కోల్ కాతా పోర్ట్ ట్ర‌స్ట్ కు 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో కోల్ కాతా లో ఈ రోజు న నిర్వహించిన వార్షికోత్స‌వాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌రు అయ్యారు. ఈ సంద‌ర్భం లో ప్రధాన మంత్రి కోల్ కాతా లో ర‌బీంద్ర సేతు (హావ్ డా బ్రిడ్జి) తాలూకు ఇంట‌ర్ యాక్టివ్ లైట్ అండ్ సౌండ్ శో ను ప్రారంభించారు. స‌భా స్థ‌లి వ‌ద్ద ఏర్పాటు చేసిన ఒక అపురూప సాంస్కృతిక కార్య‌క్ర‌మాన్ని కూడా ఆయ‌న వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని సౌండ్ ఎండ్ లైట్ శో ను ఆరంభించిన సందర్భం లో ఏర్పాటు చేయడమైంది.

|

ఈ కార్య‌క్ర‌మాని కి ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ జ‌గ్‌ దీప్ ధ‌న్‌ ఖ‌ఢ్, ప‌శ్చిమ బెంగాల్‌ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ల‌తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

|

ర‌బీంద్ర సేతు ను విద్యుత్తు ను తక్కువ గా వినియోగించుకొనేటటువంటి విభిన్న రంగుల తో కూడిన 650 ఎల్ఇడి బల్బుల తో ఒక న‌వీన‌మైన రీతి న అలంక‌రించ‌డ‌మైంది. సంగీతానికి అనుగుణం గా అతి సుందరమైనటువంటి వెలుగుల ను విరజిమ్మే ప్రదర్శన కార్యక్రమం అదనపు హంగు గా ఉంటుంది. ఇంజినీరింగ్ లో ఓ అద్భుతం గా పరిగణించేటటువంటి హావ్ డా బ్రిడ్జి కి ఈ బల్బు లు వారసత్వ రూపు ను సంతరించగలవు. క్రొత్త గా ఆరంభించిన ఈ ఇంట‌ర్ యాక్టివ్ శో స్థానికుల‌నే కాక యాత్రికుల ను కూడా ఆక‌ర్షించుకోవడం లో తోడ్పడగలుగుతుందని ఆశిస్తున్నారు.

|

 

|

ర‌బీంద్ర సేతు ను 1943వ సంవ‌త్స‌రం లో నిర్మించడమైంది. ఈ వంతెన యొక్క 75వ వార్షిక వేడుక ను గ‌డ‌చిన సంవ‌త్స‌రం లో జరిపారు. ఈ వారధి లో ఎటువంటి న‌ట్ లను గాని లేదా బోల్టుల ను గాని ఉపయోగించలేదు. చీలల‌ ను అమర్చి వాటి ని బిగించ‌డం ద్వారా దీనిని ఏర్పాటు చేశారు. దీని నిర్మాణం లో 26,500 ట‌న్నుల ఉక్కు ను వాడారు. ఇందులో 23,000 ట‌న్నుల ఉక్కు బాగా ఉన్నతమైన శ్రేణి కి చెందినటువంటిది.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan

Media Coverage

'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
QuoteToday, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
QuoteOperation Sindoor is an unwavering pledge for justice: PM
QuoteTerrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
QuotePakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
QuoteOperation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
QuoteThis is not an era of war, but it is not an era of terrorism either: PM
QuoteZero tolerance against terrorism is the guarantee of a better world: PM
QuoteAny talks with Pakistan will focus on terrorism and PoK: PM

ప్రియమైన దేశ ప్రజలారా.. నమస్కారం

గత కొన్ని రోజులుగా మనమందరం దేశ సామర్థ్యం, సహనాన్ని రెండింటిని చూశాం

మొదటగా..భారత దేశ పరాక్రమ సేనకు, సరిహద్దు బలగాలకు, నిఘా సంస్థలకు, శాస్త్రవేత్తలకు, ప్రతి ఒక్క భారతీయుడి తరఫున సెల్యూట్ చేస్తున్నాను.

మన వీర సైనికులు ఆపరేషన్ సిందూర్‌లో కచ్చితత్వంతో అసమాన శౌర్యాన్ని చూపిస్తూ లక్ష్యాలను ఛేదించారు

వారి వీరత్వం, పరాక్రమానికి, వారి సాహసానికి సెల్యూట్ చేస్తున్నాను

 

మన దేశ ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి కూతురుకు ఈ పరాక్రమాన్ని అంకితం చేస్తాం

 

మిత్రులారా...ఏప్రిల్ 22న పెహల్గామ్ లో ఉగ్రవాదులు క్రూరత్వాన్ని చూపించారు

ఈ ఘటన దేశాన్ని, ప్రపంచాన్ని వణికించింది.

సెలవులు గడపడానికి వెళ్లిన అమాయాక పౌరులను వారి మతం అడిగి...వారి కుటుంబం ముందే, వారి పిల్లల ముందే దయలేకుండా హతమార్చారు. ఇది ఉగ్రవాదానికి బీభత్సానికి, క్రూరత్వానికి ప్రతీక.

 

దేశంలోని సౌభ్రాత్రుత్వాన్ని విడగొట్టడానికి ఘోరమైన ప్రయత్నం. వ్యక్తిగతంగా నాకు ఇది ఎంతో బాధను కలిగించింది. ఈ ఉగ్రవాద దాడి తర్వాత దేశమంతా, ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి వర్గం, ప్రతి రాజకీయ పార్టీ ముక్తకంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏకమయ్యారు. ఉగ్రవాదాన్ని తుదముట్టేంచేందుకు భారతీయ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం.

 

మన చెల్లెల్లు, కూతుళ్ల నుదిటి సింధూరాన్ని చేరిపేస్తే..దాని సమాధానం ఎలా ఉంటుందో ప్రతి ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థ తెలుసుకుంది.

మిత్రులారా..ఆపరేషన్ సిందూర్ ఇదొక పేరు కాదు.

ఇది దేశంలోని కోటానుకోట్ల ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది

ఆపరేషన్ సిందూర్ న్యాయం కోసం ఒక అఖండ ప్రతిజ్ఞ.

మే 6 రాత్రి, మే7 తెల్లవారుజామున ఈ ప్రతిజ్ఞ ఫలితాలను ప్రపంచం మొత్తం చూసింది.

భారత సైన్యం పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై...వారి శిక్షణ కేంద్రాలపై కచ్చితమైన దాడి చేసింది. ఉగ్రవాదులు కలలో కూడా అనుకొని ఉండకపోవచ్చు...భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని..కానీ ఎప్పుడైతే దేశం ఏకమవుతుందో..నేషన్ ఫస్ట్ అనే భావన ఉంటుందో.. దేశ హితమే ముఖ్యమని అనుకుంటున్నామో అప్పుడే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ ఫలితాలను సాధించి చూపిస్తాం

 

పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మిసైల్ దాడులు చేసినప్పుడు, డ్రోన్ల దాడులు చేసినప్పుడు, ఉగ్రవాద సంస్థల భవనాలే కాకుండా వారి ధైర్యం కూడా ధ్వంసం అయ్యాయి. బవహల్ పూర్, మురిద్కేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు...ఒక రకంగా ప్రపంచ ఉగ్రవాదానికి విశ్వవిద్యాలయాలుగా ఉన్నాయి.

ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగినా, 9/11, లండన్ బాంబ్ బ్లాస్టింగ్ లేదా, భారత్ లో జరిగిన పెద్ద ఉగ్రవాద దాడులు, వాటి మూలాలు ఈ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలతో ముడిపడి ఉన్నాయి.

ఉగ్రవాదులు మన అక్కాచెల్లెల్ల సిందూరాన్ని తుడిచేశారు. అందుకే భారత్ ఉగ్రవాద ముఖ్య కేంద్రాలను సర్వనాశనం చేసింది. భారత్ దాడిలో వంద మందికిపైగా అతి భయంకరమైన ఉగ్రవాదులు హతం అయ్యారు.

గత రెండున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి సూత్రధారులు బహిరంగంగా తిరుగుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. భారత్ ఒక్కదాడితో వారందరినీ అంతమొందించింది. మిత్రులారా.. భారత దేశ ఈ చర్యతో పాకిస్తాన్ ఎంతో నిరాశ, నిస్పృహకు, గాభరపాటుకు లోనయ్యింది. ఈ గాభరపాటులోనే పాకిస్తాన్ మరొక దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరులో భారత్ కు మద్దతుగా నిలవాల్సింది పోయి పాకిస్తాన్ భారత్ పై దాడిని ప్రారంభించింది. పాకిస్థాన్ మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, సామాన్య పౌరుల నివాసాలే లక్ష్యంగా దాడులు చేసింది. పాక్ మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కానీ..దీంతో పాకిస్తాన్ నిజస్వరూపం బయటపడింది. అలాగే పాకిస్తాన్ కుట్రలు కూడా బయటపడ్డాయి..

ప్రపంచం మొత్తం పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ ఎలా ముక్కలుముక్కలు చేసిందో చూశాయి. భారత దేశ సమర్ధమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆ డ్రోన్లు, మిస్సైళ్లను ఆకాశంలోనే నాశనం చేశాయి. పాకిస్తాన్ సరిహద్దు వద్ద యుద్దానికి సిద్దమైంది..ఐతే భారత వాయుసేన పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కీలక స్థావరాలపై దాడి చేసింది.

భారత డ్రోన్లు, మిస్సైళ్లు కచ్చితమైన లక్ష్యాలపై దాడి చేశాయి.

పాకిస్థాన్ వాయు సేన ఎయిర్ బేస్‌ను నష్టం కలిగించాం. ఈ ఎయిర్ బేస్ పై పాకిస్థాన్‌కు గర్వం ఉండేది. భారత్ మొదటి మూడు రోజుల్లోనే పాకిస్థాన్‌లో చేసిన నష్టం, వాళ్ల ఊహకు కూడా అందలేదు. అందుకే భారత ప్రతి దాడి తర్వాత పాకిస్థాన్ తనను తాను రక్షించుకునేందుకు అనేక మార్గాలను వెతకడం ప్రారంభించింది.

ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ వినతులు చేసింది. ఇంత ఘోరంగా దెబ్బతినడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మే 10 మధ్యాహ్నానికి పాక్ సైన్యం మన డీజీఎంవోను సంప్రదించారు. అప్పటికే..ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున నాశనం చేశాం. అనేక ఉగ్రవాదులను హతం చేశాం. పాకిస్థాన్‌లో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఉగ్ర స్థావరాలను శ్మశానంలా మార్చేశాం. అందుకే పాకిస్థాన్ నుంచి ఇలాంటి వినతులను వచ్చాయి. పాకిస్థాన్ తరఫు నుంచి ఇలా అన్నారు...తమ నుంచి భవిష్యత్‌లో ఉగ్రవాద చర్యలు, సైనిక దుస్సాహసం జరగదని హామీ ఇచ్చారు. దానిపై ఆలోచిస్తుందని...దీన్ని మరోసారి నేను చెప్తున్నాను. మనం పాకిస్తాన్ ఉగ్రవాద సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేశాం, ప్రతిదాడిని ప్రస్తుతానికి ఆపేశాం. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ తీసుకునే ప్రతి అడుగును ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వారి వైఖరి ఎలా ఉంటుందో చూస్తాం. మిత్రులారా భారత్, త్రివిధ దళాలు మన ఎయిర్ ఫోర్స్, మన సైన్యం, మన నౌకా దళం, బీఎస్ఎఫ్, భారత అర్థ సైనిక బలాలు ప్రతిక్షణం అలర్ట్‌గా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఆపరేషన్ సిందూర్ వంటివి ఉగ్రవాదుల వ్యతిరేకంగా భారత విధానంగా చూడాలి. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. దాడుల స్థాయిని పెంచి న్యూ నార్మల్‌ని నిర్దేశించాం. అందులో మొదటగా భారత్ మీద ఉగ్రదాడులు జరిగితే దానికి ధీటైన జవాబు ఇస్తాం.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రపంచం పాకిస్తాన్ అసహ్యకరమైన సత్యాన్ని మరోసారి చూసింది. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల సమయంలో పాక్ సైన్యంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి. భారత్, తన పౌరుల రక్షణ కోసం నిరంతరంగా నిర్ణయాక చర్యలు తీసుకుంటుంది.

మిత్రులారా...యుద్ధ క్షేత్రంలో మనం ప్రతిసారి పాకిస్థాన్ ను ఓడించాం. ఈ సారి కూడా ఆపరేషన్ సిందూర్ కొత్త శిఖరాలకు చేర్చింది.

మన సైన్యం ఎడారి, కొండల్లో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. అలాగే..కొత్త తరం యుద్ధ తంత్రంలో కూడా మనం శ్రేష్ఠత సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. ఈ ఆపరేషన్ లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల సామర్ధ్యం కూడా నిరూపితమైంది. ఈ రోజు ప్రపంచమంతా చూస్తోంది. 21వ శతాబ్ద యుద్ధంలో భారత్ లో తయారైన రక్షణ ఉత్పత్తుల వినియోగానికి సమయం వచ్చింది.

మిత్రులారా..ఏరకమైన ఉగ్రవాదానికైనా వ్యతిరేకంగా మనం అందరం ఏకంగా ఉండటం అదే మన బలం.

కచ్చితంగా ఇప్పుడు ఇది యుద్ధ యుగం కాదు. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ విధానం....ఒక సురక్షిత ప్రపంచానికి గ్యారంటీ..

మిత్రులారా పాకిస్థాన్ ప్రభుత్వం ఎలాగైతే ఉగ్రవాదానికి మద్దతుగా ఉందో..అదే ఉగ్రవాదం భవిష్యత్తులో పాకిస్తాన్‌నే అంతం చేస్తుంది. పాకిస్థాన్ తనను తాను కాపాడుకోవాలంటే..తన భూభాగంలో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్‌ను అంతం చేయాల్సిందే..

దీనికి మించి శాంతికి మరేదారి లేదు. భారత దేశ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. టెర్రర్ అండ్ టాక్...ఉగ్రవాదం ఒకే పడవ మీద ప్రయాణం చేయలేవు. ఉగ్రవాదం వ్యాపారం ఒకే దగ్గర ఇమిడి ఉండవు. నీరు రక్తం కూడా ఒకే దగ్గర ఉండవు. నేను ఈ రోజు ప్రపంచానికి చెప్తున్నానను..ఇది మా ప్రకటిత విధానం. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అది కేవలం ఉగ్రవాదంపైనే...పాకిస్థాన్ తో చర్చలు జరిపితే పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే జరుగుతుంది. ప్రియమన దేశ ప్రజలారా ..ఈ రోజు బుద్ద పూర్ణిమ...భగవాన్ బుద్దుడు మనకు శాంతి మార్గాన్ని చూపించారు. శాంతి మార్గమే శక్తిగా ఉంటుంది. మానవాళి శాంతి, సమృద్ధి వైపు ముందుకు వెళుతోంది ప్రతి భారతీయుడు శాంతితో జీవించాలి. వికసిత్ భారత్ కలను పూర్తి చేయాలి. దీని కోసం భారత్, శాంతియుంతంగా ఉండాలి అవసరమైతే శక్తిని కూడా వాడాలి. గత కొన్ని రోజులుగా భారత్ ఇదే చేస్తోంది. నేను మరోసారి భారత సైన్యానికి, భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్నాను. భారతీయులందరి ధైర్యం, ఐక్యతకు నేను నమస్కరిస్తున్నాను.

ధన్యవాదాలు....

భారత్ మాతా కీ జై

​​​​​​​భారత్ మాతా కీ జై

​​​​​​​భారత్ మాతా కీ జై​​​​​​​....