ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంలో ఉపాధ్యాయుల కు కృతజ్ఞతలు తెలియజేయడం తో పాటు డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ కు శ్రద్ధాంజలి కూడా సమర్పించారు.
ప్రధాన మంత్రి ‘‘మన దేశాన్ని నిర్మించడంలో, మన మేధలను తీర్చిదిద్దడంలో తోడ్పాటును అందించేందుకు చిత్తశుద్ధితో శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు మనం కృతజ్ఞులమై ఉందాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంలో మన ఉపాధ్యాయుల అసాధారణ ప్రయాసల పట్ల వారికి మనం మన కృతజ్ఞతను వ్యక్తం చేద్దాం. డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ కు ఆయన జయంతి రోజున మనం శ్రద్ధాంజలి సమర్పిద్దాం.’’
‘‘మన దేశ విఖ్యాత చరిత్ర తో మన బంధాన్ని గాఢతరం గా మార్చడానికి జ్ఞానవంతులైన మన ఉపాధ్యాయుల కన్నా ఉత్తములైన వారు మరెవరు ఉన్నారు. మన ఘనమైన స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన అంతగా వెలుగులోకి రాని దృష్టికోణాలను సైతం విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులను గురించి నా ఆలోచనలను ఇటీవలి #మన్ కీ బాత్ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో నేను వెల్లడించాను’’ అని వరస ట్వీట్ లలో పేర్కొన్నారు.
We remain grateful to the hardworking teachers for their contributions towards shaping minds and building our nation. On Teachers Day, we express gratitude to our teachers for their remarkable efforts. We pay tributes to Dr. S. Radhakrishnan on his Jayanti. #OurTeachersOurHeroes
— Narendra Modi (@narendramodi) September 5, 2020
Who better than our knowledgeable teachers to deepen our connect with our nation’s glorious history. During the recent #MannKiBaat, I had shared an idea of teachers teaching students about lesser known aspects of our great freedom struggle. #OurTeachersOurHeroes pic.twitter.com/rsJiU3juLA
— Narendra Modi (@narendramodi) September 5, 2020