PM Modi inaugurates building of Dr. A.P.J. Abdul Kalam Technical University
PM Modi distributes sanction letters to the beneficiaries of Pradhan Mantri Awas Yojana in Lucknow
Vital to connect India's youth with latest technology, says PM Modi
Power and energy matter immensely in the development journey of a nation: Prime Minister Modi
GST demonstrates the strength of our democracy, credit goes to 125 Indians: PM Narendra Modi

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లఖ్ నవూ లో డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించారు. 400 కెవి సామర్థ్యం కలిగిన లఖ్ నవూ-కాన్ పుర్ డి/ సి ట్రాన్స్ మిషన్ లైనును దేశ ప్రజలకు అంకితమిచ్చారు. అలాగే, ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు కూడా. 

ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రసంగిస్తూ, అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో భారతదేశాన్ని జోడించటాన్ని గురించి సుదీర్ఘంగా వివరించారు. ‘‘మన యువతీయువకులు స్టార్ట్ అప్ లను గురించి మరియు ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కారాలను గురించి, మరీ ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ సామగ్రి విషయంలో ఆలోచనలు చేయాల’’ని ప్రధాన మంత్రి సూచించారు. 

అన్ని జిల్లాలకు విద్యుచ్ఛక్తి సరఫరా అయ్యేటట్లు శ్రద్ధ తీసుకొన్నందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి అభినందించారు. ‘‘ఒక దేశం అభివృద్ధి వైపు పయనించే క్రమంలో విద్యుత్తు మరియు శక్తి అపార ప్రభావాన్ని ప్రసరింపచేస్తాయి. ఇవాళ సౌర శక్తి భారతదేశంలో ప్రజాదరణ పొందుతోంది’’ అని ఆయన అన్నారు. 

జులై 1వ తేదీ నుండి అమలు కానున్న జిఎస్ టి ని గురించి కూడా ప్రధాన మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ఇది ప్రజాస్వామ్యం యొక్క శక్తిని చాటింది’’ అని ఆయన చెప్పారు. ‘‘జిఎస్ టి అమలు యొక్క ఖ్యాతి భారతదేశపు 125 కోట్ల మందికి చెందుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 డిసెంబర్ 2024
December 27, 2024

Citizens appreciate PM Modi's Vision: Crafting a Global Powerhouse Through Strategic Governance