చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్’ విభాగంలో రజత పతకం సాధించిన భారత విలుకాడు రాకేష్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“పురుషుల ‘ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్’ విభాగంలో రజత పతకం కైవసం చేసుకున్న పారా ఆర్చర్ రాకేష్ కుమార్‌కు అభినందనలు. భవిష్యత్తులోనూ అతడు ఇదే స్ఫూర్తితో దేశం గర్వించే మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations to para archer Rakesh Kumar for securing a brilliant Silver medal in the Men's Individual Compound Open event.
— Narendra Modi (@narendramodi) October 27, 2023
May he keep inspiring India and making the nation proud with numerous accomplishments. pic.twitter.com/D6QfZ8fwwQ