క్లబ్ డి శెఫ్స్ డి శెఫ్స్ (ప్రపంచవ్యాప్త క్లబ్ ఆఫ్ ప్రెసిడెన్సియల్ శెఫ్స్ క్లబ్) సభ్యులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు భేటీ అయ్యారు.
ఈ క్లబ్ లో 24 దేశాల అధినేతల వ్యక్తిగత వంటవారు సభ్యులుగా ఉన్నారు. ప్రపంచపు అత్యంత ప్రత్యేక పాక శాస్త్ర నిపుణుల కూటమిగా దీనిని అభివర్ణించడం జరిగింది.
పారిస్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఈ సంఘం ప్రస్తుతం మొట్టమొదటిసారిగా తన సర్వ ప్రతినిధి సభను భారతదేశంలో నిర్వహిస్తోంది. వంటవారు ఢిల్లీతో పాటు ఆగ్రాను, అలాగే జైపూర్ ను సందర్శించనున్నారు.
భారతదేశ రాష్ట్రపతికి వంట చేసే శ్రీ మోంటు సైని, అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడికి వంట సిద్ధం చేసే క్రిస్టిటా కోమర్ ఫోర్డ్, యునైటెడ్ కింగ్ డమ్ రాణికి వంటలు చేసిపెట్టే శ్రీ మార్క్ ఫ్లానగన్ తదితరులు ఈ క్లబ్ లో సభ్యులు.
ఈ పాకశాస్త్ర నిపుణులంతా ప్రధాన మంత్రికి స్మృతి చిహ్నాలను అందజేసి, ఆయనతో కలసి ఒక బృంద ఛాయా చిత్రంలో పాలుపంచుకున్నారు.