ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ శాస్త్ర విజ్ఞాన దినం నాడు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో సర్ సి.వి. రామన్ చేసిన కృషికి గాను ఆయనకు ప్రధాన మంత్రి వందనమాచరించారు.
“జాతీయ శాస్త్ర విజ్ఞాన దినాన్ని పురస్కరించుకొని మన శాస్త్ర విజ్ఞాన రంగంలోని వారందరికీ ఇవే నా అభినందనలు మరియు శుభాకాంక్షలు. దేశ నిర్మాణంలోను, దేశ పురోగతిలోను వారు పోషిస్తున్నటువంటి పాత్ర అత్యంత ప్రధానమైంది.
శాస్త్ర విజ్ఞాన రంగానికి మార్గదర్శకత్వం వహించే తరహా సేవలను అందించినందుకుగాను సర్ సి. వి. రామన్ కు మనం ప్రణమిల్లుదాం. ఆయన చేసిన కృషి, సైన్స్ పట్ల ఉత్సాహాన్ని కనబరిచే నవ తరం ప్రతినిధులకు ప్రేరణగా నిలుస్తుంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
On #NationalScienceDay, my greetings & best wishes to our scientific community. Their role in nation building & advancement is paramount.
— Narendra Modi (@narendramodi) February 28, 2017
We salute Sir CV Raman for his pioneering contribution to science, which continues to inspire generations of science enthusiasts.
— Narendra Modi (@narendramodi) February 28, 2017
Sharing my speech at Indian Science Congress. https://t.co/wx8cd9kJ5h
— Narendra Modi (@narendramodi) February 28, 2017