ఇటీవలే మహిళల క్రికెట్ ప్రపంచ కప్ లో పాల్గొన్న భారతదేశ మహిళా క్రికెట్ జట్టు లోని క్రీడాకారుల తోను, జట్టు యొక్క అధికారుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.

మహిళల క్రికెట్ జట్టు కు శుభాకాంక్షలు అందిస్తూ ఒక ప్రధాన మంత్రి ట్విటర్ లో సందేశం పంపడం ఇదే మొదటి సారి అని క్రీడాకారిణులు ఈ సందర్భంగా అన్నారు. ఆటలో తమ పురోగమనాన్ని ప్రధాన మంత్రి గమనిస్తున్నారని తెలుసుకొని తాము స్ఫూర్తిని పొందామని, ఇది తమకు గర్వంగాను, సంతోషంగాను భావించామని వారు చెప్పారు.

ఒత్తిడి నుండి బయటపడటాన్ని గురించి క్రీడాకారిణులు అడిగిన ప్రశ్నలకు ప్రధాన మంత్రి జవాబిస్తూ, మనస్సు, శరీరం మరియు చర్యల మధ్య మంచి సమతూకాన్ని సాధించడంలో యోగ తోడ్పడుతుందన్నారు. యోగాభ్యాసం తటస్థంగా ఉండటం అలవరుస్తుందని కూడా ఆయన వివరించారు.

మీరు ‘‘ఓడిపోలేద’’ని క్రీడాకారిణులకు చెప్పిన ప్రధాన మంత్రి, వరల్డ్ కప్ ఫైనల్ లో వారి అపజయాన్ని 125 కోట్ల మంది భారతీయులు తమ భుజాలకెత్తుకున్నారంటూ, నిజానికి, ఇదే వారు సాధించినటువంటి అత్యంత గొప్పదైన విజయం అని అన్నారు.

అనేక అంతర్జాతీయ క్రీడా పోటీలలో భారతదేశపు పుత్రికలు దేశం గర్వించేటట్లు చేశారని ప్రధాన మంత్రి గుర్తుచేస్తూ, వివిధ రంగాలలో మహిళలు సాధిస్తున్న పురోగతి నుండి సమాజం లబ్ధిని పొందుతోందన్నారు. క్రీడలతో పాటు 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షల ఫలితాలను గురించి, అలాగే ఐఎస్ఆర్ఒ (‘ఇస్రో‘) ప్రతిష్ఠాత్మక లక్ష్యాల సాధనలో మహిళా అంతరిక్ష వైజ్ఞానిక వేత్తలు పోషించిన కీలకమైన పాత్రను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

క్రికెటర్లు ప్రధాన మంత్రికి తమ సంతకాలతో కూడిన బ్యాటును బహుమతిగా ఇచ్చారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Private equity investments in Indian real estate sector increase by 10%

Media Coverage

Private equity investments in Indian real estate sector increase by 10%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 డిసెంబర్ 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India