ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఇటీవల జరిగిన డెఫి లింపిక్స్ లో పాల్గొన్న క్రీడా కారుల బృందానికి ఈరోజు తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు. మున్నెన్నడూ లేని రీతిలో భారత క్రీడాకారులు బ్రెజిల్ లో జరిగిన డెఫిలింపిక్స్ లో 8 స్వర్ణ పతకాలతో పాటు మొత్తం 16 పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, శ్రీ నిషిత్ ప్రమాణికక్‌లు పాల్గొన్నారు
డెఫిలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారుల బృందంలో సీనియర్ సభ్యుడు శ్రీ రోహిత్ భకెర్ తో మాట్లాడుతూ ప్రధానమంత్రి తాను సవాళ్లను ఎదుర్కొనే తీరు , ప్రత్యర్థులను అంచనా వేసే విధానం గురించి చర్చించారు. రోహిత్ కూడా తన నేపథ్యం గురించి, క్రీడలవైపు రావడానికి తన కు స్ఫూర్తి గురించి, సుదీర్ఘకాలం ఉన్నతస్థాయి నిలుపుకోవడం గురించి ప్రధానమంత్రికి తెలిపారు..
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడితో మాట్లాడుతూ, తన వ్యక్తిగ జీవితంలో తనకు క్రీడాకారుడే స్పూర్తి అన్నారు. జీవితంలో అడ్డంకులకు తలవంచకుండా పట్టుదలతో విజయాలు సాధిస్తున్నందుకు ప్రధానమంత్రి అతనిని అభినందించారు. ఈ క్రీడాకారుడి ఉత్సాహాన్నీ, వయసు పెరుగుతున్న కొద్దీ మరింత ప్రతిభను ప్రదర్శిస్తున్న తీరును ప్రధానమంత్రి అభినందించారు. అభినందనలకు పొంగిపోకుండా ఉండడం, సాధించిన విజయాలతో సంతృప్తి పొందకపోవడం క్రీడాకారుడి కీలక లక్షణమని ప్రధానమంత్రి అన్నారు. క్రీడాకారుడు ఎప్పుడూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దానిని సాధించేందుకు కృషి చేస్తాడని అన్నారు.
రెజ్లర్ వీరేంద్ర సింగ్ , రెజ్లింగ్‌లో తన కుటుంబం చూపిన ప్రతిభ గురించి ఆ వారసత్వం గురించి తెలిపారు. బధిరుల కమ్యూనిటీలో పోటీ, అవకాశాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీరేంద్ర సింగ్ 2005 డెఫిలింపిక్స్ నుంచి పతకాలు సాధిస్తూ తన ప్రతిభను కనబరుస్తూ రావడాన్ని , మరింత ప్రతిభ కనబరచాలన్న ఆయన తపనను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఒక అనుభవజ్ఞుడైన క్రీడాకారుడిగా, క్రీడను ఆసక్తిగా నేర్చుకునే వ్యక్తిగా ఆయన స్థానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. “మీ సంకల్ప శక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. దేశంలోని యువత , క్రీడాకారులు క్రీడలలో మీరు చూపుతున్న ప్రతిభను చూసి ఎంతో నేర్చుకోవచ్చు. అత్యున్నత స్థాయికి చేరుకోవడం చాలా కష్టం, ఉన్నతస్థాయిలో ఉంటూ మరింత అభివృద్ధి చెందడానికి ప్రయత్నించడం మరింత కష్టం”, అని ప్రధాన మంత్రి అన్నారు.
క్రీడలలో ప్రతిభ కనబరచడంలో తన కుటుంబ సభ్యుల మద్దతు గురించి షూటర్ ధనుష్ ప్రస్తావించారు. యోగా , ధ్యానం తనకు ఎంతగా ఉపకరించిందీ ఆయన వివరించారు. తన తల్లి తనకు మార్గదర్శి అని ఆయన అన్నారు. ధనుష్‌కు అండగా నిలుస్తున్న కుటుంబానికి,తల్లికి అభినందనలు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఖేలో ఇండియా కార్యక్రమం క్రీడాకారులకు ఎంతో సహాయపడుతుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
షూటర్ ప్రియేషా దేశ్‌ముఖ్ తన క్రీడా ప్రస్థానం గురించి , తనకు తన కుటుంబం నుంచి లభించిన మద్దతు, కోచ్ అంజలి భగవత్ మద్దతు గురించి ప్రస్తావించారు. పునేకర్ ప్రియేషా అద్భుతంగా హిందీలో మాట్లాడుతుండడాన్ని కూడా ప్రధానమంత్రి గుర్తించారు.
టెన్నిస్ క్రీడాకారిణి జఫ్రీన్ షేక్ తనకు తన తండ్రి నుంచి , కుటుంబం నుంచి లభించిన ప్రోత్సాహం, మద్దతు గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రితో మాట్లాడుతున్నందుకు ఆమె తన ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోని ఆడపిల్లల పరాక్రమానికి, సామర్థ్యానికి పర్యాయపదంగా ఉండటమే కాకుండా యువతులకు మీరు రోల్ మెడల్ అని ప్రధాని అమెను అన్నారు. "భారతదేశపు ఆడబిడ్డలు ఏదైనా లక్ష్యంపై దృష్టి సారిస్తే, ఏ అడ్డంకీ వారిని ఆపలేదని మీరు నిరూపించారు" అని ప్రధాన మంత్రి ఆమెను కొనియాడారు.
ఈ క్రీడాకారులుసాధించిన విజయాలు ఎంతో గొప్పవని, క్రీడలపట్ల వారికి గల ఆసక్తి భవిష్యత్‌లో వారికి మరింత ప్రతిష్ఠను తీసుకురానున్నదని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆసక్తి, ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించండి. ఈ ఆసక్తి దేశ పురోగతికి మరిన్ని అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. ఉజ్వల మైన భవిష్యత్తుఉంటుంది అని ప్రధానమంత్రి అన్నారు. దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడలలో రాణిస్తే అది, క్రీడలలో సాధించిన దానికంటే మించి ఉన్నతమైన విజయమని అన్నారు. ఇది దేశ సంస్కృతిని, సున్నితత్వాన్ని ప్రతిఫలింపచేస్తుందన్నారు. దేశంలో వారి సామర్ధ్యాలపట్ల ఎంతో గౌరవం ఉందన్నారు. అందువల్ల, మీరు క్రీడలలో సాధించిన ప్రతిభ ఇతర క్రీడాకారులు సాధించిన దానికన్న ఎన్నో రెట్లు ఎక్కువ సానుకూల ఇమేజ్‌ను పెంపొందింప చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
క్రీడాకారులతో ముచ్చటించిన అనంతరం ప్రధానమంత్రి ట్వీట్ చేస్తూ, డెఫిలింపిక్స్‌లో దేశానికి గర్వకారణంగా నిలిచిన, దేశ ప్రతిష్ఠను ఇనుమడింపచేసిన మన ఛాంపియన్ లతో ముచ్చటించడం మరువలేనిదని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ అనుభవాలను ప్రస్తావించారు. వారిలో క్రీడలపట్ల ఆసక్తి, పట్టుదలను చూశాను. క్రీడాకారులందరికీ నా అభినందనలు అని ప్రధానమంత్రి ట్వీట్ లో పేర్కొన్నారు. మన ఛాంపియన్ల కారణంగా ఈ సారి డెఫిలింపిక్స్ ఇండియాకు అద్భుతమైనవిగా ఆయన అభివర్ణించారు.
I will never forget the interaction with our champions who have brought pride and glory for India at the Deaflympics. The athletes shared their experiences and I could see the passion and determination in them. My best wishes to all of them. pic.twitter.com/k4dJvxj7d5
— Narendra Modi (@narendramodi) May 21, 2022
Some more glimpses from the interaction with our champions. pic.twitter.com/JhtZb9rikH
— Narendra Modi (@narendramodi) May 21, 2022
It is due to our champions that this time’s Deaflympics have been the best for India! pic.twitter.com/2ysax8DAE3
— Narendra Modi (@narendramodi) May 21, 2022