ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘ఎకనోమిక్ పోలిసి – ద రోడ్ అహేడ్’’ విషయం పై నీతి ఆయోగ్ 40 మంది కి పైగా అర్థ శాస్త్రవేత్తల తో మరియు ఇతర నిపుణులు తో ఈ రోజు న ఏర్పాటు చేసిన ఒక ముఖాముఖీ సంభాషణ సమావేశాని కి హాజరయ్యారు.
సమావేశ క్రమం లో, అందులో పాలుపంచుకొన్న వారు స్థూల ఆర్థిక వ్యవస్థ మరియు ఉపాధి, వ్యవసాయం, ఇంకా జల వనరులు, ఎగుమతులు, విద్య మరియు ఆరోగ్యం సంబంధిత అంశాల పై అయిదు వేరు వేరు బృందాలు గా ఏర్పడి, వారి వారి అభిప్రాయాల ను వెల్లడి చేశారు.
ఆర్థిక వ్యవస్థ కు సంబంధించిన వివిధ అంశాల పై ఆహ్వానితులు వారి వారి సూచనల ను మరియు అభిప్రాయాల ను వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి తన ప్రసంగం లో భాగం గా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశాని కి కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్ మరియు శ్రీ రావు ఇంద్రజీత్ సింహ్ కూడా హాజరయ్యారు. నీతి ఆయోగ్ వైస్ చైర్ మన్ శ్రీ రాజీవ్ కుమార్ తో పాటు నీతి ఆయోగ్ కు, ఇంకా కేంద్ర ప్రభుత్వాని కి చెందిన అనుభవయుక్త అధికారులు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.