PM Modi dedicates Garjanbahal coal mines and the Jharsuguda-Barapali-Sardega rail link to the nation
PM Modi inaugurates Jharsuguda airport in Odisha
Jharsuguda airport is well located to serve the needs of the people of Odisha: PM Modi
Our Government has devoted significant efforts to enhance connectivity all over the nation, says PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒడిశా ను నేడు సంద‌ర్శించారు.  తాల్‌చ‌ర్ లో, ఆయ‌న తాల్‌చ‌ర్ ఎరువుల క‌ర్మాగారం పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల ప్రారంభానికి గుర్తుగా ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఎరువుల క‌ర్మాగారం ప‌ని ని ప్రారంభించే దిశ గా ఓ ముఖ్య‌మైన అడుగు ను వేయడం ప‌ట్ల తన హర్షాన్ని వ్య‌క్తం చేశారు.  చాలా కాలం కింద‌ట నెర‌వేర‌వ‌ల‌సిన క‌ల‌ ల‌ను మేము నెర‌వేర్చుతున్నాము అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  భార‌త‌దేశాన్ని వృద్ధి లో కొత్త శిఖ‌రాల‌కు తీసుకుపోవ‌డం ప్ర‌భుత్వం యొక్క ధ్యేయ‌ం అని ఆయ‌న చెప్పారు.  ఇక్క‌డి ఎరువుల క‌ర్మాగారం వంటి ప‌థ‌కాలు భార‌తదేశం వృద్ధి గాథ లో కేంద్ర బిందువు వంటివ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ఈ క‌ర్మాగారం అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోనుంద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు.

ఝార్‌సుగుడా లో ప్ర‌ధాన మంత్రి ఝార్‌సుగుడా విమానాశ్ర‌యాన్ని ప్రారంభించారు.  ఝార్‌సుగుడా నుండి రాయ్‌పుర్ కు ప్రయాణించే తొలి విమాన స‌ర్వీసు కు ప్రారంభ సూచ‌కంగా ఆయన ఒక జెండా ను  చూపారు.  అలాగే, గ‌ర్‌జ‌న్‌బ‌హాల్ బొగ్గు గ‌నుల‌ను మ‌రియు ఝార్‌సుగుడా-బారాపాలీ-స‌ర్‌దేగా రైల్వే మార్గాన్ని కూడా ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.  దులాంగ బొగ్గు గ‌నుల నుండి బొగ్గు ఉత్ప‌త్తి , ర‌వాణా ల ప్రారంభ సూచకం గా ఏర్పాటు చేసిన ఒక ఫ‌ల‌కాన్ని కూడా ఆయ‌న ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భం లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, ఒక విమానాశ్ర‌యాన్ని,ఇత‌ర అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభించ‌డం కోసం ఝార్‌సుగుడా కు త‌ర‌లి రావ‌డం త‌న‌కు సంతోషాన్నిచ్చిందన్నారు.  ఈ అభివృద్ధి ప‌నులు ఒడిశా ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేస్తాయి అని ఆయ‌న చెప్పారు.

భార‌త‌దేశం లో విమానయాన రంగం శ‌ర వేగంగా ప‌రివ‌ర్త‌న చెందుతోంద‌ని, ఈ పరిణామం 125 కోట్ల మంది భార‌తీయుల‌కు శుభ సంకేతం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఝార్‌సుగుడా లోని ఈ విమానాశ్ర‌యం ఒడిశా ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చేందుకు చ‌క్క‌ని ప్రాంతం లో ఏర్పాటైంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  సంధానం అనేది స‌ర్వ‌తోముఖాభివృద్ధి కి కీల‌క‌మైన‌టువంటిది  అని ఆయ‌న వివ‌రించారు.  దేశమంత‌టా సంధానాన్ని ఇనుమ‌డింపజేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చెప్పుకోద‌గ్గ కృషి చేస్తోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi