హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లా లో కొండ చరియలు విరిగి పడటంతో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
“హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లా లో కొండ చరియలు విరిగి పడి ప్రమాదాలకు దారి తీయడంతో ప్రాణ నష్టం వాటిల్లినందుకు బాధపడ్డాను. మృతుల కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను.
హిమాచల్ ప్రదేశ్ లోని మండీ జిల్లాలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను.
రక్షణ మరియు సహాయక కార్యకలాపాలలో పాలుపంచుకొని అవసరమైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందించడానికి ఎన్‌డిఆర్ఎఫ్ బృందం మండీకి తరలివెళ్తోంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Pained by the loss of lives due to landslide related accidents in HP’s Mandi district. My condolences with the families of the deceased: PM
— PMO India (@PMOIndia) August 13, 2017
I pray for the quick recovery of those injured in Mandi district, Himachal Pradesh: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 13, 2017
Team of @NDRFHQ is going to Mandi to take part in the rescue and relief operations and provide all possible assistance required.
— PMO India (@PMOIndia) August 13, 2017