PM Modi inaugurates Medical College at Vadnagar, Gujarat
PM Modi launches Mission Intensified Indradhanush, stresses on vitality of vaccination
Prices of stents have been brought down, we are constantly making efforts to so that healthcare becomes affordable for the poor: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తాను ప్రధాన మంత్రి పదవిని స్వీకరించిన నాటి నుండి మొట్టమొదటి సారి ఈ రోజు తన స్వంత ఊరు వడ్ నగర్ లో పర్యటించారు.

పట్టణ నివాసులు ప్రధాన మంత్రికి స్వాగతం పలికేందుకు వీధులలో గుమిగూడారు. ఆయన హాట్ కేశ్వర్ దేవాలయంలో పూజలో పాల్గొన్నారు. తాను బాలుడిగా ఉన్నప్పుడు చదువుకున్న బడికి ఆయన వెళ్లి అక్కడ కొద్దిసేపు ఉన్నారు.

వడ్ నగర్ లోని జిఎమ్ఇఆర్ఎస్ వైద్య కళాశాలను ప్రధాన మంత్రి సందర్శించి, ఆ విద్యాసంస్థను దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటు చేసిన ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. విద్యార్థులతో కాసేపు ఆయన సంభాషించారు.


ఒక బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని, ఆ సందర్భంగా ‘ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్’ను ప్రారంభించారు. వంద శాతం టీకాల లభ్యత లక్ష్యసాధన దిశగా జరుగుతున్న పురోగమనాన్ని వేగవంతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించడమైంది. తక్కువ స్థాయిలో మాత్రమే టీకాలు అందుతున్న పట్టణ ప్రాంతాలు ఇతర ప్రదేశాల పట్ల ఈ కార్యక్రమంలో భాగంగా మరింత శ్రద్ధ తీసుకొంటారు.

 


‘ఆశా’ (ASHA)వర్కర్ల ప‌నితీరును మెరుగు ప‌రచేందుకు ఉద్దేశించిన ఒక కొత్త త‌ర‌హా మొబైల్ ఫోన్ అప్లికేష‌న్ అయినటువంటి ImTeCHO ప్రారంభ సందర్భంగా ఇ-టాబ్లెట్‌ ల‌ను ఆరోగ్య కార్యకర్తలకు ప్ర‌ధాన మంత్రి పంపిణీ చేశారు. అలాగే ఆయన కొన్ని అభివృద్ధి పథకాలను కూడా ప్రారంభించారు.

ఉత్సాహంతో తొణికిసలాడుతున్న ప్రజాసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి ఒకరి స్వంత ఊరికి తిరిగి రావడం మరియు ఈ విధమైనటువంటి ఆత్మీయ స్వాగతాన్ని అందుకోవడం ప్రత్యేకమైనదని చెప్పారు. నేను ఈ రోజున ఏ స్థితిలో ఉన్నా అదంతా ఈ గడ్డ మీద మీ అందరిలో ఒకడిగా ఉంటూ నేను నేర్చుకొన్నటువంటి విలువల కారణంగానే అని ప్రధాన మంత్రి అన్నారు.

మీ ఆశీస్సులతో నేను తిరిగివెళ్తాను. మరి దేశ ప్రజల కోసం నేను మరింతగా కష్టపడతానని మీకు హామీ ఇస్తున్నాను అని వడ్ నగర్ ప్రజలతో ప్రధాన మంత్రి అన్నారు.

ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి పథకాలను మరీ ముఖ్యంగా ‘ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్’ను ప్రారంభించే అవకాశం దక్కడం పట్ల ప్రధాన మంత్రి హర్షం వ్యక్తంచేశారు. స్టెంట్ ల ధరలను ప్రభుత్వం ఎలా దించిందీ ఆయన ప్రస్తావించారు. ఆరోగ్యసంరక్షణ సేవలను పేదలు భరించగలిగే స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వం అదే పనిగా కృషిచేస్తోందని చెప్పారు.

వైద్య కళాశాల విద్యార్థులతో తన ఇష్టాగోష్ఠిని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మన సమాజంలో ప్రజాసేవ చేయగల వైద్యులు మరింత మంది కావాల్సివుందని తెలిపారు.

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi