ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018, డిసెంబర్ 24 వ తేదీ నాడు ఒడిశా ను సందర్శించారు.
పైకా తిరుగుబాటు కు సంబంధించిన స్మారక తపాలా బిళ్ళ ను మరియు నాణేన్ని ప్రధాన మంత్రి ఐఐటి భువనేశ్వర్ ఆవరణ లో విడుదల చేశారు. బ్రిటిషు పాలన కు వ్యతిరేకంగా 1817 వ సంవత్సరం లో ఒడిశా లో పైకా తిరుగుబాటు (పైకా బిద్రోహ) చోటు చేసుకొంది.
భువనేశ్వర్ లోని ఉత్కళ్ విశ్వవిద్యాలయం లో పైకా తిరుగుబాటు కు సంబంధించిన ఒక చైర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించడమైంది.
ప్రధాన మంత్రి లలిత్‌గిరి వస్తు ప్రదర్శన శాల ను ప్రారంభించారు. లలిత్‌గిరి ఒడిశా లో ఒక ప్రసిద్ధమైన పురావస్తు ప్రాముఖ్యం కలిగిన బౌద్ధ కేంద్రం గా ఉంది. ఇక్కడ ఒక స్థూపం, విహారాలు మరియు బుద్ధ భగవానుని మూర్తులు ఉన్నాయి.
ఐఐటి భువనేశ్వర్ ప్రాంగణాన్ని శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అంకితం చేశారు. భువనేశ్వర్ లో నూతనం గా నిర్మాణమైన ఇఎస్ఐసి ఆసుపత్రి ని కూడా ఆయన ప్రారంభించారు. గొట్టపు మార్గాని కి, ఇంకా రహదారి పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజున ప్రారంభమైన లేదా శంకు స్థాపన జరిగిన పథకాల మొత్తం విలువ 14,000 కోట్ల రూపాయలకు పైగానే ఉందన్నారు. ఆగ్నేయ ఆసియా కు ఒక ముఖ ద్వారం గా తూర్పు భారతావని ని తీర్చిదిద్దాలనేది కేంద్ర ప్రభుత్వం ధ్యేయమని ఆయన తెలిపారు.
ఒడిశా లో పారిశ్రామిక అభివృద్ధి కి ఐఐటి భువనేశ్వర్ అండగా నిలుస్తుందని, ప్రజల జీవితాలను మెరుగుపరచేందుకు తగిన సాంకేతిక విజ్ఞానం దిశ గానూ కృషి చేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
రాష్ట్రం లో ఆరోగ్య సంరక్షణ సంబంధిత మౌలిక సదుపాయాలను, రోడ్ నెట్ వర్కు ను మరియు చమురు- గ్యాస్ గొట్టపు మార్గ సంబంధ అవస్థాపన ను విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నట్లు ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
ఒడిశా సర్వతోముఖ పురోగతి దిశ గా కేంద్ర ప్రభుత్వం కంకణబద్ధురాలై ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
ओडिशा के विकास के लिए समर्पित भाव से काम करने का हमारा संकल्प आज एक और अहम पड़ाव पर पहुंचा है।
— PMO India (@PMOIndia) December 24, 2018
थोड़ी देर पहले 14 हज़ार करोड़ रुपए से अधिक के अनेक प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण किया गया है: PM
आज IIT भुवनेश्वर को युवाओं के लिए समर्पित करने का सौभाग्य मुझे मिला है।
— PMO India (@PMOIndia) December 24, 2018
इसके निर्माण में 1260 करोड़ रुपए खर्च किए गए हैं।
ये भव्य कैंपस आने वाले समय में ओडिशा के नौजवानों के सपनों के सेंटर तो बनेगा ही, यहां के युवाओं के लिए रोज़गार का नया माध्यम भी सिद्ध होगा: PM
शिक्षा के साथ-साथ जनता के स्वास्थ्य पर भी केंद्र सरकार पूरी गंभीरता से ध्यान दे रही है।
— PMO India (@PMOIndia) December 24, 2018
इसी भावना के साथ खोरधा-भुवनेश्वर में बने ESIC अस्पताल में हुए विस्तारीकरण का काम भी पूरा किया जा चुका है।
आज आधुनिक सुविधाओं से युक्त इस अस्पताल को भी जनता के लिए समर्पित किया गया है: PM
पूर्वी भारत को पाइप से गैस पहुंचाने की दिशा में प्रधानमंत्री ऊर्जा गंगा योजना तेज़ गति से चल रही है।
— PMO India (@PMOIndia) December 24, 2018
इसी के तहत आज जगदीशपुर-हल्दिया-बोकारो-धामरा पाइपलाइन प्रोजेक्ट के बोकारो-आंगुल सेक्शन का शिलान्यास आज किया गया है: PM
साधनों-संसाधनों का विकास तब तक अपूर्ण है जब तक सांस्कृतिक विकास का आयाम उससे नहीं जुड़ता।
— PMO India (@PMOIndia) December 24, 2018
देश के पहले स्वतंत्रता संग्राम में अहम भूमिका निभाने वाली पायका क्रांति के 200 वर्ष पूरे होने पर एक विशेष डाक टिकट और सिक्का भी आज जारी किया गया है: PM
पायका के नायकों को सम्मान देने के साथ-साथ ओडिशा की समृद्ध आध्यात्मिक विरासत को दुनिया के सामने लाने का काम भी किया जा रहा है।
— PMO India (@PMOIndia) December 24, 2018
कटक जिले के ललितगिरी में आर्कियोलॉजी म्यूज़ियम का उद्घाटन भी आज किया गया है: PM
केंद्र सरकार ओडिशा के संपूर्ण विकास के लिए समर्पित है।
— PMO India (@PMOIndia) December 24, 2018
ओडिशा के इंफ्रास्ट्रक्चर से लेकर जन-जन के विकास के लिए तमाम कदम उठाए जा रहे हैं।
मैं आपको विश्वास दिलाता हूं कि ये काम निरंतर जारी रहेगा: PM