కువైట్ దేశ ప్రధానమంత్రి గా తిరిగి నియమితులైన గౌరవనీయులు షేక్ సబా అల్-ఖలీద్ అల్-హమద్ అల్-సబా ను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
ఈ విషయమై శ్రీ నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ, "డిసెంబర్, 5వ తేదీన విజయవంతంగా జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల తరువాత, కువైట్ దేశ ప్రధానమంత్రిగా తిరిగి నియమితులైనందుకు, గౌరవనీయులు షేక్ సబా అల్-ఖలీద్ అల్-హమద్ అల్-సబాకు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు.
"కువైట్ దేశ అమీర్, గౌరవనీయులు షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా నాయకత్వంలో మన అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలు విస్తరిస్తూ, మరింతగా అభివృద్ధి చెందుతాయని నాకు నమ్మకం ఉంది". అని పేర్కొన్నారు.
I am confident that our excellent bilateral relations will continue to expand and flourish under the visionary leadership of His Highness Sheikh Nawaf Al-Ahmed Al-Jaber Al-Sabah, Amir of the State of Kuwait.
— Narendra Modi (@narendramodi) December 8, 2020
Hearty congratulations and best wishes to His Highness Sheikh Sabah Al-Khaled Al-Hamad Al-Sabah, on his re-appointment as the Prime Minister of the State of Kuwait, after the successful National Assembly elections on December 5th.
— Narendra Modi (@narendramodi) December 8, 2020