జాతీయ వోటర్ల దినోత్సవం సందర్భం గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
‘‘జాతీయ వోటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవే అభినందనలు. స్థానిక, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి లలో ప్రజాస్వామిక ప్రక్రియ లలో క్రమం తప్పక పాలుపంచుకోవడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశ గా మన నిబద్ధత ను పునరుద్ఘాటించేందుకు ఉద్దేశించిన రోజు ఈ రోజు. మీరు ఆ పని ని చేసినందువల్ల ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్కరించడం లో ఎంతో తోడ్పాటు అందినట్లు అవుతుంది.
వోటర్ల నమోదు పట్ల చైతన్యాన్ని నెలకొల్పవలసింది గా అన్ని రంగాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను; ప్రత్యేకించి నా యువ మిత్రులను నేను అభ్యర్థించేది ఏమిటంటే, వారంతా వోటర్లు గా వారి పేర్ల ను ఈసరికే నమోదు చేసుకోనట్లయితే గనక ఆ పని ని పూర్తి చేయండని వారిని నేను అభ్యర్ధిస్తున్నాను. వేసే ప్రతి ఒక్క వోటు కూడాను మన ప్రజాస్వామ్య వ్యవస్థ ను వర్ధిల్లజేస్తుంది’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Greetings on #NationalVotersDay. This is a day to reaffirm our commitment towards further strengthening our democracy by unfailingly participating in democratic processes at the local, state and national levels. Your doing so will go a long way in building a New India.
— Narendra Modi (@narendramodi) January 25, 2019
I urge people from all walks of life to create awareness on voter registration and especially request my young friends to register themselves as voters if they have not done so already. Every vote cast enhances our democratic fabric.
— Narendra Modi (@narendramodi) January 25, 2019