QuoteUnion Government aims to develop eastern India as the gateway to South-East Asia: PM Modi
QuoteIIT Bhubaneswar would spur the industrial development of Odisha and work towards improving the lives of the people: PM
QuoteCentral Government is devoted towards ensuring all-round development of Odisha: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018, డిసెంబ‌ర్ 24 వ తేదీ నాడు ఒడిశా ను సంద‌ర్శించారు.

|

పైకా తిరుగుబాటు కు సంబంధించిన స్మార‌క త‌పాలా బిళ్ళ‌ ను మ‌రియు నాణేన్ని ప్ర‌ధాన మంత్రి ఐఐటి భువ‌నేశ్వ‌ర్ ఆవరణ లో విడుద‌ల చేశారు. బ్రిటిషు పాల‌న‌ కు వ్య‌తిరేకంగా 1817 వ సంవ‌త్స‌రం లో ఒడిశా లో పైకా తిరుగుబాటు (పైకా బిద్రోహ) చోటు చేసుకొంది.

|

భువ‌నేశ్వ‌ర్ లోని ఉత్క‌ళ్ విశ్వ‌విద్యాల‌యం లో పైకా తిరుగుబాటు కు సంబంధించిన ఒక చైర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్ర‌క‌టించ‌డ‌మైంది.

|

ప్రధాన మంత్రి లలిత్‌గిరి వస్తు ప్రదర్శన శాల ను ప్రారంభించారు. లలిత్‌గిరి ఒడిశా లో ఒక ప్ర‌సిద్ధ‌మైన పురావ‌స్తు ప్రాముఖ్యం క‌లిగిన బౌద్ధ కేంద్రం గా ఉంది. ఇక్క‌డ ఒక స్థూపం, విహారాలు మ‌రియు బుద్ధ భ‌గ‌వానుని మూర్తులు ఉన్నాయి.

ఐఐటి భువ‌నేశ్వ‌ర్ ప్రాంగ‌ణాన్ని శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. భువ‌నేశ్వ‌ర్ లో నూత‌నం గా నిర్మాణ‌మైన ఇఎస్ఐసి ఆసుప‌త్రి ని కూడా ఆయ‌న ప్రారంభించారు. గొట్ట‌పు మార్గాని కి, ఇంకా ర‌హ‌దారి ప‌థ‌కాల‌కు ఆయ‌న శంకుస్థాపన చేశారు.

|

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజున ప్రారంభమైన లేదా శంకు స్థాప‌న జ‌రిగిన ప‌థ‌కాల మొత్తం విలువ 14,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ఉంద‌న్నారు. ఆగ్నేయ ఆసియా కు ఒక ముఖ ద్వారం గా తూర్పు భార‌తావ‌ని ని తీర్చిదిద్దాల‌నేది కేంద్ర ప్ర‌భుత్వం ధ్యేయ‌మ‌ని ఆయ‌న తెలిపారు.

ఒడిశా లో పారిశ్రామిక అభివృద్ధి కి ఐఐటి భువ‌నేశ్వ‌ర్ అండ‌గా నిలుస్తుంద‌ని, ప్ర‌జ‌ల జీవితాల‌ను మెరుగుప‌ర‌చేందుకు త‌గిన సాంకేతిక విజ్ఞానం దిశ‌ గానూ కృషి చేస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

|

రాష్ట్రం లో ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ను, రోడ్ నెట్ వ‌ర్కు ను మ‌రియు చ‌మురు- గ్యాస్ గొట్ట‌పు మార్గ సంబంధ అవ‌స్థాప‌న ను విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు ఉన్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.

ఒడిశా స‌ర్వ‌తోముఖ పురోగ‌తి దిశ‌ గా కేంద్ర ప్ర‌భుత్వం కంకణబ‌ద్ధురాలై ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటించారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Media Coverage

"This kind of barbarism totally unacceptable": World leaders stand in solidarity with India after heinous Pahalgam Terror Attack
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 ఏప్రిల్ 2025
April 25, 2025

Appreciation From Citizens Farms to Factories: India’s Economic Rise Unveiled by PM Modi