ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 సంవత్సరపు కామన్ వెల్త్ గేమ్స్ లో టేబుల్ టెన్నిస్ విభాగం లో పతకాలను గెలుచుకొన్న వారితో ఈ రోజు సమావేశమయ్యారు. న్యూ ఢిల్లీ లోని పార్లమెంటు భవనం లో ప్రధాన మంత్రి ని క్రీడాకారులు కలుసుకొన్నారు.
అంతర్జాతీయ మైదానం లో మార్గదర్శకమైన ప్రదర్శనను ఇచ్చినందుకు గాను పతక విజేతలను ప్రధాన మంత్రి అభినందించారు. వారి యొక్క ప్రదర్శనను చూసి యావత్తు దేశ ప్రజలు గర్వించారని కూడా ఆయన అన్నారు.
భారతదేశం లో చిన్న పట్టణాల నుండి క్రీడా రంగం లో ప్రతిభావంతులు వర్ధిల్లుతుండడం ఆమోదయోగ్యమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. వారిని అదే పనిగా ప్రోత్సహిస్తూ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.
పెట్రోలియమ్, ఇంకా సహజవాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) కర్నల్ రాజ్యవర్ధన్ రాఠౌడ్ కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.