ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 వ సంవత్సరపు ఏశియన్ పారా గేమ్స్ లో పతకాల ను గెలుచుకొన్న వారి తో నేడు సమావేశమై, వారిని అభినందించారు.
ప్రధాన మంత్రి ఈ సందర్భం గా మాట్లాడుతూ పతక విజేతల కు ఆహ్వానం పలకడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వారి ప్రదర్శన ను ఆయన మెచ్చుకొని, వారి మానసిక బలం వారి సాఫల్యం లో ఓ కీలకాంశం గా ఉందంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ రంగస్థలం పైన భారతదేశం యొక్క పేరు ను నిలబెట్టడం లో తోడ్పాటు అందించినందుకు వారి ని ప్రధాన మంత్రి అభినందించారు.
పతకాల విజేతల శిక్షకుల కు కూడా ప్రధాన మంత్రి అభినందనలు తెలియజేశారు.
క్రీడాకారులు వారి లోపలి ఆశాభావాన్ని పదిలపరచుకోవాలని, అలాగే మరిన్ని శిఖరాలకు చేరుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉండాలని ఆయన కోరారు.