కుండ‌లీ-మానేస‌ర్-ప‌ల్‌వ‌ల్‌ (కెఎంపి) వెస్టర్న్ పెరిఫెర‌ల్ ఎక్స్‌ప్రెస్ వే లో ఓ భాగ‌మైన‌ కుండ‌లీ-మానేస‌ర్ సెక్ష‌న్ ను హ‌రియాణా లోని గురుగ్రామ్ వ‌ద్ద గ‌ల సుల్తాన్‌పుర్ లో ఈ రోజు న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.  బ‌ల్ల‌భ్‌ గ‌ఢ్‌-ముజేస‌ర్ మెట్రో లింకు ను కూడా ఆయ‌న ప్రారంభించారు.  శ్రీ విశ్వ‌క‌ర్మ స్కిల్ యూనివ‌ర్సిటీ కి శంకుస్థాప‌న చేశారు.

|

భారీ జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఎక్స్‌ప్రెస్ వే, ఇంకా మెట్రో సంధానం హ‌రియాణా లో ర‌వాణా రంగ విప్ల‌వాని కి నాంది ప‌ల‌క‌నున్నట్లు పేర్కొన్నారు.  శ్రీ విశ్వ‌క‌ర్మ స్కిల్ యూనివ‌ర్సిటీ నుండి ఈ ప్రాంత యువ‌త బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌యోజ‌నాన్ని పొంద‌గలదని ఆయ‌న చెప్పారు.

|

కెఎంపి ఎక్స్‌ప్రెస్ వే ప‌థ‌కం ప్రాధాన్య ప్రాతిప‌దిక‌ న పూర్తి అయ్యేట‌ట్లుగా కేంద్ర ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ తీసుకుంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  ఢిల్లీ లో మ‌రియు ప‌రిస‌ర ప్రాంతాల లో కాలుష్యాన్ని త‌గ్గించ‌డం లో ఈ ఎక్స్‌ప్రెస్ వే ఒక ప్ర‌ధానమైన పాత్ర‌ ను పోషించ‌గ‌ల‌ద‌ని ఆయ‌న చెప్పారు.  ఇది ప‌ర్యావ‌ర‌ణ మిత్ర పూర్వ‌క‌ం అయిన‌టువంటి ప్ర‌యాణ స‌దుపాయాన్ని అందించ‌డం తో పాటు ‘జీవించ‌డం లో సౌల‌భ్యాన్ని’ కూడా కొని తెస్తుంద‌ని ఆయన వివ‌రించారు.

|

 

|

ర‌వాణా సంధానం యొక్క ప్రాముఖ్యాన్ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేస్తూ, ఇది స‌మృద్ధి కి, సాధికారిత కు, ఇంకా అందుబాటు కు ఒక సాధ‌నం గా ఉంటుంద‌ని చెప్పారు.  రాజ మార్గాలు, మెట్రో లు, ఇంకా జ‌ల మార్గాల నిర్మాణం ఉపాధి అవ‌కాశాలను, ప్ర‌త్యేకించి త‌యారీ, నిర్మాణం, ఇంకా సేవా రంగాల లో ఉపాధి  అవకాశాల‌ను సృష్టించ గ‌లుగుతుంద‌న్నారు.  2014వ సంవ‌త్స‌రం లో ప్ర‌తి రోజు 12 కిలో మీట‌ర్ల రాజ మార్గాల నిర్మాణం తో పోల్చి చూస్తే ప్ర‌స్తుతం ఈ నిర్మాణం ప్ర‌తి రోజు 27 కిలో మీట‌ర్ల మేర‌కు జ‌రుగుతోంద‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు.  భార‌త‌దేశం లో ప‌రివ‌ర్త‌న కై కేంద్ర ప్ర‌భుత్వం యొక్క సంక‌ల్పం మ‌రియు దార్శ‌నిక‌త ల‌ను ఇది చాటుతోంద‌ని ఆయ‌న అన్నారు.

|

 

|

దేశం లో యువ‌తీ యువ‌కుల ఆకాంక్ష‌ ల‌ను నెర‌వేర్చ‌డం కోసం ప్ర‌భుత్వం దీక్షాబ‌ద్ధురాలై ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  యువ‌త నూత‌న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డం లో శ్రీ విశ్వ‌క‌ర్మ స్కిల్ యూనివ‌ర్సిటీ ఒక ప్ర‌ధానమైన పాత్ర ను పోషించ‌గ‌ల‌ద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వ దార్శ‌నిక‌త‌ కు కార్యరూపం క‌ల్పించ‌డం లో హ‌రియాణా రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ఫ‌లం కావ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.  దేశం కోసం హరియాణా యువ‌త అందిస్తున్న తోడ్పాటును, ప్ర‌త్యేకించి క్రీడారంగం లో వారు అందిస్తున్న తోడ్పాటు ను ఆయ‌న ప్ర‌శంసించారు.

|

 

|

 

|

Click here to read full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
The Modi Doctrine: India’s New Security Paradigm

Media Coverage

The Modi Doctrine: India’s New Security Paradigm
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 మే 2025
May 10, 2025

The Modi Government Ensuring Security, Strength and Sustainability for India