PM Narendra Modi appreciates the role of media on #NationalPressDay
#NationalPressDay: The role of the media in giving voice to the voiceless is commendable, says PM Modi
Media has added great strength to ‘Swachh Bharat Mission’ and effectively furthered the message of cleanliness: PM Narendra Modi #NationalPressDay
A free press is the cornerstone of a vibrant democracy: PM Narendra Modi #NationalPressDay

ప్ర‌సార మాధ్య‌మాలలో విధులు నిర్వ‌హిస్తున్న వారికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేష‌న‌ల్ ప్రెస్ డే సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలిపారు.

‘‘ప్ర‌సార మాధ్య‌మాల‌ లోని మిత్రులంద‌రికీ జాతీయ ప‌త్రికా రంగ దినాన్ని పుర‌స్క‌రించుకొని నా అభినంద‌న‌లు. మ‌న ప్ర‌సార మాధ్య‌మాల యొక్క క‌ఠోర పరిశ్ర‌మ‌ను.. ప్ర‌త్యేకించి దేశ విదేశాల‌లో ప్రభుత్వాల పనితీరును ప్ర‌భావితం చేసే వేరు వేరు వార్త‌ల‌ను అందించ‌డం కోసం అల‌స‌ట అనేదే ఎరుగ‌క పని చేస్తున్నటువంటి విలేక‌రులను మ‌రియు కెమెరా ప‌ర్స‌న్స్ ను.. నేను ప్ర‌శంసిస్తున్నాను.

గ‌ళం లేని వర్గాల వారికి గ‌ళాన్నివ్వ‌డంలో ప్ర‌సార మాధ్య‌మాల పాత్ర అభినంద‌నీయ‌ం. గ‌త మూడు సంవ‌త్స‌రాల కాలంలో ‘స్వచ్చ భార‌త్ అభియాన్’ కు ప్ర‌సార మాధ్య‌మాలు గొప్ప బలాన్ని జోడించడంతో పాటు స్వ‌చ్ఛ‌త సందేశాన్ని చక్కనైన రీతిలో ముందుకు తీసుకుపోయాయి.

ప్ర‌స్తుత కాలంలో మనం సామాజిక మాధ్య‌మాలు వ‌ర్ధిల్ల‌డాన్ని గమనిస్తున్నాం; మొబైల్ ఫోన్ లలో వార్తలను తెలుసుకొంటున్నారు. ఈ విధ‌మైన పురోగ‌తి ప్ర‌సార మాధ్య‌మాల ప‌రిధిని తప్పక మ‌రింత విస్తృత ప‌రుస్తుందని మరియు ప‌త్రికా రంగాన్ని మ‌రింత మందికి భాగం పంచేదిగాను, మ‌రింత ప్ర‌జాస్వామ్య‌యుతంగాను తీర్చిదిద్ద‌గ‌ల‌దని నేను న‌మ్ముతున్నాను.

ఏ చైత‌న్య‌శీల ప్ర‌జాస్వామ్యానికైనా స్వేచ్ఛాయుత‌ ప‌త్రికా రంగం అనేది ఒక మూల స్తంభం వంటిది. ప‌త్రికా రంగ స్వాతంత్య్రాన్ని మ‌రియు అన్ని రూపాల‌లో అభిప్రాయ వ్య‌క్తీక‌ర‌ణ‌ను ప‌రిర‌క్షించ‌డానికి మేము సంపూర్ణంగా నిబ‌ద్ధ‌ులమై ఉంటాము. 125 కోట్ల మంది భార‌తీయుల నైపుణ్యాల‌కు, బ‌లాల‌కు మ‌రియు సృజనాత్మ‌క‌త‌కు అద్దం పట్టడంలో ప‌త్రికారంగం తోడ్పడు గాక’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award

Media Coverage

PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi remembers former PM Chaudhary Charan Singh on his birth anniversary
December 23, 2024

The Prime Minister, Shri Narendra Modi, remembered the former PM Chaudhary Charan Singh on his birthday anniversary today.

The Prime Minister posted on X:
"गरीबों और किसानों के सच्चे हितैषी पूर्व प्रधानमंत्री भारत रत्न चौधरी चरण सिंह जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। राष्ट्र के प्रति उनका समर्पण और सेवाभाव हर किसी को प्रेरित करता रहेगा।"