ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ దర్గా లో సమర్పించడానికిగాను ‘‘చాదర్’’ ను ఈ రోజు అల్పసంఖ్యాక వర్గాల వారి వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీకి మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ లు, అణు శక్తి, ఇంకా అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లకు ఈ రోజు న్యూ ఢిల్లీ లో అప్పగించారు.
అలాగే, ప్రధాన మంత్రి ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ వార్షిక ఉర్స్ సందర్భంగా ప్రపంచమంతటా విస్తరించివున్న ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ అనుయాయులకు అభినందనలను మరియు శుభాకాంక్షలను కూడా తెలియజేశారు.
ప్రధాన మంత్రి తన సందేశంలో భారతదేశపు ఘనమైన ఆధ్యాత్మిక సంబంధ సంప్రదాయాలకు ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ ఒక సంకేతం అని పేర్కొన్నారు. మానవ జాతికి గరీబ్ నవాజ్ అందించిన సేవలు భవిష్యత్తు తరాల వారికి ఒక ప్రేరణగా నిలుస్తాయని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న ఉర్స్ నిర్వహణ విజయవంతం కావాలని ఆయన తన శుభాకాంక్షలు అందజేశారు.
PM hands over the Chaadar to be offered at Dargah of Khwaja Moinuddin Chishti, Ajmer Sharif to Ministers @naqvimukhtar & @DrJitendraSingh. pic.twitter.com/pmw3qwnt32
— PMO India (@PMOIndia) March 24, 2017