PM Modi inaugurates various urban development projects at the Madhya Pradesh Shehari Vikas Mahotsav in Indore
PM Modi felicitates the winners of Swachh Survekshan 2018 & give awards to the representatives of Indore, Bhopal & Chandigarh – the top three cleanest cities
In the past 4 years we have built more than 8 crore 30 thousand toilets: PM Modi in Indore #SwachhBharat
Our Govt is working on 5 big plans for cities, these plans include #SwachhBharat, #AwasYojana, Smart City Mission, #AmrutYojana & Deendayal National Urban Livelihood Mission: PM Modi
Our dream of #SwachhBharat for Gandhi Ji's 150th birth anniversary is now on the verge of becoming a reality: PM Modi in Indore

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు మ‌ద్య‌ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల‌లో గ‌ల ప‌లు ప‌ట్ట‌ణాభివృద్ధి ప్రాజెక్టుల‌ను రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఇందులో ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద‌గ‌ల ఇళ్లు, ప‌ట్ట‌ణ నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాలు, ప‌ట్ట‌ణ ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, ప‌ట్ట‌ణ పారిశుధ్యం, ప‌ట్ట‌ణ ర‌వాణా, ప‌ట్ట‌ణ సుంద‌రీక‌ర‌ణ ప్రాజ‌క్టులు ఉన్నాయి.
ఇండోర్‌లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018 అవార్డుల‌ను కూడా బ‌హుక‌రించారు. అలాగే స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2018 ఫ‌లితాల‌ డాష్ బోర్డునుకూడా ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, స్వ‌చ్ఛ భార‌త్ అనేది మ‌హాత్మాగాంధీ క‌ల అని, ఇప్పుడు ఇది 125 కోట్ల మంది ప్ర‌జ‌ల సంక‌ల్ప‌మ‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశంలో అత్యంత ప‌రిశుభ్ర‌మైన న‌గ‌రంగా ఇండోర్ ఎంపికైంద‌ని అంటూ ఇండోర్ నుంచి దేశ ప్ర‌జ‌లు ప్రేర‌ణ పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. ప‌రిశుభ్ర‌త‌లో మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచిన రాష్ట్రాలైన జార్ఖండ్‌, మ‌హారాష్ట్ర‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌ల‌ను కూడా ప్ర‌ధాని అభినందించారు. వ‌చ్చే ఏడాది మ‌హాత్మాగాంధీ 150 జ‌యంతి నాటికి మ‌హాత్ముడి క‌ల సాకారం కాగ‌ల‌ద‌న్న ఆకాంక్ష‌ను ఆయ‌న వ్య‌క్తం చేశారు.

దేశంలో న‌గ‌ర మౌలిక స‌దుపాయాల‌ను ఆధునీక‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏర‌కంగా కృషి చేస్తున్న‌దీ ప్ర‌ధాని వివరించారు. స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్‌కు తోడు, ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ( అర్బ‌న్‌) స్మార్ట్ సిటీ మిష‌న్‌, అమృత్‌, దీన్‌ద‌యాల్ ఉపాధ్యాయ జాతీయ ప‌ట్ట‌ణ జీవ‌నోపాధి మిష‌న్‌ వంటి వాటి గురించి కూడా ప్రధాన‌మంత్రి వివ‌రించారు. కొద్ది రోజుల క్రితం తాను భార‌త దేశ‌పు తొలి స్మార్ట్ సిటీ న‌యా రాయ్‌పూర్‌లో క‌మాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించిన‌ట్టు ప్రధాన‌మంత్రి చెప్పారు. ఇలాంటి కార్య‌క్ర‌మాన్నే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఏడు న‌గ‌రాల‌లో చేప‌ట్టే ప‌నులు కొన‌సాగుతున్న‌ట్టు ప్ర‌ధాని చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చేప‌ట్టిన వివిధ న‌గ‌రాభివృద్ధి చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. ఈరోజు ప్రారంభించిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల వ‌ల్ల మ‌ద్య‌ప్ర‌దేశ్‌లో ఇళ్లులేని ల‌క్ష‌మందికిపైగా ప్ర‌జ‌ల‌కు స్వంత ఇల్లు ల‌భించింద‌ని ఆయ‌న చెప్పారు.

2022 నాటికి అంద‌రికీ గృహ సౌక‌ర్యం క‌ల్పించిచేందుకు భార‌త‌ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌లో సుమారు 1.15 కోట్ల ఇళ్లు నిర్మిత‌మ‌య్యాయ‌ని, 2022 నాటికి ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు సుమారు  మ‌రో 2 కోట్ల ఇళ్లు నిర్మించాల్సి ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం ఉపాధి క‌ల్ప‌న‌కు, మ‌హిళాసాధికార‌త‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. ఇత‌ర రంగాల‌లో సాధించిన అభివృద్ధి గురించి కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు.

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister visited the Indian Arrival monument at Monument Gardens in Georgetown today. He was accompanied by PM of Guyana Brig (Retd) Mark Phillips. An ensemble of Tassa Drums welcomed Prime Minister as he paid floral tribute at the Arrival Monument. Paying homage at the monument, Prime Minister recalled the struggle and sacrifices of Indian diaspora and their pivotal contribution to preserving and promoting Indian culture and tradition in Guyana. He planted a Bel Patra sapling at the monument.

The monument is a replica of the first ship which arrived in Guyana in 1838 bringing indentured migrants from India. It was gifted by India to the people of Guyana in 1991.