క్రిస్మస్ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘‘సంతోషభరిత క్రిస్మస్! ఏసుక్రీస్తు ఉదాత్త భావనలను మనమెంతో ఆనందోత్సాహాలతో స్మరించుకుంటాం. కరుణ, సేవల స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన- మానవాళి వేదనను తొలగించేందుకు జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తాయి’’ అని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Merry Christmas!
— Narendra Modi (@narendramodi) December 25, 2019
We remember, with immense joy, the noble thoughts of Jesus Christ. He epitomised spirit of service and compassion, devoting his life towards alleviating human suffering.
His teachings inspire millions across the world.