వరిష్ఠ హిందీ కవి శ్రీ కేదార్‌నాథ్ సింగ్ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘మహా కవి, రచయిత శ్రీ కేదార్‌నాథ్ సింగ్ మరణం తీవ్ర దు:ఖదాయకం. ఆయన ప్రజా జీవనం లోని మనోభావాలకు తన కవిత్వంలో స్థానం కల్పించారు. సాహితీ జగత్తుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఆయన ఎల్లప్పటికీ ఒక ప్రేరణగా నిలుస్తారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
శ్రీ కేదార్‌నాథ్ సింగ్ కు 2013 లో జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ‘‘అభీ బిల్‌కుల్ అభీ’’, ‘‘జమీన్ పాక్ రహీ హై’’, ‘‘అకాల్ మే సారస్’’ తదితర సాహితీ కృతుల ద్వారా ఆయన ప్రసిద్ధికెక్కారు.
हिन्दी के महान कवि-साहित्यकार केदारनाथ सिंह जी के निधन से गहरा दुख हुआ है। उन्होंने लोकजीवन की संवेदनाओं को अपनी कविताओं में जगह दी। साहित्य जगत और सामान्य जन दोनों को हमेशा उनसे प्रेरणा मिलती रहेगी। ईश्वर दिवंगत आत्मा को शांति दे और परिवार को इस दुखद घड़ी में संबल प्रदान करे: PM
— PMO India (@PMOIndia) March 20, 2018