ఇ-శ్రమ్ (e-Shram) లో 10 కోట్ల కు పైగా నమోదు లు జరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ సంతోషాన్నివ్యక్తం చేస్తూ, ఈ పరిణామాన్ని దృఢ సంకల్పం నుంచి మొదలై, కార్య సాధన వరకు సాగిన యాత్ర అంటూ అభివర్ణించారు.
శ్రమ మరియు ఉపాధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ –
‘‘ఇదే కదా సంకల్పం నుంచి సిద్ధి వైపునకు (संकल्प से सिद्धि) జరిగినటువంటి యాత్ర. దేశం లోని కోట్ల కొద్దీ శ్రమికుల మరియు కార్మికుల సామర్ధ్యం ప్రస్తుతం నవ భారతదేశాని కి ఆధార స్తంభం గా మారుతున్నది. వారికి సామాజిక సురక్ష ను కల్పించడం లోనే దేశం యొక్క పటిష్టమైనటువంటి భవిష్యత్తు దాగి ఉంది.’’ అని పేర్కొన్నారు.
"यही तो संकल्प से सिद्धि की यात्रा है। देश के करोड़ों श्रमिकों और कामगारों का सामर्थ्य आज नए भारत का आधारस्तंभ बन रहा है। उनकी सामाजिक सुरक्षा में ही देश का मजबूत भविष्य छिपा है।"
यही तो संकल्प से सिद्धि की यात्रा है। देश के करोड़ों श्रमिकों और कामगारों का सामर्थ्य आज नए भारत का आधारस्तंभ बन रहा है। उनकी सामाजिक सुरक्षा में ही देश का मजबूत भविष्य छिपा है। https://t.co/2NdVPsiiGO
— Narendra Modi (@narendramodi) December 1, 2021