తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం నాడు ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
‘‘తెలంగాణ ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినం నాడు ఇవే నా శుభాకాంక్షలు. ఆ రాష్ట్ర ప్రజల యొక్క కలలు మరియు ఆకాంక్షలు రానున్న కాలంలో నెరవేరు గాక.
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నా సోదరులకు మరియు సోదరీమణులకు శుభాకాంక్షలు. ఆ రాష్ట్ర ప్రజలకు చక్కని ఆరోగ్యం మరియు సమృద్ధి లభించాలంటూ ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
On their Statehood Day, my best wishes to the people of Telangana. May the dreams and aspirations of the people of the state be fulfilled in the years to come.
— Narendra Modi (@narendramodi) June 2, 2018
Greetings to my sisters and brothers of Andhra Pradesh. I pray for the good health and prosperity of the people of the state.
— Narendra Modi (@narendramodi) June 2, 2018