దేశ ప్రజల ను ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించిన కొద్ది సేపటికే ప్రధాన మంత్రి ‘మిశన్ శక్తి’ విజయం లో భాగం పంచుకొన్న శాస్త్రవేత్తల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు.
నేటి మిశన్ శక్తి సాఫల్యం.. ఎంచుకొన్న ఉపగ్రహాల ను ఒక ఉపగ్రహ నిరోధక క్షిపణి ద్వారా విజయవంతం గా కూల్చివేసేటటువంటి సత్తా ఉన్న ప్రపంచ దేశాల లో నాలుగో దేశం గా భారతదేశాన్ని నిలబెట్టింది.
శాస్త్రవేత్త లు సాధించిన ఈ విజయాని కి వారి ని ప్రధాన మంత్రి అభినందించారు. అనుకున్న పని ని చక్కగా నెరవేర్చిన మన శాస్త్రవేత్త లను చూసుకొని యావత్తు దేశం గర్విస్తోందని ఆయన అన్నారు.
‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్యక్రమాని కి అనుగుణం గా, మనం ఎవరికీ తీసిపోం అన్న సందేశాన్ని ప్రపంచాని కి శాస్త్రవేత్తలు చాటారని ఆయన అన్నారు.
భారతదేశం ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అనే తత్వాన్ని అనుసరిస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అనే మాటల కు- ఈ ప్రపంచం అంతా ఒకే పరివారం- అని భావం. అయితే, శాంతి మరియు సద్భావన ల కోసం కృషి చేసే శక్తులు శాంతి సాధన కై సదా బలవత్తరం గా ఉండాలని కూడా ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ శాంతి మరియు ప్రాంతీయ శాంతి అనే లక్ష్యాల సాధన కోసం భారతదేశం సమర్ధం గా, బలం గా ఉండాలని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ ప్రయాస కు శాస్త్రజ్ఞులు అంకిత భావం తో తోడ్పడ్డారని ఆయన అన్నారు. ఆయన మొత్తం కేంద్ర మంత్రివర్గం పక్షాన కూడా శాస్త్రవేత్త లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
శాస్త్రవేత్త లు వారి నైపుణ్యాల ను రుజువు చేసుకొనే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.