చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్-3’లో స్వర్ణ పతకం సాధించిన ప్రమోద్ భాగవత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ విజయం సాధించడంలో అతడు చూపిన పట్టుదల, నైపుణ్యం అద్వితీయమని ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్-3’లో ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం కైవసం చేసుకున్న ప్రమోద్ భాగవత్‌కు నా అభినందనలు. తుదిపోరులో అతడు చూపిన పట్టుదల, నైపుణ్యం దేశం గర్వించే విజయాన్ని సాధించడంలో తోడ్పడ్డాయి” అని ప్రధానమంత్రి కొనియాడారు.
Congratulations to @PramodBhagat83 for securing the coveted Gold in Badminton Men's Singles SL3 event.
— Narendra Modi (@narendramodi) October 27, 2023
His determination and brilliance have brought immense pride to our nation. pic.twitter.com/opWaSRgAad