శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఆయన మంత్రిమండలి సభ్యులు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గాను మరియు ఉత్తర్ ప్రదేశ్ మంత్రులు గాను ప్రమాణాలను స్వీకరించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినందనల ను వ్యక్తం చేశారు.
గడచిన అయిదు సంవత్సరాల లో అనేక కార్యసాధనల ను ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ముఖ్యమంత్రి నాయకత్వం లో రాష్ట్రం అభి వృద్ధి తాలూకు ఒక కొత్త అధ్యయాన్ని లిఖిస్తుందన్న ఆశ ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ప్రమాణం స్వీకరించిన సందర్భం లో @myogiadityanath గారి కి మరియు ఆయన మంత్రిమండలి కి ఇవే హృదయపూర్వక అభినందన లు. గత 5 సంవత్సరాల లో రాష్ట్రం యొక్క వికాస యాత్ర అనేక మైలురాళ్ల ను మించి పయనించింది. మీ నాయకత్వం లో రాష్ట్రం ప్రజల ఆకాంక్షల ను పూర్తి చేస్తూ ప్రగతి తాలూకు ఒక కొత్త అధ్యయాన్ని లిఖిస్తుందని నాకు విశ్వాసం ఉంది.’’ అని పేర్కొన్నారు.
उत्तर प्रदेश के मुख्यमंत्री पद की शपथ लेने पर @myogiadityanath जी और उनके मंत्रिमंडल को हार्दिक बधाई। पिछले 5 वर्षों में राज्य की विकास यात्रा ने कई अहम पड़ाव तय किए हैं। मुझे विश्वास है कि आपके नेतृत्व में प्रदेश जन आकांक्षाओं को पूरा करते हुए प्रगति का एक और नया अध्याय लिखेगा। pic.twitter.com/b3hcLMQsMJ
— Narendra Modi (@narendramodi) March 25, 2022