‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గ్రాండ్ చాలెంజ్’ను న్యూ ఢిల్లీ లోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో నేడు జరిగిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రక్రియ లను సంస్కరించడం కోసం ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డాటా ఎనలిటిక్స్, బ్లాక్ చైన్ తదితర ఆధునిక, సాంకేతిక విజ్ఞానం పై ఆధారపడి పని చేసే నూతన ఆలోచన లను ఆహ్వానించడం ఈ చాలెంజ్ ముఖ్యోద్దేశం గా ఉంది. స్టార్ట్-అప్ ఇండియా పోర్టల్ అనేది ఈ గ్రాండ్ చాలెంజ్ కు వేదిక గా ఉంది.
ఈ సందర్భం గా సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ (ఇఒడిబి)లో భారతదేశం స్థానాన్ని మెరుగుపరచడం లో పరిశ్రమ ప్రతినిధులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతరుల కృషి ని అభినందించారు.
ఇఒడిబి స్థానాల లోని అగ్రగామి 50 స్థానాల లో భారతదేశాన్ని ప్రవేశపెట్టడం కోసం తొలుత తాను తన ఆలోచన ను వెల్లడి చేసినప్పుడు ఆ ఆలోచన పట్ల సంశయాలు వ్యక్తం అయిన సంగతి ని ఆయన గుర్తు కు తెచ్చుకున్నారు. అయితే, నాలుగు సంవత్సరాల కాలం లోనే ఒక గొప్ప మెరుగుదల ప్రస్తుతం కంటి కి కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఈ కాలం లో ఇఒడిబి స్థానం 65 సోపానాల మేరకు మెరుగు పడిందని ఆయన వివరించారు. భారతదేశం ప్రస్తుతం దక్షిణ ఆసియా లో మొదటి స్థానం లో ఉందని, అగ్రగామి 50 స్థానాల లక్ష్యానికి కేవలం కొన్ని అడుగుల దూరం లో నిలచిందని ఆయన చెప్పారు. ఇఒడిబి ని మెరుగు పరచడం లో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సహకార భరితం, స్పర్ధాత్మక సమాఖ్య తత్వం ల స్ఫూర్తి తో కలసి కృషి చేశాయని ఆయన అన్నారు.
విధానాలు చోదకం గా ఉండే పాలన తో పాటు, అంచనా వేయగలిగినటువంటి పారదర్శక విధానం.. వీటిపై కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. సామాన్య ప్రజలు ‘జీవించడం లోని సౌలభ్యాన్ని’ మెరుగుపరచడం కూడా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ధ్యేయమని ఆయన వివరించారు. నేడు చిన్న నవ పారిశ్రామికులు మరింత సులువు గా వ్యాపారం చేయడానికి వీలు ఉందని, విద్యుత్తు కనెక్షన్ పొందడం వంటి సాధారణమైన పనులు సులభతరం అయ్యాయని ఆయన చెప్పారు. కాలం చెల్లినటువంటి 1400కు పైగా చట్టాల ను గడచిన నాలుగు సంవత్సరాలలో రద్దు చేయడం జరిగిందన్నారు. వాణిజ్య వివాదాల పరిష్కారానికి తీసుకొనే సమయాన్ని, అలాగే దిగుమతి చేసుకొన్న వస్తువులకు అనుమతులను ఇవ్వడానికి తీసుకొనే సమయాన్ని తగ్గించడం జరిగిందని వివరించారు. చెప్పుకోదగ్గ మెరుగుదల చోటు చేసుకొన్న ఇతరత్రా పలు రంగాలను గురించి ఆయన ఒకదాని తరువాత మరొకటి గా వెల్లడించారు. ఎమ్‌ఎస్ఎమ్‌ఇ రంగం కోసం ఒక కోటి రూపాయల వరకు రుణాలను 59 నిమిషాల లోపల ఆమోదించడం తదితర చర్య లను అమలు పరచినట్లు ఆయన తెలియ జేశారు.
ఐఎమ్ఎఫ్, ఇంకా మూడీస్ ల వంటి సంస్థ లు ఇవాళ భారతదేశం యొక్క భవిష్యత్తు పట్ల నమ్మకం తోను, ఆశావాదం తోను ఉన్నాయని ప్రధాన మంత్రి వివరించారు. భారతదేశాన్ని సాధ్యమైనంత తక్కువ కాలం లో 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ గా మలచడమే ధ్యేయం అని ప్రధాన మంత్రి అన్నారు. దీని కోసం ఆర్థిక వ్యవస్థ లోని ప్రతి రంగం లో మెరుగుదల చోటు చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. వర్తమాన వాస్తవికతల కు దర్పణం పట్టేటటువంటి ఒక పారిశ్రామిక విధానం తో పాటు, ‘న్యూ ఇండియా’ యొక్క నవ పారిశ్రామికుల కు నూతన దార్శనికత కు అనువైన విధానాలను రూపొందించే దిశ గా కూడా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన అన్నారు. ఇఒడిబి స్థానాల లో అగ్రగామి 50 స్థానాల సరసన నిలచే లక్ష్యాన్ని సాధించే దిశ గా కృషి చేయవలసింది గా సభికుల కు ఆయన ఉద్బోధించారు.
ప్రక్రియల లో మానవ ప్రమేయాన్ని తగ్గించడం కోసం మరియు ఆధునికమైన సాంకేతిక విరిజ్ఞానాన్ని, డిజిటల్ సాంకేతికత లను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. వీటి పై ఆధారపడిన ఒక పని సంస్కృతి ని అలవరచుకో గలిగితే విధానాలే చోదకం గా సాగే పాలన ను మరింత గా ప్రోత్సహించడం సాధ్యపడుతుందని ఆయన చెప్పారు.