ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్ర నుండి విచ్చేసిన పది మంది ఆదివాసి విద్యార్థుల బృందాన్ని కలుసుకొన్నారు. ఈ విద్యార్థులు మహారాష్ట్ర ప్రభుత్వ ఆదివాసి వికాస్ విభాగ్ యొక్క ‘‘మిశన్ శౌర్య’’ కార్యక్రమ జట్టులో ఓ భాగం. ఈ బృందం లో నుండి అయిదుగురు విద్యార్థులు 2018 మే నెల లో ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించడంలో కృతకృత్యులయ్యారు.
విద్యార్థులు ఎవరెస్ట్ పర్వత శిఖరారోహణలోను, శిక్షణ కాలంలోను వారి అనుభవాలను వెల్లడించారు. విద్యార్థుల ఘనకార్యాలకు గాను వారిని ప్రధాన మంత్రి అభినందించారు. ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని, అందులో క్రమం తప్పక ముందుకుపోవాలని వారికి ఆయన ఉద్బోధించారు. బృందం సభ్యులను ఆయన సన్మానించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ మరియు హోం శాఖ సహాయ మంత్రి శ్రీ హన్స్ రాజ్ అహీర్ లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.