బాంగ్లాదేశ్ లో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణ నష్టం వాటిల్లడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి బాంగ్లాదేశ్ కు భారతదేశం యొక్క సంఘీభావాన్నివ్యక్తం చేస్తూ, ఒకవేళ అవసరపడితే అన్వేషణ, రక్షణ యత్నాలలో సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు.
‘‘బాంగ్లాదేశ్ లో కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణ నష్టం వాటిల్లడం విచారకరం. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాల శోకంలో పాలు పంచుకొంటున్నాము. ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాము.
బాంగ్లాదేశ్ తో భారతదేశం భుజం భుజం కలిపి నిలబడుతుంది. ఒకవేళ అవసరపడితే అన్వేషణ, రక్షణ యత్నాలలో సహాయాన్ని అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Saddened by the loss of lives in Bangladesh due to landslides. My thoughts are with the families of the deceased & prayers with the injured.
— Narendra Modi (@narendramodi) June 13, 2017
India stands shoulder to shoulder with Bangladesh. We stand ready to support local search and rescue efforts if required.
— Narendra Modi (@narendramodi) June 13, 2017