బ్రెజిల్‌లో నిర్వహిస్తున్న “బధిర ఒలింపిక్స్ (డెఫ్లింపిక్స్)-2021”లో పాల్గొంటున్న ప్రతిభావంతులైన భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడలకు బయల్దేరే ముందు వారు జాతీయ యుద్ధస్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడం తన హృదయాన్ని తాకిందని శ్రీ మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో;
“జర్మనీలో ఇవాళ ప్రారంభమయ్యే #Deaflympics2021లో పాల్గొనే భారత బృందాన్ని భారతదేశం హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తోంది. ప్రతిభావంతులైన మన క్రీడాకారులదరికీ శుభాకాంక్షలు. ఈ క్రీడోత్సవాలకు బయల్దేరేముందు వారంతా జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించడం నిజంగా నన్నెంతగానో కదిలించింది” అని ప్రధాని పేర్కొన్నారు.
India is cheering for our contingent at the #Deaflympics2021 which commence today. Best wishes to all our talented athletes.
— Narendra Modi (@narendramodi) May 1, 2022
I was really touched by their gesture of visiting the National War Memorial before heading to the games. https://t.co/J6PEBCBBJU