ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశమంతటా నూతన సంవత్సరాది పండుగను జరుపుకొంటున్న పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికీ ఈ నూతన సంవత్సరం శాంతిని, సంతోషాన్ని, సమృద్ధిని ప్రసాదించుగాక అంటూ ప్రధాన మంత్రి ట్విటర్ లో రాసిన వరుస ట్వీట్ లలో తన అంతరంగ భావనలను పంచుకొన్నారు.
“భారతదేశం అంతటా ప్రజలు నూతన సంవత్సర ఆరంభాన్ని వేడుకగా జరుపుకొంటున్నారు. ప్రతి ఒక్కరికీ ఇవే నా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శాంతిని, సంతోషాన్ని, సమృద్ధిని ప్రసాదించుగాక.
దేశ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు నవరాత్రి సందర్భంగా శత కోటి శుభాభినందనలు. నూతన సంవత్సరం సమృద్ధిని, ప్రసన్నతను, ఇంకా మంచి ఆరోగ్యాన్ని మన అందరి జీవితాలలోకీ తీసుకురావాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
మణిపూర్ లోని నా సోదర, సోదరీమణులకు సాజిబు చీరావ్ బా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీకు ఉల్లాసాన్ని, సామరస్యాన్ని పంచుగాక.
మంగళప్రదమైన నవ్ రేహ్ సందర్భంగా, ఈ పండుగను జరుపుకొంటున్న ప్రతి ఒక్కరికీ ఇవే నా శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం సానుకూల భావనలకు, చక్కని ఆరోగ్యానికి ఒక ప్రతీకగా ఉండు గాక.
ఉగాది పండుగను జరుపుకొంటున్న వారందరికీ ఆ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీ అందరి అభిలాషలను నెరవేర్చు గాక; ఎల్లెడెలా సంతోషం వర్ధిల్లు గాక.
సింధీ సముదాయానికి చేటీ చాంద్ శుభాకాంక్షలు. ప్రభువు ఝూలే లాల్ మనందరినీ ఆశీర్వదించు గాక; కొత్త సంవత్సరం సంతోషభరితంగాను, స్మరణీయమైందిగాను ఉండు గాక.
గుడి పాడ్వా ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని, మహారాష్ట్ర ప్రజలకు ఇవే నా శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సంతోషాన్ని, చక్కని ఆరోగ్యాన్ని, సమృద్ధిని ప్రసాదించు గాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
People across India are celebrating the start of the new year. New year greetings to everyone. May the year bring peace, joy & prosperity.
— Narendra Modi (@narendramodi) March 28, 2017
नववर्ष और नवरात्रि की देशवासियों को कोटि-कोटि बधाई। नवसंवत्सर हम सभी के जीवन में समृद्धि, खुशहाली और अच्छा स्वास्थ्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) March 28, 2017
Sajibu Cheiraoba wishes to my sisters & brothers in Manipur. Have a cheerful & harmonious year ahead.
— Narendra Modi (@narendramodi) March 28, 2017
On the auspicious occasion of Navreh, my greetings to everyone celebrating. May the year ahead be characterised by positivity & good health.
— Narendra Modi (@narendramodi) March 28, 2017
Ugadi greetings to all those celebrating. May the coming year fulfil all your wishes & may there be happiness all around.
— Narendra Modi (@narendramodi) March 28, 2017
Cheti Chand greetings to the Sindhi community. May Lord Jhulelal bless us and the year ahead be a happy as well as memorable one.
— Narendra Modi (@narendramodi) March 28, 2017
Wishing the people of Maharashtra on the special occasion of Gudi Padwa. May the coming year bring happiness, good health & prosperity.
— Narendra Modi (@narendramodi) March 28, 2017