’కు పూచీ ప‌డే విధం గా మేము మా యొక్క ప్ర‌య‌త్నాల ను కొన‌సాగిస్తూవున్నాము. మ‌రి అదే విధం గా ప‌ని లో జాప్యాన్ని త‌గ్గించ‌డం కోసం ఇన్‌ ఫార్మేశన్ టెక్నాల‌జీ ని ప్ర‌భావ‌శీల‌మైన రీతి లో వినియోగిస్తున్నాము’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

డిజిట‌లైజేశన్‌, ఇ-కామ‌ర్స్‌, ఇంట‌ర్‌ నెట్ ఆధారిత‌మైన‌టువంటి బ్యాంకింగ్ మ‌రియు మొబైల్ ఆధారిత‌మైనటువంటి బ్యాంకింగ్ సేవ‌లు గ్రామీణ జ‌నాభా కు చెప్పుకోద‌గిన రీతి లో స‌హాయాన్ని అందిస్తున్నాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్ర‌ధానం గా సాగే కార్య‌క్ర‌మాల కోసం, మ‌రీ ముఖ్యం గా త‌క్కువ ఖ‌ర్చు మాత్ర‌మే అయ్యేట‌టువంటి వ్య‌వ‌సాయం మ‌రియు వ్య‌వ‌సాయ క్షేత్రం నుండి వినియోగ‌దారుల వ‌ర‌కు స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ వంటి రంగాల లో సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించుకొనేందుకు వీలు ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

పొలాల్లో కోత‌ల అనంత‌రం గ‌డ్డి దుబ్బుల‌ ను కాల్చ‌డం కోసం, భూగ‌ర్భ జ‌ల ప‌ట్టిక ల నిర్వ‌హ‌ణ కోసం, సాంక్రామిక వ్యాధుల నివార‌ణ కోసం, ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర‌మైన ర‌వాణా వ్య‌వ‌స్థ వంటి వాటి కి తోడ్ప‌డే సాంకేతిక ప‌రిష్కార మార్గాల‌ ను అన్వేషించ‌వ‌ల‌సింది గా ప్ర‌తి ఒక్క‌రి ని ప్ర‌ధాన మంత్రి కోరారు. భార‌త‌దేశాన్ని 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ గా తీర్చిదిద్దే దిశ గా విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞాన రంగాని కి ఒక ప్ర‌ధానమైన పాత్ర ఉన్న‌ద‌ని ఆయ‌న నొక్కి వ‌క్కాణించారు.

ఇదే సంద‌ర్భం లో ఐ-స్టెమ్ పోర్ట‌ల్ (I-STEM Portal) ను కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ప్రారంభించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones